NIACL Recruitment 2023 || New India Assurance AO Jobs Eligibility, Apply Online || ఇన్సురెన్స్ కంపెనీలో 450 ఏవో పోస్టులకు నోటిఫికేషన్ || Jobs in Telugu || Latest Jobs in Telugu

NIACL Recruitment 2023 || New India Assurance AO Recruitment 2023 Eligibility & Apply Online || ఇన్సురెన్స్ కంపెనీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. 450 ఏవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ ఏవో జాబ్స్‌ 
డిగ్రీతో కొలువు 
450 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ 
450 Administrative Officer Vacancies || New India Assurance Recruitment 2023 Apply Online || Jobs in Telugu || Latest Jobs in Telugu

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్స్‌ (ఏవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఖాళీగా ఉన్న మొత్తం 450 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరలిస్టు -120, స్పెషలిస్టు -330 పోస్టులున్నాయి. డిగ్రీ / పీజీ పూర్తి చేసుకున్న అర్హులైన 21 నుండి 30 సంవత్సరాలున్న అభ్యర్థులు 21 అగస్టు 2023 లోగా ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ ఏవో ఆన్‌లైన్‌ లో ధరఖాస్తు చేసుకోవాలంటే ఫీజు రూ॥850/ రూపాయలు (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు రూ॥100) చెల్లించాలి. ఇందులో జనరలిస్టు 120 పోస్టులండగా, స్పెషలిస్టు 330 (రిస్క్‌ ఇంజనీర్‌ -36, ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ -96, లీగల్‌ -70, అకౌంట్స్‌ -30, హెల్త్‌ -75, ఐటీ -23) పోస్టులున్నాయి. 

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ(ఏఓ) పరీక్ష ప్రిలిమ్స్‌, మేయిన్స్‌ రెండు విభాగాల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారిలో మొత్తం పోస్టులకు పదిహేనింతల మందిని మేయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్యూకు ఎంపిక అవుతారు. ఇంటర్యూలో విజయం సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌లోని ఆబ్జెక్టివ్‌, ఇంటర్యూల మార్కులను 75 : 25 నిష్పత్తిలో తీసుకొని తుది జాబితాలో ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్‌ టెస్టులు అర్హత పరీక్షలు మాత్రమే. 

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ ఏఓ ఉద్యోగం సాధించిన వారికి రూ॥50,925 మూలవేతనం చెల్లిస్తారు. మెట్రో నగరాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా ఫీఎప్‌, ఆర్‌డీఏ, గ్రాట్యూటీ, ఎల్‌టీఎస్‌, మెడికల్‌, వసతి వంటి అలవెన్సులు ఉంటాయి. అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ (ఏఓ) ఉద్యోగం సాధించిన వారు చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) స్థాయి వరకు వెళ్లవచ్చు. 

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ(ఏఓ) ప్రిలిమినరీ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. 1) క్వాంటిటేవివ్‌ అప్టిట్యూడ్‌, 2) రీజనింగ్‌, 3) ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ అలాగే మెయిన్స్‌ పరీక్షలో 4 విభాగాలు 1) క్వాంటిటేవివ్‌ అప్టిట్యూడ్‌, 2) రిజనింగ్‌ 3) ఇంగ్లీష్‌ 4) జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటాయి. డిస్క్రీప్టివ్‌ ఇంగ్లీష్‌లో లెటర్‌, వ్యాసం వ్రాయాల్సి ఉంటుంది. 

➠ పరీక్ష పేరు :

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్స్‌ (ఏవో) జాబ్స్‌ 

➠ NIACL AO Recruitment 2023 ఎన్ని పోస్టులున్నాయి :

అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్స్‌ (ఏవో) మొత్తం 450 పోస్టులున్నాయి. 

రిస్క్‌ ఇంజనీర్‌ 36
ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ 96
లీగల్‌ 70
అకౌంట్స్‌ 30
హెల్త్‌ 75
ఐటీ 23
జనరలిస్టు 120
Total 450


➠ NIACL AO Recruitment 2023 విద్యార్హత :

జనరలిస్టు డిగ్రీ / పిజిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి
రిస్క్‌ ఇంజనీర్ ఇంజనీరింగ్‌ (డిగ్రీ/పిజీ)
ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ బీఈ/బిటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ లేదా డిగ్రీ /పీజి ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌
లీగల్‌ ‘‘లా’’ లో డిగ్రీ /పిజీ
అకౌంట్స్‌ చార్టర్‌ అకౌంటెంట్‌ మరియు డిగ్రీ/పీజీ
హెల్త్‌ ఎంబిబిఎస్‌ / ఎండి/ఎంఎస్‌ లేదా పిజీ మెడికల్‌ డిగ్రీ లేదా బిడిఎస్‌ /ఎండిఎస్‌ లేదా బిఎఎంస్‌/బిహెచ్‌ఎంఎస్‌ (డిగ్రీ / పీజి)
ఐటీ బీఈ/బిటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఇన్‌ ఐటీ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఎంసీఏ

➠ NIACL AO Recruitment 2023 వయస్సు : 

  • తేది.01 అగస్టు 2023 నాటికి 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్‌లను బట్టి వయస్సులో సడలింపు ఉంటుంది. 

