
రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్‌లు-2023
Degree Scholarships || Scholarships in Telugu
హీరో ఫిన్‌కార్ప్ ద్వారా ప్రవేశపెట్టబడిన రామన్‌కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - 2023 ద్వారా ఆర్హులైన విద్యార్థుల నుండి స్కాలర్‌షిప్‌లు అందించడం కోసం ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ హీరో ఫిన్‌కార్ప్ ద్వారా ప్రవేశపెట్టబడిన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయపడే ఉద్దేశ్యంతో స్కాలర్‌షిప్ అందించడం జరుగుతుంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా నిరుపేద విద్యార్థులు ప్రఖ్యాత కాలేజిలలో అడ్మిషన్లు పొంది వారి యొక్క ఉన్నతమైన జీవిత ఆశయాలను నెరవేర్చడానికి రూపొందించబడినది. ఈ రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ ద్వారా ప్రస్తుతం బిబిఏ, బిఎఫ్‌ఐఏ, బికామ్, బ్యాచ్‌లర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సర్వీస్, ఇంటిగ్రేటేడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్, బిఏ ఎకనామిక్స్, బ్యాచ్‌లర్ ఇన్ బిజినెస్ స్టడీస్, బ్యాచిలర్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బ్యాచిలర్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మరియు బిఎస్సీ (స్టాటిస్టిక్స్) వంటి కోర్సులలో మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులకు డిగ్రీ కోర్సులను పూర్తి చేయడానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని స్కాలర్‌షిప్ రూపంలో అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ పొందడం ద్వారా విద్యార్థులు అకడమిక్ ఇయర్‌కు కావాల్సిన వాటిని సమకూర్చుకొని ఎటువంటి ఆటంకం లేకుండా తమ ఆశయాలను సాధించవచ్చు. 10వ మరియు ఇంటర్మిడియట్‌లో 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కాలర్‌షిప్ కొరకు ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యేంతవరకు 40 వేల నుండి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం రూపంలో స్కాలర్‌షిప్ అందిస్తుంది. 4 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం కల్గిన అర్హులైన అభ్యర్థులు 15 సెప్టెంబర్ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.
Also Read : Gk Questions in Telugu
రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - 2023 అర్హత ప్రమాణాలు |
---|
- 10వ, 12వ తరగతిలో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఈ క్రింది కోర్సులలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొంది ఉండాలి.
- బిబిఏ
- బిఎఫ్‌ఐఏ
- బికామ్
- బ్యాచ్‌లర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
- ఇంటిగ్రేటేడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఐపిఎం)
- బిఏ (ఎకనామిక్స్)
- బ్యాచ్‌లర్ ఇన్ బిజినెస్ స్టడీస్(బిబిఎస్)
- బ్యాచిలర్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్(బిబిఐ)
- బ్యాచిలర్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ (బిఏఎఫ్)
- బిఎస్సీ (స్టాటిస్టిక్స్) మరియు ఇతర ఫైనాన్స్ కోర్సులు
- 31.05.2023 నాటికి గరిష్టంగా 19 సంవత్సరాలు ఉండాలి
- కుటుంబ వార్షికాదాయం 4 లక్షల లోపు ఉండాలి.
రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - 2023 కోసం కావాల్సిన ధృవీకరణ పత్రాలు |
---|
- 10వ, 12వ తరగతి మార్కుల మెమో
- అభ్యర్థి ఆధార్ కార్డు
- తల్లిదండ్రుల పాన్‌కార్డు మరియు ఆధార్‌కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రము
- తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా
- మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందినట్లు రుజువు
- కాలేజీ ఫీజు రశీదు / డిమాండ్ రశీదు
- అఫిడవిట్
- పాస్‌పోర్టు సైజు ఫోటో
నోట్ - పై వాటన్నింటిపై అభ్యర్థి సెల్ఫ్ అటెస్టెడ్ చేసిఉండాలి.
Also Read : Telugu Stories
రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - 2023 స్కాలర్‌షిప్ మొత్తం |
---|
- ఎంపికైన విద్యార్థులు 3 సంవత్సరాల డిగ్రీ పూర్తయ్యేంతవరకు 40,000 నుండి 5,00,000 రూపాయల వరకు అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు |
---|
- 15 సెప్టెంబర్ - 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.
కెటగిరి | స్కాలర్‌షిప్ |
పేరు | రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ -2023 |
సంస్థ | హీరోఫిన్‌కార్ఫ్ |
ఎవరి కోసం | డిగ్రి మొదటి సంవత్సరం విద్యార్థులు |
దేశం | ఇండియా |
స్కాలర్‌షిప్ మొత్తం | 40000 - 500000 |
Last Date | 15 September 2023 |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పూర్తి సమాచారం కోసం | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తు కొరకు | Click Here |
0 Comments