
TS RGUKT IIIT Basara Notification 2023-2024 for B.Tech admisions apply online at rgukt.ac.in
ఎస్.ఎస్.సి (10వ తరగతి) లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్మల్ జిల్లా బాసరలోని Rajiv Gandhi University of Knowledge Technologies-Basar (RGUKT) లో బిటెక్‌లో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తుంది. చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాసరలోని ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక సీటు దక్కించుకోలేకపోతారు. ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ధరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఆన్‌లైన్ ప్రక్రియ, ముఖ్యమైన తేదీల గురించి వివరంగా కింద ఇవ్వడం జరిగింది.
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జియూకేటీ) బాసర ట్రిపుల్‌ఐటీలో 6 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు ఉంటుంది. 2023-24 సంవత్సరంలో మొత్తం 1500 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 సీట్లు భర్తీ కొరకు నోటీఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులు ఎస్.ఎస్.సి(10వ తరగతి) రెగ్యులర్ విధానంలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సప్లమెంటరీ వ్రాసిన వారు అర్హులు కాదు. ధరఖాస్తు చేసుకునే అభ్యర్థి 18 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు దాటవద్దు.
➠ బాసర ఐఐఐటీ 2023-24 ఎంపిక విధానం :
ఎస్.ఎస్.సి(10వ తరగతి)లో పొందిన జిపిఏ(గ్రేడ్ పాయింట్ యావరేజ్) ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ప్రతీ సబ్జెక్టులో అభ్యర్థి పొందిన గ్రేడ్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి ఎంపిక విధానం ఉంటుంది. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 జిపిఏ పాయింట్లు అదనంగా కలుపడం జరుగుతుంది. మొత్తం సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. మిగతా 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా గ్లోబల్ కేటగీరి కింద 5 శాతం సీట్లు రిజర్వ్‌గా, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు.
➠బాసర ఐఐఐటి 2023-24 విద్యా సౌకర్యాలు :
ఇందులో ఎంపికైన విద్యార్థులకు 6 సంవత్సరాల పాటు విద్యను అందించడంతో పాటు ల్యాప్‌టాప్ ఉచితంగా అందిస్తారు. మరియు యూనిఫామ్స్, సంవత్సరానికి రెండు జతల షూ, హస్టల్ వసతి ఉచితంగా కల్పిస్తారు.
➠ బాసర ఐఐఐటీ 2023-24 ఆన్‌లైన్ ధరఖాస్తు ఫీజుల వివరాలు :
- ఓసీ, బీసీ అభ్యర్థులకు 500/- రూపాయలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 450/- రూపాయలు
- గ్లోబల్ అభ్యర్థులు 1500/- రూపాయలు
- ఎన్నారై ఇంటర్నేషనల్ విద్యార్థులు 100 యూఎస్ డాలర్లు ఆన్‌లైన్ ధరఖాస్తు సమయంలో చెల్లించాలి.
ధరఖాస్తు చేసిన తర్వాత హర్ట్‌కాపీలను ఈ క్రింది చిరునామాకు స్పీడ్ పోస్టు / రిజిస్ట్రర్ పోస్టులో వేయాలి.
‘‘ద కోఆర్డీనేటర్
యూజీ అడ్మిషన్స్ 2023-24
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్,
బాసర, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం - పిన్ -504107 ’’
కవర్‌పైన అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ 2023 ఆర్జీయూకేటీ బాసర అని రాయాలి.
" The Coordinator
UG Admissions 2023-24
Rajiv Gandhi University of Knowledge Technologies - Basar
Basar, Nirmal District
Telangana State - 504107 "
The candidates should write ‘Application for UG Admissions-2023, RGUKT, Basar’ on the top of the envelope.
➠ బాసర ఐఐఐటీ 2023-24 ధరఖాస్తు విధానం :
- ధరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
➙ ఆన్‌లైన్ లో ధరఖాస్తులు సమర్పించిన తర్వాత క్రింది వాటిని జతచేయాలి.