➠ NIACL AO Recruitment 2023 ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి 

➠  NIACL AO Recruitment 2023 ధరఖాస్తు ఫీజు :

  • రూ॥850/- (జనరల్‌ / ఓబిసి) 
  • రూ॥100/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు) 

➠ NIACL AO Recruitment 2023 ముఖ్యమైన తేదీలు :

  • ధరఖాస్తులు ప్రారంభ తేది. 01-08-2023
  • ధరఖాస్తులు చివరి తేది.21-08-2023

➠ NIACL AO Recruitment 2023 పరీక్షల తేదీలు :

  • ప్రిలిమ్స్‌ పరీక్ష తేది.09 సెప్టెంబర్‌ 2023
  • మెయిన్స్‌ పరీక్ష తేది.08, అక్టోబర్‌ 2023

➠ NIACL AO Recruitment 2023 పరీక్షా విధానం :

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ(ఏఓ) పరీక్ష ప్రిలిమ్స్‌, మేయిన్స్‌ రెండు విభాగాల్లో జరుగుతుంది.

1) ప్రిలిమ్స్‌ 

దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారిలో మొత్తం పోస్టులకు పదిహేనింతల మందిని మేయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

2) మెయిన్స్‌ 

మెయిన్స్‌లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్యూకు ఎంపిక చేయబడతారు. ఇంటర్యూలో విజయం సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌లోని ఆబ్జెక్టివ్‌, ఇంటర్యూల మార్కులను 75 : 25 నిష్పత్తిలో తీసుకొని తుది జాబితాలో ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్‌ టెస్టులు అర్హత పరీక్షలు కేవలం అర్హత పరీక్షలుగా మాత్రమే నిర్వహిస్తారు. 

➠ NIACL AO Recruitment 2023 వేతనం :

  • రూ॥50,925 మూలవేతనం ఉంటుంది (మెట్రోనగరాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.) 

➠ ఎగ్జామినేషన్‌ సెంటర్‌లు :

ప్రిలిమ్స్‌ - తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ 

మెయిన్స్‌ - తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్నాయి. 

➠ పరీక్షా సబ్జెక్టులు : 

ప్రిలిమ్స్‌ :

విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
న్యూమరికల్‌ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
రిజనీంగ్‌ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం 100 100 60 నిమిషాలు

మెయిన్స్‌ (జనరలిస్టు)

విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్‌ అవేర్‌నెస్ 50 50 30 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 50 40 నిమిషాలు
రిజనింగ్‌ 50 50 40 నిమిషాలు
క్వాంటిటేటీవ్‌ అప్టిట్యూడ్‌ 50 50 40 నిమిషాలు
మొత్తం 200 200 150 నిమిషాలు

మెయిన్స్‌ (స్పెషలిస్టు) :

విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్‌ అవేర్‌నెస్ 40 40 25 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 40 30 నిమిషాలు
రిజనింగ్‌ 40 40 30 నిమిషాలు
క్వాంటిటేటీవ్‌ అప్టిట్యూడ్‌ 40 40 30 నిమిషాలు
టెక్నికల్‌, ఫ్రొఫెషనల్‌ పరీక్ష‌ 40 40 35 నిమిషాలు
మొత్తం 200 200 150 నిమిషాలు

ఇంగ్లీష్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్ష(ఎస్సే, లెటర్‌ రైటింగ్‌) 02 30 30 నిమిషాలు

కెటగిరి‌ జాబ్స్
నిర్వహించు సంస్థ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ ‌
పోస్టు పేరు అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్స్‌ (ఏవో)
దేశం ఇండియా
మొత్తం ఉద్యోగాలు 450
ఎక్కడ దేశవ్యాప్తంగా
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్
పరీక్ష విధానం ఆన్‌లైన్‌
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్‌ మరియు మేయిన్స్‌ పరీక్ష
విద్యార్హత డిగ్రీ /పీజీ
వయోపరిమితి 21 నుండి 30 సంవత్సరాలు
ఫీజు 850/-, 100/-
ప్రారంభ తేది 01 అగస్టు 2023
చివరి తేది 21 అగస్టు 2023
ప్రిలిమ్స్‌ పరీక్ష 09 సెప్టెంబర్‌ 2023
మెయిన్స్‌ పరీక్ష 08, అక్టోబర్‌ 2023
పూర్తి సమాచారం కొరకు Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తుల కొరకు Click Here
1) NIACL AO -2023 వివరణాత్మక నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేయబడుతుంది ?

జవాబు : NIACL AO Notification -2023 వివరణాత్మక నోటిఫికేషన్‌ జూలై 2023 

2) NIACL AO Recruitment 2023 కోసం వయస్సు పరిమితి ఎంత కావాలి ?

జవాబు : NIACL AO Recruitment 2023 వయస్సు పరిమితి 21 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.

3) NIACL AO Recruitment 2023 లో ఎన్ని పోస్టుల కోసం ఎన్ని ఖాళీలు విడుదలయ్యాయి ?

జవాబు :NIACL AO Recruitment 2023 నోటిఫికేషన్‌తో 450 ఖాళీలు విడుదలయ్యాయి. ‌

4) NIACL AO Recruitment 2023 కోసం ధరఖాస్తు రుసుము ఎంత ?

జవాబు : NIACL AO Recruitment 2023 పరీక్ష ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/వికలాంగుల అభ్యర్థులకు రూ.100.

5) NIACL AO Recruitment 2023 పరీక్ష తేది ఏమిటి ?

జవాబు : NIACL AO Recruitment 2023 ప్రిలిమ్స్‌ పరీక్ష తేది.09 సెప్టెంబర్‌ 2023, మెయిన్స్‌ పరీక్ష తేది.08, అక్టోబర్‌ 2023

6) నేను డిగ్రీ / పీజీ చివరి సంవత్సరం చదువుతున్నాను. నేను NIACL AO పోస్టు కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చా ?

జవాబు :లేదు, డిగ్రీ /పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

7) NIACL AO Recruitment 2023 హాల్‌టికెట్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ?

జవాబు :పరీక్షా సమాయానికి వారం రోజుల ముందునుండి అధికారిక వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

Post a Comment

0 Comments