
దేవుడే దిక్కు ..!
Moral Stories in Telugu
Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu || Telugu Stories for Kids
అనగనగా ఒక నదిపక్కన ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని వారంతా ఎంతో ప్రశాంతంగా, కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ గ్రామం మద్యలో ఒక గుడి ఉండేది. ప్రతిరోజు ఆ గ్రామానికి చెందిన ప్రజలు ఆ గుడివద్దకు చేరి పూజలు చేసేవారు. అంతేకాకుండా ఆ గుడిలో దేవునికి తీర్థప్రసాదాలు అందించే పూజారిని కూడా ఆదరించేవారు. అనుకోకుండా ఒకసారి గ్రామంలో తీవ్రమైన వర్షాలు పడి, నదులు, చెరువులు పొంగిపొర్లి వరదలు వచ్చాయి. గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. నడవడానికి సైతం వీలులేకుండా వర్షపు నీటితో నిండిపోయింది. గ్రామంలోని ప్రజలు వరద నీటి నుండి తప్పించుకోవడానికి ఇండ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు బయలు దేరారు. అందులో ఒక వ్యక్తి పూజారిని కూడా సురక్షిత ప్రాంతానికి వారితో రమ్మని అనడం జరిగింది. దీనికి ఆ పూజారి ప్రశాంతంగా ‘‘ నా గురించి బాదపడకండి నేను ప్రతిరోజు ఆరాధించే నా భగవంతుడే నన్ను కాపాడుతాడు మీరు వెళ్లండి ’’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారందరు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. కొంత సమయం గడిచిన తర్వాత వర్షపు నీరు నడుము లోతువరకు వచ్చేసాయి. పూజారి గుడిగట్టున నిలబడి జపం చేస్తున్న సమయంలో అటుగా గుర్రపు బండిలో వెళుతున్న వారు చూసి ఇలా అన్నారు ‘‘పూజారి గారు వర్షపు నీరు ఎక్కువ అవుతుంది మీరు తొందరగా మాతో వచ్చేయండి లేదంటే మీరు అందులో మునిగిపోయే ప్రమాదం ఉంది ’’ అన్నారు. పూజారిగా వారి మాటలు వినకుండా ‘‘ నన్ను దేవుడే కాపాడుతాడు ’’ అని వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. మరికొద్దిసేపటికి తలభాగం వరకు వర్షపు నీరు చేరింది. పడవలో వెళుతున్న కొందరు చూసి వారితో వచ్చేమని బ్రతిమిలాడారు. అయినా కూడా పూజారి వినకుండా మొండి పట్టుతో ‘‘ నన్ను దేవుడే రక్షిస్తాడు ’’ అని అక్కడే ఉండిపోయాడు. చివరికి పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఊపిరి ఆడగా కంగారుపడి గుడిగోపురం ఎక్కి కూర్చున్నాడు. నీళ్ల ప్రవాహనం అంతకంతకు ఎక్కువవుతుంది. దీంతో పూజారి ‘‘ దేవుడా ! నేను నీకు ఏమి తక్కువ చేసాను ! ప్రతిరోజు నీకు పూజలు చేస్తూ నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను కాపాడడానికి రావేంటి !’’ అని దేవుడితో మొరపెట్టుకున్నాడు.
అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ‘‘ముర్ఖుడా ! నేను నీన్ను కాపాడానికి మనిషిని పంపించాను. పడవను పంపించాను, గుర్రపుబండిని పంపించాను అయినా నువ్వు అర్థం చేసుకోకుండా మొండిపట్టుదలతో ఇక్కడే ఉన్నావు. నన్ను గుర్తుపట్టకపోతే తప్పు నాదేలా అవుతుంది ’’ అని మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరబాటును గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపు తర్వాత పడవలో అటుగా కొంతమంది కనిపించారు. వెంటనే ఏమి ఆలోచించకుండా వారితో పడవలో వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నాడు.
0 Comments