
పిసినారి బట్టల వ్యాపారి
Telugu Moral Stories
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
ఒకానొక పట్టణంలో ఒక బట్టల వ్యాపారి ఉండేవారి. ఆ వ్యాపారి బాగా పిసినారి. ఎవరికి ఏ సాయం అడిగినా చేసేవాడు కాదు. అతని బట్టల వ్యాపారం ఎప్పుడు వినియోగదారులతో కిటకిటలాడుతూ ఉండేది. ఆ వ్యాపారి ప్రతిరోజు సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టకుండా తన ఇంటి వెనకాల ఉన్న పెరడులో ఒక చిన్న గుంత తవ్వి అందులో దాచిపెట్టుకునేవాడు. అంతేకాకుండా వాటిని ప్రతిరోజు లెక్కించి సంతృప్తి చెందిన తర్వాతనే నిద్రకు ఉపక్రమించేవాడు. ఇలా ఒక రోజున తన సంపాదించిన డబ్బులను దాచిపెడుతుండగా చెట్టుపై నుండి ఒక దొంగ గమనిస్తాడు. వ్యాపారి లెక్కింపు పూర్తి అయి ఇంట్లోకి వెళ్లి నిద్రపోయిన తర్వాత దొంగ డబ్బులన్నింటిని దోచుకొని వెళతాడు. తర్వాతి రోజు వ్యాపారం వచ్చి చూసేసరికి డబ్బు కనబడకుండా పోతుంది. దీంతో వ్యాపారి లబోదిబోమంటూ ఏడూస్తూ కూర్చుంటాడు. ఇంతలో తన స్నేహితుడు వచ్చి నువ్వు సంపాదించిన డబ్బులను ఖర్చు పెట్టిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కాదా అంటాడు. వ్యాపారి తాను సంపాదించిన డబ్బులను ఖర్చు పెట్టకుండా దాచుకుంటాను అని బదులిస్తాడు వ్యాపారి. తన స్నేహితుడు ఒక రాళ్లు తీసుకొని భూమితో పాతిపెడతాడు. ఇప్పుడు నువ్వు దాచుకున్న డబ్బులు, ఈ రాళ్లు రెండు ఒక్కటే కదా రెండిటికి ఏమి తేడా లేదు. మనం వాడని వస్తువు ఎంత విలువైనది అయినా అది రాయితో సమానం అంటాడు. జ్ఞానోదయం అయిన వ్యాపారం ఆ రోజు నుండి వ్యాపారంలో వచ్చిన డబ్బులు అవసరమైన వాటికి ఖర్చు పెడుతూ, ఇతరులకు సాయం చేస్తు జీవిస్తాడు.
Moral : మనం వాడని వస్తువు ఎంత విలువైనది అయిన రాయితో సమానం
0 Comments