
తోడేలు మోసం
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
ఒకానొక అడవిలో ఒక తోడేలు ఉండేది. అది ఆహారం వెతుక్కుంటూ అడవిలో వెళుతుంది. ఇలా వెళుతుండగా దారితప్పిపోయి ఒక గ్రామంలోకి ప్రవేశించింది. అలా గ్రామంలోని రోడ్డువెంబడి వెళుతుండగా ఒక్క కుక్క దానికి ఎదురుగా వచ్చింది. తోడేలు ఆ కుక్కను చూసి ‘‘ నీ మెడలో ఆ గొలుసు, బిళ్ల ఎమిటి ? ’’ అని ప్రశ్నించింది తోడేలు. దీంతో కుక్క ‘‘ నన్ను ఒక యజమాని పెంచుకుంటున్నాడు. అందుకే నా మెడలో యజమాని గొలుసు మరియు బిళ్ల తగిలించినాడు ’’ అని చెప్పింది. నన్ను మా యజమాని చాలా బాగా చూసుకుంటాడు. ప్రతి రోజు చపాతిలు, పాలు, మాంసం పెడతాడు, అంతేకాదు వేడినిళ్లతో చక్కగా స్నానం చేయిస్తాడు. నాకు ఏ అనారోగ్యం కల్గిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తాడు. నన్ను తన ఇంట్లో మనిషిగా చూసుకుంటాడు. మా యజమాని పిల్లులను కూడా పెంచుకుంటాడు. మేము జాతి వైరం మరిచి కలిసిమెలిసి జీవిస్తాము అని చెప్పింది కుక్క. కుక్క చెప్పిన మాటలు విన్న తోడేలుకు అసూయ కల్గింది. నేను రోజు ఎండలో ఎండుతూ, వానకు తడుస్తూ అడవిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. కానీ కుక్క మాత్రం ఇక్కడ రాజబోగాలు అనుభవిస్తుందని అని కుక్క మీద ఈర్ష్య కల్గుతుంది తోడేడుకు. దీంతో తోడేలు కుక్కతో ఇలా అంది ‘‘ మనమిద్దరము స్నేహితులము కదా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లు ’’ అని అడిగింది. దీనికి అంగీకరించిన కుక్క తోడేలును తన ఇంటికి తీసుకెళ్లింది. యజమాని చూస్తే ఇబ్బంది అని చెప్పి తోడేలును ఇంటి పక్కన ఎవరు లేని ప్రదేశంలో ఉంచింది కుక్క. తన యజమాని రోజు పెట్టే చపాతిలు, మాంసం, గుడ్డు తోడేలుకు తెచ్చి ఇచ్చింది. తోడేలు వాటిని తిన్న తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లిపోమని లేదంటే మా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడని తోడేలుతో చెప్పింది కుక్క. ఈ మాటలు విన్న తోడేలు నాకు ఇంక్కొక్క రోజు ఇక్కడ ఉండాలని ఉంది అని చెప్పింది కుక్కతో. అందుకు అంగీకరించింది కుక్క. తర్వాతి రోజు రాత్రిసమయంలో తోడేలు యజమాని ఇంట్లో ఉన్న రెండు పిల్లులను చంపి తినేసి వెళ్లిపోయింది. యజమాని తెల్లవారుజామున లేచి చూసేసరికి పిల్లుల యొక్క రక్తం, ఎముకలు కనిపిస్తాయి. ఎంతో నమ్మకంగా పెంచి పోషించిన కుక్క ఈ పని చేసిందని భావించి కుక్కను చితక్కొట్టి ఇంటి నుండి తరిమేస్తాడు.
నీతి ః నమ్మించి మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి
0 Comments