Gk Questions in telugu for competitive exams Part - 2 || Gk Questions with Answers || Gk MCQ Questions with Answers

Gk Questions with Answers in telugu Part - 2

Gk Quiz Test in Telugu
Gk Questions in Telugu || Gk MCQ Questions with Answers 

1) ఈ క్రింది వాటిలో తెలంగాణలో కులాలు, వాటి ఆశ్రిత కులానికి సంబందించి సరికానిజతను గుర్తించండి ?
ఎ) పద్మశాలీలు - సాధానశూరులు
బి) బుడగజంగాలు - కాటిపాపలు
సి) కోమట్లు - వీర ముష్టివారు
డి) కుమ్మరి - కాకి పడగల వారు

జవాబు : డి (కుమ్మరి - కాకి పడగల వారు)

2) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబందించి కేంద్ర పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ నోడల్‌ ఏజేన్సీగా పనిచేస్తుంది
2) అదిలాబాద్‌ డోక్రా మెటల్‌ క్రాప్ట్‌కు 2017-18 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు లభించింది
ఎ) 2 మాత్రమే
బి) 1 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు

జవాబు : సి (1 మరియు 2)

3) శాతవాహనుల కాలంలో ‘‘రజుక’’ అనగా ఏమి ?
ఎ) అంగరక్షకుడు
బి) ఆస్థాన వైద్యుడు
సి) కోశాధికారి
డి) న్యాయమూర్తి

జవాబు :డి (న్యాయమూర్తి)

4) ఈ క్రింది వాటిని జతపరచుము ?
ఎ) వినుకొండ వల్లభాచార్యుడు
బి) తిక్కన సోమయాజులు
సి) మంచన
డి) ఏకామ్రనాధుడు

1) ప్రతాప చరిత్ర
2) కేయూరబహుచరిత్ర
3) కవిబ్రహ్మ
4) క్రీడాభిరామం

ఎ) ఎ-4, బి-3, సి-1, డి-2
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-1, సి-2, డి-3
డి) ఎ-3, బి-4, సి-1, డి-2

జవాబు : బి (ఎ-4, బి-3, సి-2, డి-1)

5) నిజాం కాలంలో ‘‘బటాయి విధానం’’ అనగా నేమి ?
ఎ) భూమి శిస్తును ధాన్యం రూపంలో వసూలు చేయడం
బి) భూమి శిస్తును ధన రూపంలో చెల్లించడం
సి) భూమిని కొలిచేటువంటి విధానం
డి) వేలంపాట ద్వారా అధికారాన్ని పొందటం

జవాబు : ఎ (భూమి శిస్తును ధాన్యం రూపంలో వసూలు చేయడం)

6) ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) నిజాం కాలంలో 1888 గెజిట్‌ ప్రకారం కనీసం 12 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారు ముల్కీలుగా గుర్తించబడతారు
బి) ముల్కీ ఉద్యమ గాడ్‌ ఫాధర్‌ అని కిషన్‌ పెర్షాద్‌ ను పిలుస్తారు
సి) దక్కనీ జాతీయవాదం అనే సిద్దాంతాన్ని తీసుకువచ్చింది ` నవాల్‌ సర్‌ నిజామత్‌ జంగ్‌
డి) 1919 ఫర్మానా ప్రకారం 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో ఉన్న వ్యక్తి ముల్కీ ఉద్యోగిగా పరిగణించబడతాడు

జవాబు : సి (దక్కనీ జాతీయవాదం అనే సిద్దాంతాన్ని తీసుకువచ్చింది ` నవాల్‌ సర్‌ నిజామత్‌ జంగ్‌)

7) ఏ సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రాంతీయ సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది ?
ఎ) 1955
బి) 1956
సి) 1957
డి) 1958

జవాబు : డి (1958)

8) ఈ క్రింది వాటిలో ఏ కమిటి ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి వీలులేదని రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదని తన నివేదికలో పేర్కొంది ?
ఎ) జస్టిస్‌ వశిష్ట భార్గవ కమిటీ
బి) కుమార్‌ లలిత్‌ కమిటీ
సి) జగన్మోహన్‌ రెడ్డి కమిటీ
డి) వాంఛూ కమిటీ

జవాబు : డి (వాంఛూ కమిటీ)
1969 లో వాంఛూ కమిటీ వేయడం జరిగింది

9) ఈ క్రింది సంఘటనలు అవి జరిగినటువంటి కాలానుక్రమంలో అమర్చండి ?
1) నిజామాబాద్‌ అడ్వకేట్‌ సమావేశం
2) భువనగిరి సభ
3) తెలంగాణ ప్రగతి నివేదిక
4) తెలంగాణ ఐక్య వేదిక
ఎ) 1, 3, 2, 4
బి) 1, 2, 3, 4
సి) 2, 1, 3, 4
డి) 1, 2, 4, 3

జవాబు : బి (1, 2, 3, 4)

10) టి`జేఏసి నిర్వహించిన ఈ క్రింది కార్యక్రమాలకు సంబందించి సరికాని జతను గుర్తించండి ?
ఎ) సహాయ నిరాకరణ ఉద్యమం - 2011 ఫిబ్రవరి 17 నుండి మార్చి 4
బి) మిలియన్‌ మార్చ్‌ - 2010 మార్చి 10
సి) సకల జనుల సమ్మె - 2011 సెప్టెంబర్‌ 13 నుండి అక్టోబర్‌ 24
డి) సాగరహరం - 2012 సెప్టెంబర్‌ 30
బి(మిలియన్‌ మార్చ్‌ - 2010 మార్చి 10) ఇది 2011 లో జరిగింది.

