Asaf Jahi Dynasty gk questions in telugu || Tspsc Telangana History : Gk questions with Answers in telugu


Asaf Jahi Dynasty gk questions in telugu || gk bits in telugu

Tspsc Telangana History :

Asaf Jahi Dynasty : Gk questions and Answers in telugu,

1) క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) ఆసఫ్‌ జాహీలు మద్య ఆసియాలోని సమర్ఖండ్‌ ప్రాంతానికి చెందిన తురాని తెగకు చెందినవారు.
2) అసఫ్‌ జాహీల యొక్క మూలపురుషుడు క్వాజా అబిద్‌
3) క్వాజా అబిద్‌కు ‘‘కిలిచి ఖాన్‌ ’’ అనే బిరుదు కలదు.

ఎ) పైవన్నీ
బి) 1 మరియు 3
సి) 2 మరియు 3
డి) 1 మరియు 2

జవాబు ః ఎ (పైవన్నీ)

2) షెక్కర్‌ ఖేడా యుద్దం ఈ క్రింది వానిలో ఎవరి మద్య జరిగింది ?
ఎ) మీర్ఖముద్దీన్‌ ఖాన్‌ - మహమ్మద్‌ షా
బి) క్వాజా అబిద్‌ - ముబారిచ్‌ ఖాన్‌
సి) మీర్‌ ఖమ్రుద్దీన్‌ ఖాన్‌ - ముబారీజ్‌ ఖాన్‌
డి) ముబారక్‌ ఖాన్‌ - మహమ్మద్‌ షా

జవాబు ః సి (మీర్‌ ఖమ్రుద్దీన్‌ ఖాన్‌ - ముబారీజ్‌ ఖాన్‌)
బీరా ప్రాంతంలో 1724లో జరిగిన ఈ యుద్దంతో అసఫ్‌జాహీల వంశం స్థాపించబడిరది.

3) నిజాం ఉల్‌ముల్క్‌ పొందిన ఈ క్రింది బిరుదులలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) చిన్‌ ఖిలిచ్‌ ఖాన్‌ - ఔరంగజేబు
బి) నిజాం ఉల్‌ముల్క్‌ - మహమ్మద్‌ షా రంగీలా
సి) ఫతే జంగ్‌ - ఫరూక్‌ సియర్‌
డి) ఖాన్‌ - ఇ - దురాని - మొదటి బహదుర్ష

జవాబు ః బి (నిజాం ఉల్‌ముల్క్‌ - మహమ్మద్‌ షా రంగీలా)
ఇతనికి నిజాలం ఉల్‌ముల్క్‌ అనే బిరుదును ఫరూక్‌ సియర్‌ ఇవ్వడం జరిగింది.

4) మీర్‌ ఖమ్రుద్దీన్‌ ఖాన్‌ను అయోద్య సుబేదారిగా ఎవరు నియమించారు ?
ఎ) ఫరూక్‌ సియర్‌
బి) మహమ్మద్‌ షా
సి) మొదటి బహదూర్‌ షా
డి) ఔరంగజేబు

జవాబు ః సి (మొదటి బహదూర్‌ షా)

5) ఈ క్రింది అసఫ్‌ జాహీ రాజులను వారు పరిపాలించిన కాలాలకు అనుగుణంగా అమర్చండి ?
1) నిజాం అలీఖాన్‌
2) నిజాం ఉల్‌ముల్క్‌
3) నాసిర్‌ ఉద్దౌలా
4) మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌
ఎ) 1, 2, 3, 4
బి) 2, 1, 3, 4
సి) 2, 1, 4, 3
డి) 2, 3, 1, 4

జవాబు ః బి (2, 1, 3, 4)


Also Read :

6) ‘‘షాకీర్‌’’ అనే కలంతో కవితలు రాసిన ఈ క్రింది వానిలో ఎవరు ?
ఎ) ఫరూక్‌ సియర్‌
బి) మహమ్మద్‌ షా
సి) మొదటి బహదూర్‌ షా
డి) నిజాం ఉల్‌ముల్క్‌

జవాబు ః డి (నిజాం ఉల్‌ముల్క్‌)

7) ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి ?
1) నిజాం ఉల్‌ముల్క్‌ హైద్రాబాద్‌ రాజధానిగా అసఫ్‌ జాహీ వంశాన్ని స్థాపించాడు.
2) నిజాం ఉల్‌ముల్క్‌ యొక్క ప్రధాని దియానత్‌ ఖాన్‌
3) నిజాం ఉల్‌ముల్క్‌ 1739 లో పర్షియా రాజునాదిర్షా మొఘల్‌ సైన్యంపై దండేత్తినప్పుడు మొఘలులకు నాదీర్‌ షా మద్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చాడు.
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు ః సి (2 మరియు 3)

8) నిజాం ఉల్‌ముల్క్‌ ఈ క్రింది ఏ యుద్దంలో ‘‘వార్నా’’ సంధి చేసుకున్నాడు ?
ఎ) పాల్కేడ్‌ యుద్దం
బి) సూరత్‌ యుద్దం
సి) బోపాల్‌ యుద్దం
డి) కర్నాల్‌ యుద్దం

జవాబు ః బి (సూరత్‌ సంధి)

9) ‘‘ అంబూర్‌ యుద్దం ’’ ఏ సంవత్సరంలో జరిగింది ?
ఎ) 1748
బి) 1749
సి) 1750
డి) 1751

జవాబు ః బి (1749)

10) ఈ క్రింది వానిలో సరైన సమాధానం ఏది ?
1) ఫ్రెంచ్‌ అధికారి డూప్లే కుట్ర చేసి హిమ్మత్‌ఖాన్‌ చే నాజర్‌జంగ్‌ను హత్య చేయించాడు.
2) ముజఫర్‌ జంగ్‌ ఫ్రెంచ్‌ వారికి బహుమానంగా ఇచ్చిన ఈ క్రింది ప్రాంతాలు మచిలీపట్నం, దివిసీమ, యానం.
ఎ) పైవన్నీ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) పైవేవీ కావు

జవాబు ః ఎ) పైవన్నీ



Also Read :



Post a Comment

0 Comments