- ఆన్‌లైన్ ప్రింట్
- ఆన్‌లైన్ ఫీజు రశీదు
- 10వ తరగతి హాల్ టికెట్
- 10వ తరగతి వరకు విద్యా ధృవపత్రాలు
- ఆన్‌లైన్‌లో తీసిన 10వ తరగతి మార్కుల మెమో
- కుల ధృవీకరణ పత్రం
- దివ్యాంగులు, ఆర్మీ కుటుంబీకులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ విద్యార్థులు అయితే అందుకు సంబందించిన సర్టిఫికేట్‌లు
పైన తెలిపిన జిరాక్స్‌లను ధరఖాస్తు ఫారంతో జతచేసి జూన్ 24 లోగా బాసర ట్రిపుల్‌ఐటికి అందజేయాలి.
➠ బాసర ఐఐఐటీ 2023-24 కోర్సు ఫీజు వివరాలు :
- సెమిస్టర్ కలుపుకొని సంవత్సర ఫీజు 37,000 రూపాయలు చెల్లించాలి (ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నవారు చెల్లించాల్సిన అవసరం లేదు)
- తెలంగాణకు సంబందించిన ఎన్నారైల పిల్లలు 1,36,000 రూపాయలు చెల్లించాలి
- మిగతా ఎన్నారైలు అయితే 3,01,000 రూపాయలు చెల్లించాలి.
- ప్రవేశ సమయంలో ఆరోగ్యభీమా ఇతరాలకు 3,500 రూపాయలు (ఎస్సీ/ఎస్టీలు అయితే 3వేలు) చెల్లించాలి.
ఇది 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు. 6 సంవత్సరాల కోర్సును 2 రకాలుగా విభజిస్తారు
1) ప్రీ యూనివర్సీటి కోర్సు (2 సంవత్సరాలు)
- గణితం
- భౌతిక శాస్త్రం
- కెమిస్ట్రీ
- ఇంగ్లీష్
- తెలుగు/సంస్కృతం (తెలుగు భాషగా సెకండ్ లాంగ్వేజ్‌ని అభ్యసించని తెలుగుయేతర విద్యార్థులకు సంస్కృతం అందించబడుతుంది)
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- పర్యావరణ శాస్త్రం
2) బీ.టెక్ (4 సంవత్సరాలు)
- కెమికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జియూకేటీ) ముఖ్యమైన తేదీలు | |
---|---|
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 05 జూన్ 2023 |
ధరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది | 19 జూన్ 2023 |
హార్ట్ కాపీలు స్వీకరణ తేది | 24 జూన్ 2023 |
ఎంపిక విద్యార్థుల ప్రకటన తేది | 26 జూన్ 2023 |
కౌన్సిలింగ్ తేదీ | 1 జూలై 2023 నుండి |
ఆన్‌లైన్ అప్లై కొరకు | Click Here |
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జియూకేటీ) | |
---|---|
కేటగిరీ | అడ్మిషన్ |
జిల్లా | నిర్మల్ |
ప్రదేశం | బాసర ట్రిపుల్ ఐటీ |
విద్యా సంస్థ | రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జియూకేటీ) బాసర ట్రిపుల్ ఐటి |
అర్హత | 10వ తరగతి (ఎస్.ఎస్.సి) |
వయస్సు | 18 సంవత్సరాలు నిండరాదు |
ఎంపిక విధానం | 10వ తరగతి జీపిఏ ఆధారంగా |
ఎంపిక ప్రక్రియ | ఆన్‌లైన్ ద్వారా |
ఫీజు | 500 (ఓసీ, బీసీ), 450 (ఎస్సీ/ఎస్టీ), 1500 (అదర్స్) |
ధరఖాస్తులు ప్రారంభం | 05 జూన్ 2023 |
ధరఖాస్తులు ముగింపు | 19 జూన్ 2023 |
ఎంపిక విద్యార్థుల ప్రకటన | 26 జూన్ 2023 |
కౌన్సిలింగ్ | 1 జూలై 2023 నుండి |
0 Comments