Kakatiya Dynasty gk questions in telugu || Tspsc Telangana History : Kakatiya Dynasty MCQ Questions in telugu || Part - 1

Kakatiya Dynasty : Gk questions and Answers in telugu Part - 1

Kakatiya Dynasty gk questions in telugu || gk bits in telugu || Kakatiya Dynasty  MCQ Questions in telugu || Part - 1

Tspsc Telangana History : Kakatiya Dynasty  Questions with answers in telugu


1. కాకతీయులకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) రాజ్యస్థాపకుడు - మొదటి బేతరాజు
బి) మతం - వైదిక మతం
సి) రాజభాష - సంస్కృతం
డి) రాజ చిహ్నం - వరాహం

జవాబు : బి (మతం - వైదిక మతం) వీరి యొక్క మతం శైవము

2) కాకతీయులకు సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) కాకతీ అనగా కుష్మాండం అని అర్థం వస్తుంది
2) శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశం మొత్తాన్ని పాలించింది కాకతీయులు
3) కాకతీయుల కాలంలో జారీ చేసిన శాసనాలు ఎక్కువ భాగం సంస్కృతంలోనూ తక్కువ భాగంలో తెలుగులో ఉన్నాయి.
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : ఎ (పైవన్నీ)

3) కాకతీయులకు సమకాలీన రాజులకు సంబందించి సమకాలీన రాజులలో లేని రాజులు ఎవరు ?
ఎ) హోయసాలులు
బి) యాదవులు
సి) ఢిల్లీ సుల్తానులు 
డి) గుప్తులు

జవాబు : డి (గుప్తులు)

Tspsc Telangana History : 

4) మాగల్లు /మాంగల్లు శాసనంకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) ఈ శాసనం వెంగి చాళుక్య రాజు దానర్ణవుడు వేయించాడు
బి) ఈ శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు వెన్నభూపతి
సి) ఈ శాసనం కాకతీయుల సామంత విట్ట వంశానికి చెందిన వారని తెలియజేస్తుంది
డి) మొదటిసారిగా కాకతీయుల గుర్తించి ప్రస్తావించిన శాసనం

జవాబు : బి (ఈ శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు వెన్నభూపతి)
ఈ శాసనం ప్రకారం మూలపురుషులు కకర్త్యగుండ్యన

5) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ వేయించింది
2) బయ్యారం చెరువు శాసనం కాకతీయుల వంశవృక్షం గురించి తెలుపుతుంది
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ తప్పు

జవాబు : ఎ (1 మరియు 2)

6) కాకతీయుల స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నట్లు తెలియజేసే శాసనం ఏది ?
ఎ) హనుమకొండ వేయిస్తంబాల గుడి శాసనం
బి) ద్రాక్షారాం శాసనం
సి) శనిగరం శాసనం
డి) ఖాజీపేట శాసనం

జవాబు : ఎ (హనుమకొండ వేయిస్తంబాల గుడి శాసనం )
దీనిని రుద్రదేవుడు వేయించడం జరిగింది.

7) రుద్రమదేవి బంటు పువ్వాల ముమ్మడి వేసిన శాసనం ఏది ?
ఎ) చందుపట్ల శాసనం
బి) త్రిపురాంతక శాసనం
సి) సకల వీడు శాసనం
డి) కొలనుపల్లి శాసనం

జవాబు : ఎ (చందుపట్ల శాసనం)
ఈ చందుపట్ల శాసనం రుద్రమదేవి మరణం గురించి తెలియజేస్తుంది

Tspsc Telangana History : 

8) ఈ క్రింది వాటిని జతపరుచుము?
1) సకల వీడు శాసనం
2) కలువచెరు శాసనం
3) విలాస తామ్ర శాసనం
4) జన్నిగదేవుని దుర్గి శాసనం

ఎ) రుద్రమదేవి పట్టాభిషేకం గురించి
బి) ప్రోలయ నాయకుడు
సి) వరంగల్‌పై తురుష్కుల దండయాత్ర
డి) పాండ్యుల మీద విజయానికి గుర్తు

ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి

జవాబు : సి (1-డి, 2-సి, 3-బి, 4-ఎ)

9) కాకతీయుల కాలం నాటి శైవమత స్థితిని, ఇతర మతాల గుర్తించి ప్రస్తావించిన గ్రంథం ఏది  ?
ఎ) నీతిసారం
బి) క్రీడాభిరామం
సి) పండితారాధ్య చరితం
డి) శివయోగసారం

జవాబు : సి (పండితారాధ్య చరితం)
పండితారాద్య చరితం ను పాల్కురికి సోమనాథుడు రచించడం జరిగింది.

10) ఈ క్రింది ఏ గ్రంథంలో శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామంలో శివలింగాల వల్ల ఆంధ్రదేశంలో త్రిలింగదేశం అని పేరు వచ్చిందని వర్ణించబడింది ?
ఎ) నీతిశాస్త్ర ముక్తావళి
బి) ప్రతాపరుద్ర యశోభూషణం
సి) ఆంధ్రమహాభారతం
డి) నిర్వచనోత్తరం రామాయణం

బి (ప్రతాపరుద్ర యశోభూషణం)
దీనిని విద్యానాథుడు రచించడం జరిగింది.




Post a Comment

0 Comments