
కుందేలు - తాబేలు పరుగు పోటీ
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు, తాబేలు ఉండేవి. సహజంగా కుందేలు వేగంగా పరుగెత్తుతుంది. తాబేలు మాత్రం నెమ్మదిగా నడుస్తుంది. దీంతో కుందేలు వేగంగా పరుగెత్తే శక్తి ఉండడంతో అహంకారంతో అడవిలో ఉన్న జంతువులన్నింటిని హేళన చేస్తుంది. ఒకరోజు కుందేలు తాబేలుతో ఇలా అంది ‘‘ నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు, నువ్వు నాతో పరుగుపందెం పెట్టుకుంటే నిన్ను సులువుగా ఓడిస్తాను ’’ అని అంది. ఇలా వెటకారంగా మాట్లాడేసరికి తాబేలుకు కోపం వచ్చి కుందేలుతో పరుగుపందెం పోటీకి ఒప్పుకుంటుంది. కుందేలు, తాబేలు పరుగు పందెం పోటీకి సిద్దమయ్యాయి. ఈ పోటీ చూడడానికి అడవిలోని జంతువులన్ని వస్తాయి. కుందేలు ఎంతో గర్వంతో పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు ఎంతో అణకువగా, వినయంతో వస్తుంది. ఎలుగుబంటి పతకదారిగా వ్యవహరించింది. ఎలుగుబంటి ఒకటి, రెండు, మూడు అని జెండాను ఊపగానే కుందేలు వేగంగా పరుగెత్తడం మొదలుపెట్టింది. తాబేలు మాత్రం నెమ్మదిగా పరుగెత్తడం ప్రారంభించింది. ఇలా కుందేలు కొంచెం దూరం వేగంగా పరుగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. తాబేలు దరిదాపుల్లో కూడా లేకపోయేసరికి తాబేలు గెలవడం అసాధ్యం అని భావించింది. తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అంతలోపు కొంచేం సేపు కునుకు తిద్దామని చెట్టుకింద పడుకుంది కుందేలు. ఇలా చెట్టు నీడలో హాయిగా కళ్లు మూసుకుని నిద్రపోయింది. కొంతసేపటికి తాబేలు కుందేలు పడుకున్న చెట్టును తాటుకుంటూ వెళుతూ కుందేలు నిద్రపోవడం చూస్తుంది. కానీ తాబేలు కుందేలును లెక్కచేయకుండా విలైనంత వేగంగా పరుగెత్తి ముగింపు గీత వద్దకు చేరుకుంటుంది. కుందేలు నిద్రలో నుండి లేచి చూసి పరుగెత్తే సరికి తాబేలు విజయాన్ని అందుకుంటుంది. దీంతో అడవిలోని జంతువులంతా తాబేలు విజయాన్ని ఆనందోత్సహాలతో జరుపుకుంటాయి. ఇదంతా కుందేలు దిగాలుగా కూర్చుని వేడుకలను తిలకిస్తుంది.
నీతి : ఎవరి శక్తిని తక్కువగా అంచనా వేయద్దు
0 Comments