
నాలుగేళ్లలో డిగ్రీతో పాటు బిఈడి చేయాలనుకుంటున్నారా ..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం ద్వారా ఇప్పుడు సాధ్యం
సమీకృత నాలుగు సంవత్సరాల బీఈడీ కోర్సు
ఇకనుండి ఇంటర్మిడియట్ పూర్తి చేసిన తర్వాత ఒకే సమయంలో డిగ్రి మరియు బిఈడి పూర్తి చేయవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ సమీకృత బీఈడీ కోర్సు (ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్) కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విద్యావిధానం ప్రకారం బీఈడీ చేయాలంటే మూడు సంవత్సరాల డిగ్రీ, రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యూకేషన్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులుగా ఉండేవారు. దీనికి మొత్తం 5 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు ప్రవేశపెట్టిన సమీకృత బీఈడీ కోర్సు ద్వారా నాలుగు సంవత్సరాలలోనే డిగ్రీతో పాటు బీఈడి పూర్తి చేసే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలోని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) ఈ ఐదు సంవత్సరాల కోర్సు కొరకు వ్రాత పరీక్షను నిర్వహిస్తుంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నాలుగు సంవత్సరాల కోర్సు నిర్వహించేందుకు తెలంగాణలోని మూడు కాలేజీల(మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్‌ఐటీ, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ను ఎంపిక చేయడం జరిగింది. ఈ మూడు కాలేజీలకు కలిపి మొత్తం 250 సీట్లు ఉంటాయి. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే వ్రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తిస్తారు.
ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే వ్రాత పరీక్షకు అర్హులు అవుతారు. ఈ వ్రాత పరీక్షలో మొత్తం 160 బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ అప్టిట్యూడ్‌ల నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కొరకు 19 జూలై 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 178 నగరాలలో 13 ప్రాంతీయ భాషలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
➠ కోర్సు పేరు
- ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటిఈపి) / సమీకృత బీఈడి కోర్సు
➠ ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అర్హత :
- ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
➠ ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ధరఖాస్తు విధానం :
- ధరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
➠ పరీక్షా విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్టు
➠ తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన కాలేజీలు :
- మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, రంగారెడ్డి
b) బీఎస్సీ - బీఈడీ - 50
- వరంగల్ ఎన్‌ఐటీ
- మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్
➠ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సీట్లు :
- 250 సీట్లు
➠ సబ్జెక్టు :
- జనరల్ నాలెడ్జ్
- కరెంట్ అపైర్స్
- జనరల్ మెంటల్ ఎబిలిటి
- న్యూమరికల్ ఎబిలిటీ
- లాజికల్ అండ్ అనలికల్ రీజనింగ్
- టీచింగ్ ఆప్టిట్యూడ్
➠ పరీక్షా పద్దతి :
- మొత్తం 160 బహుళైచ్చిక ప్రశ్నలుంటాయి
ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ముఖ్యమైన తేదీలు | |
---|---|
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 26 జూన్ 2023 |
ధరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది | 19 జూలై 2023 |
డెటా కరెక్షన్ | 20-21 జూలై 2023 |
పరీక్ష తేది | తర్వాత ప్రకటిస్తారు |
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ | పరీక్షకు మూడు రోజుల ముందు |
ఆన్‌లైన్ అప్లై కొరకు | Click Here |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
కేటగిరీ | అడ్మిషన్ |
దేశం | ఇండియా |
కోర్సు | ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ |
అర్హత | ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత |
నిర్వహించే సంస్థ | నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ |
కాలపరిమితి | 4 సంవత్సరాలు |
ధరఖాస్తు ప్రక్రియ | ఆన్‌లైన్ ద్వారా |
ధరఖాస్తులు ప్రారంభం | 26 జూన్ 2023 |
ధరఖాస్తులు ముగింపు | 19 జూలై 2023 |
పరీక్ష తేది | తర్వాత ప్రకటిస్తారు |
జవాబు : లేదు, ఇంటర్మిడియట్ మాత్రమే పూర్తి చేసి ఉండాలి
జవాబు : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్‌ఐటీ, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల
జవాబు : 19 జూలై 2023
జవాబు : ప్రస్తుతానికి పరీక్ష తేదిని ప్రకటించలేదు. త్వరలో పరీక్ష తేదిని ప్రకటించడం జరుగుతుంది
జవాబు : పరీక్ష తేది ప్రకటించిన తర్వాత పరీక్షకు మూడు రోజుల ముందు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.
జవాబు : బికాం - బీఈడీ, బీఎస్సీ - బీఈడీ, బీఏ - బీఈడీ
జవాబు : తెలంగాణలో ఎంపిక చేసిన మూడు కాలేజీలలో కలిపి 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
జవాబు : జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహిస్తుంది.
జవాబు : పరీక్షను మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు
జవాబు : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు.
0 Comments