
తెలివైన కాకి కథ తెలుగులో
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది ఎండాకాలం కావడంతో ఎండకు కాకికి చాలా దాహం వేసింది. అడవిలో ఎక్కడ చూసినా నీటి చాయ కనిపించడ లేదు. పైన ఎండవేడి తీవ్రంగా ఉంది. దాహాన్ని తీర్చుకోవడం కోసం అడవి అంతా చూడసాగింది. ఎండాకాలం కావడంలో చెరువులు, నదులు, కుంటలు, వాగులు, వంకలు అన్ని ఎండిపోయి ఉన్నాయి. ఇలా నీటి జాడ కోసం వెతుకుతు ఒక గ్రామంవైపు వెళ్లింది. అక్కడ కొంత దూరంలో ఒక కుండ కనిపించింది కాకికి. ఎంతో ఆతృతగా కుండ దగ్గరికి వెళ్లి దాహం తీర్చుకోవడం కోసం కుండలోకి తొంగి చూసింది. కానీ ఆ కుండలో నీరు కాకికి అందకుండా అడుగుభాగంలో ఉన్నాయి. ఆ గుండ పక్కనే కొన్ని చిన్నచిన్న రాళ్లు కనిపించాయి. ఆ రాళ్లను చూడగానే కాకికి ఒక
ఉపాయం తట్టింది. వెంటనే ఒక్కొక్క రాయిని తీసి కుండలో వేయసాగింది. ఇలా కాకి ఒక్కొక్క రాయి వేస్తుండగా కుండలోని నీరు పైకిరాసాగాయి. ఇలా అన్ని రాళ్లు వేసిన తర్వాత కుండలోని నీరు కాకికి అందేవిధంగా పైకి వచ్చాయి. కాకి వెంటనే ఆ నీటిని త్రాగి దాహార్తిని తీర్చుకుంది.
Moral : ఉపాయంతో ఏ పనినైన సాధించవచ్చు.
0 Comments