జవాబు : బి(మిలియన్‌ మార్చ్‌ - 2010 మార్చి 10)
ఇది 2011 లో జరిగింది.


Also Read :

11) ఈ క్రింది ఏ చట్టం ద్వారా భారతదేశంలో తొలిసారిగా మున్సిపాలిటీలకు చట్టబద్దత కల్పించారు ?
ఎ) 1773 రెగ్యులేటింగ్‌ చట్టం
బి) ఫిట్స్‌ ఇండియా చట్టం
సి) 1913 చార్టర్‌ చట్టం
డి) 1793 చార్టర్‌ చట్టం

డి (1793 చార్టర్‌ చట్టం)

12) రాజ్యాంగ పరిషత్‌ కమిటీలకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది ?
ఎ) కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ - జవహర్‌ లాల్‌ నెహ్రూ
బి) కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ - బాబు రాజేంద్రప్రసాద్‌
సి) సలహా సంఘం - సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌
డి) రాజ్యాంగ ముసాయిదా కమిటీ - డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌

జవాబు : బి (కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ - బాబు రాజేంద్రప్రసాద్‌)
దీనిని అధ్యక్షులు జవహర్‌ లాల్‌నెహ్రూ

13) రాజ్యాంగ ప్రవేశికకు సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను అమెరికా నుండి స్వీకరించారు
2) ప్రవేశికలో సామ్యవాదం అనే పదానికి అర్థం సమ సమాజ స్థాపన
3) 1960 బెరూబారి కేసులో సుప్రీం కోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని తీర్పునిచ్చింది.
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : బి (1 మరియు 2)

14) భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఈ క్రింది ఏ ఆర్టికల్స్‌ తెలుపుతాయి ?
ఎ) ఆర్టికల్‌ 3 నుండి 11 వరకు
బి) ఆర్టికల్‌ 5 నుండి 12 వరకు
సి) ఆర్టికల్‌ 4 నుండి 11 వరకు
డి) ఆర్టికల్‌ 5 నుండి 11 వరకు

జవాబు : డి (ఆర్టికల్‌ 5 నుండి 11 వరకు)
భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంది. దీనిని బ్రిటన్‌ నుండి గ్రహించడం జరిగింది.

15) భారతరాజ్యాంగంలో ఆర్టికల్‌ 14 కు సంబందించి ఈ క్రిందివాటిలో సరైనవి గుర్తించండి ?
1) చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను బ్రిటన్‌ రాజ్యాంగం నుండి స్వీకరించారు
2) చట్టం వల్ల సమాన రక్షణ అనేటువంటి భావనను మన రాజ్యాంగంలోకి అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు

జవాబు : సి (1 మరియు 2)

16) పౌరులందరికి స్త్రీ-పురుష భేదం లేకుండా సమాన జీవనోపాదులు కల్పించాలి అని తెలిపే ఈ క్రింది రాజ్యాంగ ఆర్టికల్‌ ఏది ?
ఎ) 39(ఎ)
బి) 39(బి)
సి) 39(సి)
డి) 39(డి)

జవాబు : ఎ (39(ఎ))

17) రాష్ట్రపతి అధికారాలకు సంబందించి ఈ క్రిందివాటిలో సరికానిది ?
ఎ) ఆర్టికల్‌ 155 ప్రకారం రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తాడు
బి) ఆర్టికల్‌ 123 ప్రకారం ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్‌ జారీ చేస్తాడు
సి) ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు
డి) ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు

జవాబు : డి (ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు)
దీనికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తాడు

18) ఈ క్రింది రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను 2026 వరకు మార్చరాదని నిర్ధేశించారు ?
ఎ) 82
బి) 84
సి) 86
డి) 88

జవాబు : బి (84)

19) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) ద్రవ్య బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి నేరుగా రాజ్యసభలో ప్రవేశపెట్టరాదు
2) ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్యబిల్లులు కావు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు

జవాబు : సి (1 మరియు 2)

20) సుప్రీం కోర్టు ప్రారంభ అధికార పరిధి గురించి తెలిపే ఈ క్రింది ఆర్టికల్‌ ఏది ?
ఎ) ఆర్టికల్‌ 131
బి) ఆర్టికల్‌ 143
సి) ఆర్టికల్‌ 133
డి) ఆర్టికల్‌ 135

జవాబు : ఎ ( ఆర్టికల్‌ 131)


 
Also Read : 

Post a Comment

0 Comments