
అమాయక కుందేలు - అల్లరి కోతులు
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
ఒక అడవిలో ఒక అమాకపు కుందేలు ఉండేది. కుందేలు ఎలాంటి కల్మషం లేకుండా అందరితో స్నేహం చేస్తు ఉండేది. ఇలా అడవిలో ఒక రోజు కోతుల గుంపు పరిచయం అయింది. ఆ కోతుల గుంపుతో కుందేలు స్నేహం చేసింది. అడవిలోని జంతువులు అన్ని కోతులతో స్నేహం చేయవద్దని కుందేలుకు చెప్పాయి. అయినా వినకుండా కోతులతో స్నేహం చేసింది. ఇలా ఒక రోజున కోతుల గుంపు ఇతర చోటుకు వెళుతూ కుందేలును కూడా తమతో రమ్మని పిలిచాయి. దీంతో కుందేలు ఆలోచించకుండా ఎందుకు, ఎక్కడికి అని అడగకుండా కోతులను నమ్మి వాటితో బయలు దేరింది. కోతులు ఒక గ్రామశివారుకు చేరుకొని అక్కడున్న పంటపొలాలన్ని నాశనం చేయడం మొదలుపెట్టాయి. కుందేలు మాత్రం ఇదంతా చూస్తు నిస్సహయంగా నిలుచుంది. ఏమి చేయాలో తెలియక అటుఇటూ తిరుగుతు కాలక్షేపం చేసింది. కోతులు పొలాలను నాశం చేయడం చూసిన రైతులు వెంటనే పెద్ద పెద్ద కర్రలతో పరుగెత్తుకుంటూ వచ్చారు. కోతుల గుంపులను కర్రలతో కొట్టడంతో అవి వెంటనే పారిపోయాయి. ఇవేమి అర్థం కాని కుందేలు మాత్రం అక్కడే ఏమి తెలియనట్లు నిల్చుని రైతులకు చిక్కింది. దీంతో కుందేలు ‘‘ బాబోయ్ బాబోయ్ నాకేమి తెలియదు, నేను అమాయకురాలిని, నేనేమి చేయలేదు మీ పంట పొలాలను నాశనం చేసింది నేను కాదు నన్ను వదిలేయండి ’’ అని రైతులను ప్రాదేయపడిరది. రైతులు నమ్మకం కుదరక కుందేలును కర్రలతో కొట్టారు. అప్పుడు కుందేలు చెడు వ్యక్తులతో స్నేహం చేయవద్దని తెలుసుకొని మెల్లగా అడవిలోకి బయలుదేరింది.
నీతి ః చెడు స్నేహం ప్రమాదకరం
0 Comments