
విశ్వాసం లేని గుర్రం
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
విశిష్టపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రానికి రామయ్య ప్రతిరోజు సపర్యలు చేస్తూ మంచి పౌష్టికాహారం పెడుతుండేవాడు. ఆ గుర్రంతో ప్రతిరోజు తనకున్న పొలం పనులు చేయించుకునేవాడు. పొలం పనులు చేయడం ఆ గుర్రానికి నచ్చలేదు. నా యొక్క పూర్వీకుల గుర్రాలను రాజులు సంరక్షించేవారు. వారు ఎన్నో యుద్దాలలో పాల్గొని విజయాలందించారు. కానీ నేను మాత్రం ఇలా పొలం పనులు చేస్తూ వెట్టిచాకిరి చేస్తున్నాను అని బాదపడిరది గుర్రం. ఎట్లాగైన ఈ రైతు వద్దనుండి తప్పించుకొని వెళ్లాలని అనుకుంది. ఒక రోజు ఆర్ధరాత్రి సమయంలో ఒక దొంగ రామయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. దొంగతనానికి వచ్చిన సమయంలో రామయ్య గాఢనిద్రలో ఉన్నాడు. ఇదే సమయంలో దొంగ ఇంట్లోని వస్తువులన్నింటిని మూట కట్టుకున్నాడు. ఈ సంఘటను గుర్రం మొత్తం చూస్తుంది కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. మూట కట్టుకున్న వస్తువులతో వెళుతున్న దొంగతో గుర్రం ఇలా అంది ‘‘ అయ్యా మా యజమాని ఇంట్లోని వస్తువులను అన్నింటిని తీసుకెళుతున్నావు అదే చేత్తో నా కట్లు విప్పండి ’’ అని దొంగను వేడుకుంది. దీంతో దొంగ నీ కట్లు విప్పితే నాకు ఏమి లాభం వస్తుంది అని ప్రశ్నించాడు. దాంతో గుర్రం నువ్వు నా కట్లు విప్పితే నీతో వచ్చి నువ్వు చెప్పిన పని చేస్తాను అని అంది. దానిని దొంగ చిరునవ్వు నవ్వుతూ ‘‘ నేను మీ యజమాని ఇంట్లో వస్తువులన్నింటి తీసుకెళుతున్నా గాని నీవు నీ యజమానిని అప్రమత్తం చేయలేదు నీకు యజమాని పట్ల కృతజ్ఞత లేదు నీలాంటి దానిని ఉంచుకోవడం నా తప్పు అవుతుంది. యజమానిపై విశ్వాసం లేని వారు ఎప్పటికైనా ముప్పు ’’ అన్నాడు దొంగ. దీంతో గుర్రం దీర్ఘాలోచనలో పడిరది. ఆ రోజు నుండి యజమాని చెప్పిన పనులు చేస్తు విశ్వాసంగా ఉంది గుర్రం.
0 Comments