
బీసీ కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం 1 లక్ష ఆర్థిక సహాయం
Gk in Telugu || General Knowledge in Telugu
బీసీ వర్గాలలోని కుల, చేతివృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ ప్రభుత్వం బిసిలలోని వెనుకబడిన వర్గాలు, చేతివృత్తుల అభివృద్ది కొరకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించడం కోసం ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.కులవృత్తులు చేసుకునేవారు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించుకుంది.
అర్హులైన బిసి కులానికి చెందిన కులవృత్తుల వారు 1 లక్ష ఆర్థిక సాయం కొరకు 6 జూన్ 2023 నుండి ఆన్‌లైన్ పద్దతిలో ధరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో బిసిలలోని వెనుకబడిన వర్గాలు మరియు చేతివృత్తులు చేసుకునే వారికి జీవనవృత్తిలో వాడే పనిముట్లు, ముడిసరుకు మరియు ఎక్విప్‌మెంట్ కొరకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం రూపంలో ప్రభుత్వం ద్వారా అందిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బిసి-ఏ, బిసి-బి మరియు బిసి-డి లోని వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం రూపంలో అందిస్తుంది. 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలలోపు ఉన్న బిసి కులానికి చెందిన 2 లక్షల లోపు వార్షిక ఆదాయం (గ్రామాల్లో అయితే లక్షన్నర) కల్గిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గత 5 సంవత్సరాలలో వివిధ పథకాల కింద 50 వేల కంటే ఎక్కువ లబ్ది పొందిన వారు అనర్హులు.
తెలంగాణ రాష్ట్రంలో నాయీ బ్రహ్మణులు, విశ్వబ్రహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, వడ్రంగి, కమ్మరి, దర్జి, కంసాలి, కంచరి, వడ్డరి, పూసల వర్గాలతో పాటు ఇతర కులాలకు చెందిన వారిలో కులవృత్తులను ఆధారం చేసుకొని జీవిస్తున్న వారికి ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది.
అర్హులైన లబ్దిదారులు పాస్‌పోర్టు సైజు ఫోటో, ఆధార్‌కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ వివరాలతో ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో స్వీకరించిన ధరఖాస్తులలో ఎంపిక చేసిన లబ్దిదారులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది.ఇట్టి ఆర్థిక సహాయాన్ని పూర్తి సబ్సీడితో ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది.
➠ ఎవరు అర్హులు :
- బిసి-ఎ, బిసి-బి, బిసి-డి కులానికి చెందినవారు
- నాయీ బ్రాహ్మణులు
- రజక
- సగర/ఉప్పర
- కుమ్మరి/శాలివాహన
- అవుసుల
- కంసాలి
- కమ్మరి
- కంచరి
- వడ్ల/వడ్ర/వడ్రంగి
- శిల్పులు
- కృష్ణబలిజ పూసల
- మేదర
- వడ్డెర
- ఆరెకటిక
- మేర
- ఎంబీసీ
- ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే
- 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వారు
- కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో అయితే 2 లక్షలు, గ్రామాల్లో అయితే లక్షన్నరకు మించరాదు.
➠ ఎవరు అర్హులు కాదు :
- గత 5 సంవత్సరాలలో వివిధ పథకాల్లో 50వేల కంటే ఎక్కువ లబ్ది పొందినవారు
➠ ఆర్థిక సహాయం మొత్తం :
- 1 లక్ష రూపాయలు (ఇట్టి ఋణం 100 శాతం సబ్సిడీతో అందిస్తుంది)
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి
➠ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
1) ఆధార్‌కార్డు
2) కుల ధృవీకరణ పత్రం
3) ఆధాయ ధృవీకరణ పత్రం
4) పాస్‌పోర్టు సైజు ఫోటో
5) బ్యాంక్ ఖాతా
6) మొబైల్ నెంబర్
➠ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభ తేది. 06 జూన్ 2023
- ఆన్‌లైన్ ధరఖాస్తు ముగింపు తేది.20 జూన్ 2023
కెటగిరి | ఆర్థిక సహాయం |
రాష్ట్రం | తెలంగాణ |
ఎవరు అర్హులు | బిసి |
ఆర్థిక సహాయం | 1 లక్ష రూపాయలు |
సబ్సీడి | 100 శాతం |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
ప్రారంభ తేది | 06 జూన్ 2023 |
చివరి తేది | 20 జూన్ 2023 |
పూర్తి వివరాలకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తు కొరకు | Click Here |
0 Comments