
స్మార్ట్‌ఫోన్ టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ - 2స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా అయితే ఈ తప్పులు చేయకండి !!
నేటి కాలంలో మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అలాగే ఒక్క క్షణం మొబైల్ లేకపోతే జీవితంలో ఏదో కోల్పొయిన భావన కల్గుతుంది. అలా మన జీవితంలోకి చొచ్చుకుపోయింది మొబైల్ ఫోన్. మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌పై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ను అజాగ్రత్తగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల మొబైల్ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. మీరు ప్రతిరోజు వాడే స్మార్ట్‌ఫోన్‌పై మీరు చేయకూడని విషయాల గురించి చర్చింకుందాం రండి.
➙ మీ యొక్క షర్ట్ జేబులో ఫోన్‌ను పెట్టవద్దు :
వివిధ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎడమ వైపు మన గుండె ఉంటుంది కాబట్టి మన యొక్క షర్ట్ జేబులో ఫోన్‌ను ఉంచవద్దని డాక్టర్లు సిఫారసు చేస్తారు.
➙ స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా చార్జీంగ్ పెట్టవద్దు :
మన వాడే స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువసేపు చార్ట్ చేయవద్దు. 100 శాతం చార్జీంగ్ అయిన వెంటనే మొబైల్‌ను చార్జీంగ్ నుండి వేరుచేయాలి. ఇలా చేస్తే ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
➙ చార్జీంగ్ సమయంలో ఫోన్‌ను వాడవద్దు :
స్మార్ట్‌ఫోన్ చార్జీంగ్ అయ్యే సమయంలో మ్యూజిక్ వినడం కోసం ఇయర్‌ఫోన్ అటాచ్ చేయడం, కాల్స్ మాట్లాడడం వంటి పనుల వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశాలున్నాయి.
➙ స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా పెట్టి నిద్రపోండి :
చాలామంది స్మార్ట్‌ఫోన్‌ను నిద్రపోయే సమయంలో అలానే చూస్తు దిండు కిందనో, పక్కన పెట్టుకొని నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల నిద్రపోయే సమయంలో స్మార్ట్‌ఫోన్ నుండి వచ్చే సంకేతాలు మన మెదడుకు విఘాతం కల్గించవచ్చు. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది.
➙ అధిక వేడిలో చార్జింగ్ పెట్టవద్దు :
స్మార్ట్‌ఫోన్‌ను అధిక వేడిలో చార్జీంగ్ పెట్టడం వల్ల తాపన సమస్య తీవ్రతరం అవుతుంది. వీలైనంత వరకు చల్లని ప్రదేశాలలో మాత్రమే చార్జీంగ్ పెట్టాలి.
0 Comments