చీమల శక్తి కథ తెలుగులో || Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu

చీమల శక్తి 
Stories in Telugu

Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu

అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఆ ఏనుగు అడవి మొత్తం తానే బలమైందని, తెలివైందని విర్రవిగిపోయేది. దానికన్న చిన్న జంతువులు అడవిలో కనిపిస్తే హేళన చేస్తు, ఏడిపిస్తు బాదపెడుతుండేది. ఒక రోజు అడవిలో వెళుతుండగా ఏనుగుకు ఒక చీమల పుట్ట కనిపించింది. ఆ పుట్టను చీమలు ఎన్నో రోజుల కష్టపడి అందంగా కట్టుకున్నాయి. ఏనుగు ఆ అందమైన చీమల పుట్టను చూడగానే దానిని ధ్వంసం చేయాలని దుర్భుద్ది పుట్టింది. అంతే ఒక్కసారిగా తన రెండు కాళ్లతో ఆ చీమల పుట్టను ధ్వంసం చేసింది. అప్పుడు వెంటనే చీమల పుట్టలోంచి బయటకు వచ్చిన చీమలు ఏనుగుతో ఇలా అన్నాయి. ‘‘ మేము ఎంతో కష్టపడి కట్టుకున్న పుట్టను ఎందుకు ధ్వంసం చేసినావు ’’ అని అడిగాయి. వెంటనే ఏనుగు నేను దారివెంబడి పోతూ ఉండే నా కాళ్లకింద పడి  నలిగిపోయిందని నవ్వుకుంటూ సమాధానం ఇచ్చింది ఏనుగు. చీమల పుట్ట కూలీపోవడంతో చీమలు చాలా బాదపడ్డాయి. ఎలాగైన ఏనుగుకు బుద్ది చెప్పాలని అనుకొని తగు సమయం కోసం వేచిచూడసాగాయి. ఒక రోజు ఏనుగు అడవిలో గాఢనిద్రలో ఉండగా నెమ్మదిగా చీమల ఒకదానివెంబడి ఒకటి నెమ్మదిగా కదులుతూ ఏనుగు తొండంలోకి ప్రవేశించాయి. వెంటనే మెలకువ వచ్చిన ఏనుగు ఆ నొప్పి భరించలేక వదిలిపెట్టమని చీమలను ప్రాదేయపడిరది. కొంతసేపు ఏనుగును ఏడిపించిన తర్వాత చీమలు తొండంలోంచి బయటకు వచ్చాయి. అప్పుడు చీమలన్ని ఏనుగుతో ఇలా అన్నాయి. ‘‘ చూశావా మేము చిన్న జీవులమని చులకనతో మా పుట్టని కూల్చివేశావు. మేము తలుచుకుంటే ఎంత పెద్దదానినైన బాదపెట్టగలము, ఎవరిని చులకనగా చూడకు, ఎవరిని బాదపెట్టకు, ఎవరి శక్తి వారికి ఉంటుంది ’’ అని అన్నాయి. ఆ రోజు నుండి ఏనుగు అడవిలోని అన్ని జంతువుల పట్ల స్నేహంగా ఉంటూ జీవించింది. 


నీతి : ఎవరి శక్తికి తక్కువగా అంచనా వేయద్దు

Post a Comment

0 Comments