
దురాశ దు:ఖానికి చేటు
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
ఒకానొక ఊరిలో వెంకటయ్య, వీరయ్య అనే ప్రాణస్నేహితులు ఉండేవారు. వెంకటయ్య కష్టపడి పనిచేసుకుంటూ ఉండేవాడు. కానీ వీరయ్య మాత్రం ఏ పని చేయకుండా బద్దకస్తునిగా ఉండేవాడు. వెంకటయ్య ప్రతి రోజు గ్రామ శివారులోని అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొని తెచ్చి వాటిని గ్రామంలో అమ్మి వచ్చిన డబ్బులతో సంతృప్తి చెందేవాడు. ఇలా ఒక రోజున సూర్యుడు ఉదయించగానే కట్టెలు కొట్టే గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్లాడు వెంకటయ్య. నది పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కనబడగానే ఈ చెట్టును కొడితే చాలా కట్టెలు వస్తాయి అనుకున్నాడు. దీంతో ఆ పెద్దచెట్టును ఎక్కి తాను తెచ్చుకున్న గొడ్డలితో కొమ్మలు కొడుతాడు. అంతలో తన చేతిలో ఉన్న గొడ్డలి పట్టుజారి కింద ఉన్న నదిలో పడిపోతుంది. అప్పుడు వెంకటయ్య కంగారు పడి దేవున్ని ప్రార్థిస్తాడు. వెంకటయ్య ప్రార్థనకు మెచ్చిన దేవుడు ప్రత్యక్షమవుతాడు. ‘‘ ఓ మానవ నన్ను ఎందుకు ప్రార్థించినావు ’’ అని దేవుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు వెంకటయ్య నా విలువైన గొడ్డలి జారిపోయి నదిలో పడిపోయింది. నా గొడ్డలి నాకు ఇవ్వు అని అంటాడు. వెంటనే దేవుడు నదిలో నుండి బంగారు గొడ్డలి తీసి వెంకటయ్యకు చూపిస్తాడు. దీంతో వెంకటయ్య ఈ గొడ్డలి నాది కాదు అన్నాడు. తర్వాత దేవుడు నదిలో నుండి వెండి గొడ్డలి చూపిస్తాడు. వెంకటయ్య ఈ గొడ్డలి నాది కాదు అన్నాడు. మళ్లీ దేవుడు నదిలో నుండి ఇనుప గొడ్డలి చూపించగానే ఇది నా గొడ్డలేనని అన్నాడు వెంకటయ్య. దీంతో వెంకటయ్య నిజాయితీని మెచ్చుకున్న దేవుడు బంగారు, వెండి, ఇనుప మూడు గొడ్డళ్లను వెంకటయ్యకు ఇచ్చి మాయమైపోతాడు. వెంకటయ్య సంభ్రమాశ్చర్యాలకు గురై ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్నంత తన భార్యకు వివరిస్తాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న తన స్నేహితుడు వీరయ్య ఆ విషయాన్నంత వింటాడు.
వీరయ్య అత్యాశతో ఎలాగైనా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలని అనుకొని నది దగ్గరకు పోయి తన ఇనుప గొడ్డలిని అందులో పడేసి దేవున్ని ప్రార్థిస్తాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఇనుప గొడ్డలి చూపిస్తాడు. కానీ వీరయ్య ఈ గొడ్డలి నాది కాదు అంటాడు. తర్వాత దేవుడు వెండి గొడ్డలి చూపిస్తాడు వీరయ్య నాది కాదు అంటారు. చివరకు బంగారు గొడ్డలి చూపించగానే వీరయ్య ఎంతో సంతోషంగా ఈ గొడ్డలి నాదే అని నాకు ఇవ్వమని దేవున్ని వేడుకుంటాడు. దేవుడు వీరయ్య దుర్భుద్ది తెలుసుకొని నీవు అత్యాశపరుడవు అని చెప్పి ఇనుప గొడ్డలి ఇచ్చి కష్టపడి పనిచేసుకొని జీవించమని వెళ్లిపోతుంది.
0 Comments