
తెలివైన గొర్రె / The Clever Sheep Storie in Telugu
Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu || Telugu Stories for Kids
ఒకానొక అడవిలో ఒక గొర్రెల గుంపు మేత మేస్తు ఉంటాయి. అవి మేత మేసే దాని పక్కనే ఒక సెలయేరు పారుతూ ఉంటుంది. ఆ సెలయేరు అవతలివైపున ఉన్న పచ్చగడ్డిని ఒక గొర్రె చూసింది. ఆ పచ్చగడ్డిని తినాలంటే ఆ సెలయేరు దాటివెళ్లాలి. ఇలా ఆ గొర్రె సెలయేరు ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ముందుకు నడుచుకుంటు వెళుతుంటుంది. అలా కొద్ది దూరం వెళ్లాకా సెలయేరు దాటడానికి ఒక సన్నటి కర్రదుంగ కనిపిస్తుంది. ఎలాగైన ఈ కర్రదుంగపై నడిచివెళ్లి అవతలివైపు ఉన్న పచ్చటి గడ్డిని వెంటనే తినేయాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది గొర్రె. అప్పుడే అవతలివైపు నుండి మరో గొర్రె ఇటువైపు వస్తుంది. ఆ కర్ర దుంగపై రెండు మేకలు నడవడానికి వీలులేదు. ఆ రెండు గొర్రెలు కర్రదుంగ మద్యలోకి వచ్చాయి. దీంతో రెండు గొర్రెలు సెలయేరు దాటాలని ఆతృతలో నేను ముందు వచ్చానంటే .. నేను ముందువచ్చానంటూ పోట్లాండుకుంటున్నాయి. మొదటి గొర్రెకు తన చిన్నతనంలో తండ్రిచెప్పిన విషయాలు గుర్తుకువస్తాయి. ఇద్దరు వ్యక్తులు ఇలాగే పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకువస్తుంది. వెంటనే మొదటి గొర్రె, రెండవ గొర్రెతో ఇలా అంది ‘‘ ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాము. అందుకే ఇద్దరము కాలువలో పడిపోకుండా క్షేమంగా కాలువ దాటాలంటే నేను కూర్చుంటాను నువ్వు నాపై నుండి దాటి వెళ్లు ’’ అని చెప్పింది. ఇది విన్న రెండవ గొర్రె మొదటి మేక చెప్పిన ప్రకారంగా గొర్రెపైనుండి దూకి వెళ్లింది. ఇలా రెండు గొర్రెలు ఒకదానికి ఒకటి సహాయం చేసుకొని ఆపద నుండి బయటపడ్డాయి.
- నీతి ః ఆపద సమయంలో ఆలోచనతో బయటపడచ్చు.
0 Comments