
Tspsc Telangana History :
Satavahana Dynasty : Gk questions and Answers in telugu Part - 2 || Gk Questions in Telugu || Gk MCQ Questions with Answers
1. శ్రీముఖుడికి సంబందించి క్రిందివాటిలో సరైనవి గుర్తించండి ?
1) శ్రీముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు, అశోకుడికి సమకాలికుడు
2) శ్రీముఖుడు మొదటగా బౌద్దమతాన్ని స్వీకరించి తర్వాత వైదిక మతమును అనుసరించాడు.
3) శ్రీముఖుని యొక్క నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో లభించాయి.
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : డి (1 మరియు 3)
2) క్రింది వాటిలో శ్రీముఖునికి లేని బిరుదును గుర్తించండి ?
ఎ) బలిపుచ్చక
బి) సింధుక
సి) శిశుఖ
డి) శూర
జవాబు : డి (శూర)
ఇది మొదటి శాతకర్ణి యొక్క బిరుదు
3) క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) శాతవాహనులలో కన్హెరి శాసనాన్ని వేయించినది కృష్ణుడు
బి) కృష్ణుని కాలంలో దక్షిణ భారతదేశంలో భాగవత మతం ప్రవేశపెట్టబడిరది
సి) శాతవాహన రాజు మొదటి శాతకర్ణి శ్రీముఖుని కుమారుడు
డి) దేవా నాగానిక వేసిన నానాఘట్ శాసనం సంస్కృత భాషలో కలదు.
జవాబు : డి (దేవా నాగానిక వేసిన నానాఘట్ శాసనం సంస్కృత భాషలో కలదు)
4) నానాఘట్ శాసనంలో లేని ఈ క్రింది మొదటి శాతకర్ణి బిరుదును గుర్తించండి ?
ఎ) మల్లకర్ణ
బి) దక్షిణ పథాపతి
సి) ఏకవీర
డి) అప్రతిహత చక్ర
జవాబు : ఎ (మల్లకర్ణ)
Tspsc Telangana History :
5) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి
2) మొదటి శాతకర్ణి కాలంలో రాజ్యంలోకి మూషిక నగరంపై దాడి చేసిన కళింగ రాజు కారవేలుడు
3) మొదటి శాతకర్ణి నాణాలపై ఏనుగు గుర్తు ఉజ్జయిని పట్టణ గుర్తు కలవు.
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 1 మరియు 3
డి) 2 మరియు 3
జవాబు : ఎ (పైవన్నీ)
Also Read :
6) శాతవాహన రాజులలో అత్యధిక కాలం పరిపాలించిన ఈ క్రింది రాజు ఎవరు ?
ఎ) గౌతమిపుత్ర శాతకర్ణి
బి) రెండవ శాతకర్ణి
సి) మొదటి శాతకర్ణి
డి) హలుడు
జవాబు : బి (రెండవ శాతకర్ణి)
7) రెండవ శాతకర్ణి సంబందించి ఈ క్రింది వాటిలో సరికానిది ?
ఎ) ఇతని కాలంలో శక-శాతవాహన సంఘర్షణలు ప్రారంభమైనాయి
బి) సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు.
సి) ఇతను ఉత్తర భారతదేశంలోని మగధ రాజధాని అయిన పాటలీపుత్రాన్ని జయించాడు.
డి) ఇతని యొక్క బిరుదు విక్రమార్క
జవాబు : డి (ఇతని యొక్క బిరుదు విక్రమార్క)
8) ఈ క్రింది ఏ శాతవాహన కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుంగా పేర్కొంటారు ?
ఎ) మొదటి శాతకర్ణి
బి) కుంతల శాతకర్ణి
సి) గౌతమిపుత్రశాతకర్ణి
డి) హలుడు
జవాబు : డి (హలుడు)
9) గౌతమిపుత్రశాతకర్ణికి సంబందించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) ఇతను కీ.శ 78 లో శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు
2) ఇతను జోగులుతంబి యుద్దంలో నహపానుడిని ఓడించాడు
3) ఇతను రాజధానిని కోటిలింగాల నుండి ప్రతిష్టానుపురంకు మార్చాడు
4) గౌతమిపుత్రశాతకర్ణి తల్లి బాలశ్రీ నాసిక్ ప్రశస్తిలో తనను తాను రాజర్షి వదువుగా వర్ణించుకుంది
ఎ) పైవన్నీ
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2 మరియు 4
జవాబు : డి (1, 2 మరియు 4)
10) గౌతమిపుత్రశాతకర్ణికి లేని బిరుదు ఏది ?
ఎ) బెనకటక స్వామి
బి) అప్రతిహతచక్ర
సి) శకసంహారి
డి) ఏకవీర
జవాబు : డి (ఏకవీర)
0 Comments