
దోస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2023, డిగ్రీ అడ్మిషన్TS Dost Registration 2023 Open for Phase 1; Application Process, Seat Allotment
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని 2023-24 విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీస్, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాల పరిధిలోని వివిధ కళాశాలల్లో అందించే బిఏ/ బికామ్/ బికామ్(వోకేషనల్)/బికామ్(హనర్స్)/బిఎస్సీ/బిఎస్‌డబ్ల్యూ/ బిబిఏ,/బిసిఏ,/బిబిఎం మొదలైన వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దోస్త్ తెలంగాణ - 2023 ద్వారా ఆన్‌లైన్ ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల / బోర్డు నుండి సమాన గుర్తింపు కల్గిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దోస్త్ తెలంగాణ - 2023 ప్రవేశాల కోసం మే 16, 2023 నుండి మొదటి విడత రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో కొనసాగే ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తులు చేసుకోవచ్చు.
డిగ్రీ ఆన్‌లైన్ ధరఖాస్తులు ఫేస్ -1 రిజిస్ట్రేషన్‌లు మే 16, 2023 నుండి జూన్ 10, 2023 వరకు కొనసాగనున్నాయి. మే 20 నుండి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్ చాన్స్ ఉండగా, జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది. తిరిగి జూన్ 16 నుండి జూన్ 26 వరకు ఫేస్ -2 ఆప్షన్ల ప్రక్రియ, 30 న రెండో విడత సీట్ల కేటాయింపు, జూలై 1 నుండి జూలై 6 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్స్, జూలై 10వ ఫేస్ -3 సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 17 నుండి సెమిస్టర్-1 క్లాసులు ప్రారంభం కానున్నాయి. మూడు విడతలుగా అవకాశమిచ్చి సీట్లను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అవకాశమిచ్చింది.
డిగ్రీ దోస్త్ - 2023 ఆన్‌లైన్ ఆడ్మిషన్‌ల కొరకు విద్యార్థులు ముందుగానే తమ ఆధార్‌కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. టియాప్ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నెంబర్ వస్తుంది. తర్వాత ఆన్‌లైన్ పద్దతి పూర్తి చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంచుకున్న కాలేజికి వెళ్లి ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
TS DOST 2023 – Degree Online Services Telangana
➠ దోస్త్ తెలంగాణ - 2023 ఫీజు వివరాలు :
- మొదటి విడతలో 200/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- రెండవ / మూడవ విడతలో 400/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
➠ దోస్త్ తెలంగాణ - 2023 అర్హత :
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల / బోర్డు నుండి సమాన గుర్తింపు కల్గిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ ఫేస్ - 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముఖ్యమైన తేదీలు | ||
---|---|---|
1. | నోటిఫికేషన్ | 11.05.2023 |
2. | ఫేస్ - 1 రిజిస్ట్రేషన్లు (రూ.200/- రిజిస్ట్రేషన్ ఫీజుతో) | 16.05.2023 నుండి 10.06.2023 వరకు |
3. | వెబ్ ఆప్షన్స్ | 20.05.2023 నుండి 11.06.2023 వరకు |
4. | ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల ధృవీకరణ | ఎ) 08.06.2023 - పిహెచ్ / సిఏపి బి) 09.06.2023 - ఎన్‌సిసి అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్ |
5. | ఫేస్ - 1 సీట్ల కేటాయింపు | 16.06.2023 |
6. | ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ | 16.06.2023 నుండి 25.06.2023 వరకు |
తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ ఫేస్ - 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముఖ్యమైన తేదీలు | ||
---|---|---|
7. | ఫేస్ - 2 రిజిస్ట్రేషన్స్ (రిజిస్ట్రేషన్ రుసుము రూ. 400/-తో) | 16.06.2023 నుండి 26.06.2023 వరకు |
8. | ఫేస్ - 2 వెబ్ ఆప్షన్స్ | 16.06.2023 నుండి 27.06.2023 వరకు |
9. | ఫేస్ - 2 ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | ఎ) 26.06.2023 - పిహెచ్/సిఏపి/ఎన్‌సిసి/ అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్ |
10. | ఫేస్ - 2 సీట్ల కేటాయింపు | 30.06.2023 |
11. | ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ | 01.07.2023 నుండి 05.07.2023 |
తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ ఫేస్ - 3 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముఖ్యమైన తేదీలు | ||
---|---|---|
12. | ఫేస్ - 3 రిజిస్ట్రేషన్స్ (రిజిస్ట్రేషన్ రుసుము రూ. 400/-తో) | 01.07.2023 నుండి 05.07.2023 వరకు |
13. | ఫేస్ - 3 వెబ్ ఆప్షన్స్ | 01.07.2023 నుండి 06.07.2023 వరకు |
14. | ఫేజ్ - 3 ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల ధృవీకరణ | ఎ) 05.07.2023 -పిహెచ్ / సిఏపి/ఎన్‌సిసి/ అదనపు అక్టివిటిస్ |
15. | ఫేస్ - 3 సీట్ల కేటాయింపు | 10.07.2023 |
16. | ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ | 10.07.2023 నుండి 14.07.2023 వరకు |
17. | ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 ఆన్‌లైన్‌లో తమ సీట్లను ఇప్పటికే నిర్ధారించుకున్న విద్యార్థులు (సెల్ఫ్ రిపోర్టింగ్) కాలేజీలకు నివేదించడం | 10.07.2023 నుండి 15.07.2023 వరకు |
18. | స్టూడేంట్ ఓరియంటేషన్ ఇన్ కాలేజ్ | 11.07.2023 నుండి 15.07.2023 వరకు |
19. | క్లాస్, సెమిస్టర్ -1 ప్రారంభం | 17.07.2023 |
కేటగిరి | అడ్మిషన్స్ |
రాష్ట్రం | తెలంగాణ |
తరగతి | డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) |
దశలు | మూడు |
అర్హత | ఇంటర్మిడియట్ |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
ధరఖాస్తు ఫీజు | 200/-, 400/- |
కోర్సులు | బిఏ/ బికామ్/బికామ్(వోకేషనల్)/బికామ్(హనర్స్)/బిఎస్సీ/బిఎస్‌డబ్ల్యూ/బిబిఏ,/బిసిఏ,/బిబిఎం |
యూనివర్సిటీలు | ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీస్, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాలు |
రిజిస్ట్రేషన్ ఆఖరు తేది | ఫేస్ - 1 ః 10-06-2023 ఫేస్ - 2 ః 26-06-2023 ఫేస్ - 3 ః 05-07-2023 |
నోటిఫికేషన్ | Click Here |
అప్లై ఆన్‌లైన్ | Click Here |
0 Comments