
Tspsc Telangana History :
Satavahana Dynasty Gk questions and Answers in telugu Part - 3
1. ఏ శాతవాహన రాజు కాలంలో అమరావతి స్థూపం నిర్మించడం జరిగింది ?
ఎ) గౌతమీపుత్ర శాతకర్ణి
బి) 2వ పులోమావి
సి) 3వ పులోమావి
డి) యజ్ఞశ్రీ శాతకర్ణి
జవాబు : బి (2వ పులోమావి)
2) క్రింది వాటిలో సరికాని జత ఏది ?
ఎ) నవనగర స్వామి - వశిష్టపుత్ర పులోమావి
బి) రెండు తెరచాపలున్న ఓడ బొమ్మ నాణేలు - గౌతమీపుత్ర శాతకర్ణి
సి) త్రి సముద్రాధిపతి - యజ్ఞశ్రీ శాతకర్ణి
డి) ద్విభాష నాణేలు - వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి
జవాబు : బి (రెండు తెరచాపలున్న ఓడ బొమ్మ నాణేలు - గౌతమీపుత్ర శాతకర్ణి)
3) క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి మహాయాన బౌద్దమతాన్ని స్వీకరించాడు
2) అమరావతి స్థూపాన్ని విస్తరింపజేసినది యజ్ఞశ్రీ శాతకర్ణి
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : ఎ (పైవన్నీ)
4) శాతవాహనుల పాలన వ్యవస్థ ఈ క్రింది ఎవరు ఆదర్శం ?
ఎ) చోళులు
బి) మౌర్యులు
సి) శుంగులు
డి) రాష్ట్రకుటులు
జవాబు : బి (మౌర్యులు)
5) శాతవాహనుల కాలంలో అధికారులకు సంబందించి క్రింది వాటిలో సరికాని జత ఏది ?
ఎ) ప్రతీహార - ద్వారా పాలకుడు
బి) మహాతలవర - అంగరక్షకుడు
సి) రజుక - చాకలివాడు
డి) గ్రామిని - గ్రామపాలన అధికారి
జవాబు : సి (రజుక - చాకలివాడు)
రజుక అంటే న్యాయమూర్తి
Also Read :
6) శాతవాహనుల సైనిక వ్యవస్థ గురించి తెలిపే శాసనం ఏది ?
ఎ) అర్థశాస్త్రం
బి) మనుధర్మశాస్త్రం
సి) హాతిగుంప శాసనం
డి) బృహత్‌కథ
జవాబు : సి (హాతిగుంప శాసనం)
7) క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) శాతవాహన కాలంలో భూమిశిస్తూ సాధారణంగా పంటలో 1/6 వంతు వసూలు చేసేవారు
2) వీరు చేతివృత్తుల వారిపై విధించే పన్ను - కర
3) నీటి తీరువాపై విధించే పన్ను - శుల్క
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 3
సి) 2 మరియు 3
డి) 1 మరియు 2
జవాబు : బి (1 మరియు 3)
8) శాతవాహనుల కాలంలో రాజఖంకేట / రాజక్షేత్రం అనగా ?
ఎ) రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం
బి) రాజు యొక్క సొంత భూములు
సి) రాజు బ్రహ్మణులకు దానం చేసే భూమి
డి) రాజు పేదవారికి దానం చేసే భూమి
జవాబు : బి (రాజు యొక్క సొంత భూములు)
9) శాతవాహనుల కాలంలో తూర్పుతీరంలో ముఖ్యమైన ఓడరేవు ఏది ?
ఎ) సోపార
బి) బరుకచ్చా
సి) మోటుపల్లి
డి) అరికమేడు
జవాబు : సి (మోటుపల్లి)
10) శాతవాహనుల కాలంలో వినుకొండ దేనికి ప్రసిద్దిగా ఉంది ?
ఎ) సన్నని వస్త్రాలకు
బి) వజ్రాల పరిశ్రమ
సి) లోహపరిశ్రమ
డి) మంచి నాణ్యత కల్గిన ఇనుము
జవాబు : సి (లోహపరిశ్రమ)
0 Comments