
తెలంగాణ హిస్టరి : తెలంగాణ దేవాలయాలు జికె ప్రశ్నలు - జవాబులు
Temples in Telangana gk questions and answers
Telangana history gk questions in telugu
1. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయానికి సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) ఈ గుడి యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉంది.
2) దీనిని ఆధ్యాత్మిక నగరి అని పిలుస్తున్నారు.
3) పోతన తన జీవిత చరిత్రలో ఈ ఆలయాన్ని దర్శించినట్లు పేర్కొన్నాడు.
4) దీని ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, మధుసూదన్
ఎ) 1, 2, 3 మరియు 4
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1, 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 4 మాత్రమే
జవాబు : డి) 1, 2 మరియు 4 మాత్రమే
2) జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయాన్ని ఈ క్రింది వారిలో ఎవరు నిర్మించారు ?
ఎ) కృష్ణారెడ్డి
బి) నరసింహరావు
సి) కృష్ణారావు దేశ్‌ముఖ్
డి) రాఘవరావు
జవాబు :సి) కృష్ణారావు దేశ్‌ముఖ్
3) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
1) ధర్మపురి లక్ష్మినరసింహస్వామి ఆలయం - జగిత్యాల
2) కొలనుపాక జైన దేవాలయం - భువనగిరి
3) వాడపల్లి శివాలయం - మహబూబ్‌నగర్
4) బుగ్గ రాజేశ్వరుడి ఆలయం - మంచిర్యాల
ఎ) 1, 3 మరియు 4 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1, 3 మరియు 4 మాత్రమే
డి) 3 మాత్రమే
జవాబు :డి) 3 మాత్రమే
ఈ దేవాలయం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉంది.
4) ఈ క్రింది వాటిలో త్రికుట ఆలయంగా పేరుగాంచింది ఏది ?
ఎ) యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయం
బి) ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం
సి) భద్రాచలం రామాలయం
డి) డిచ్‌పల్లి రామాలయం
జవాబు : బి) ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం
ఇది నల్గొండ జిల్లా పాముగల్లు ప్రాంతంలో ఉంది.
5) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) వేములవాడ శ్రీ రాజరాజేవ్వర దేవాలయమును దక్షిణ కాశీగా పిలుస్తారు
2) ఈ దేవాలయానికి భాస్కర క్షేత్రం, హరిహర క్షేత్రం అనే పేర్లు కూడా ఉన్నాయి.
3) ఈ దేవాలయాన్ని బద్దెగుడు అనే వ్యక్తి నిర్మించాడు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : ఎ) 1 మరియు 2
ఈ దేవాలయాన్ని వేములవాడ చాళుక్య రాజులు నిర్మించారు.
Temples in Telangana Gk questions in telugu :
6) దక్షిణ భారతదేశ ఖజరహో అని ఈ క్రింది వాటిలో ఏ దేవాలయాన్ని పిలుస్తారు ?
ఎ) యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయం
బి) ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం
సి) భద్రాచలం దేవాలయం
డి) డిచ్‌పల్లి దేవాలయం
జవాబు : డి) డిచ్‌పల్లి దేవాలయం
7) భద్రాచల దేవాలయంకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
ఎ) ఈ ఆలయమును దక్షిణ ఆయోద్యగా పిలుస్తారు.
బి) ఈ దేవాలయంను శ్రీ రామ భక్తుడు అయిన కంచర్ల గోపన్న నిర్మించాడు.
సి) ఈ దేవాలయం కుతుబ్‌షాహి పాలకుడైన ఇబ్రహీం కులీకుతుబ్‌షాకాలంలో నిర్మించబడిరది.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : ఎ) 1 మరియు 2
దీనిని అబుల్ తానీషా కాలంలో నిర్మించారు.
8) శాతవాహన రాజు అయిన రెండవ శాతకర్ణి నిర్మించిన దేవాలయం ఏది ?
ఎ) నవనాథ సిద్దేశ్వర ఆలయం
బి) అవంచ వినాయకుడు
సి) సోమశిల ఆలయం
డి) శ్రీ నీలకంఠేశ్వర ఆలయం
జవాబు : డి) శ్రీ నీలకంఠేశ్వర ఆలయం
ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది.
9) నవనాథ సిద్దేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది ?
ఎ) ఆదిలాబాద్
బి) నిజామాబాద్
సి) మేడ్చల్
డి) రంగారెడ్డి
జవాబు : బి) నిజామాబాద్
10) రెండవ కానిపాకంగా ప్రసిద్ది చెందిన దేవాలయం ఏది ?
1) నవనాథ సిద్దేశ్వర ఆలయం
2) అవంచ వినాయకుడు
3) సోమశిల ఆలయం
4) శ్రీ నీలకంఠేశ్వర ఆలయం
జవాబు : 2) అవంచ వినాయకుడు
11) ఈ క్రింది వాటిలో ఏ దేవాలయాన్ని ‘‘టెంపుల్ టౌన్ ఆఫ్ తెలంగాణ’’ గా పిలుస్తారు ?
ఎ) నవనాథ సిద్దేశ్వర ఆలయం
బి) ఆలంపూర్ నవబ్రహ్మ దేవాలయాలు
సి) సోమశిలాలయం
డి) శ్రీ నీలకంఠేశ్వర ఆలయం
జవాబు : బి) ఆలంపూర్ నవబ్రహ్మ దేవాలయాలు
12) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి :
ఎ) సోమశీల ఆలయం - నాగర్‌కర్కూల్ జిల్లా
బి) ఉమామహేశ్వర స్వామి దేవాలయం - నాగర్‌కర్నూల్ జిల్లా
సి) నంది కంది - కామారెడ్డి
డి) మెదక్ చర్చి - చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా
జవాబు : సి) నంది కంది - కామారెడ్డి
ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది. కళ్యాణి చాళుక్యులు నిర్మించారు.
Also Read :
13) తెలంగాణ శ్రీశైలం అని ఏ దేవాలయాన్ని పిలుస్తారు ?
ఎ) ఓదెల మల్లన్న స్వామి దేవాలయం
బి) కొల్లాపూర్ మాదవ స్వామి ఆలయం
సి) నవనాథ సిద్దేశ్వర స్వామి దేవాలయం
డి) కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం
జవాబు : ఎ) ఓదెల మల్లన్న స్వామి దేవాలయం
14) కొండలపైన, పర్వతాల పైన నిర్మించిన నిర్మాణాలను ఏమని పిలుస్తారు ?
ఎ) గిరి దుర్గాలు
సి) స్థల దుర్గాలు
డి) జల దుర్గాలు
జవాబు : ఎ) గిరి దుర్గాలు
15) ఓరుగల్లు కోటకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి :
ఎ) ఓరుగల్లు అనగా ఏకశిలా నగరం అని అర్థం
బి) రెండో ప్రోలరాజు ఓరుగల్లు కోట నిర్మాణము ప్రారంభించాడు
సి) రుద్రమదేవి కాలంలో ఈ కోట పూర్తి అయినది.
డి) కోట లోపల కుష్ మహల్ కట్టినది - రుద్రదేవుడు
జవాబు : డి) కోట లోపల కుష్ మహల్ కట్టినది - రుద్రదేవుడు
16) ఈ క్రింది ఏ ప్రాంతం ఒకప్పుడు తెలంగాణకు రాజధానిగా ఉండేది అని అంటారు ?
ఎ) ఎలగందుల కోట
బి) దోమకొండ
సి) రాచకొండ కోట
డి) గద్వాల్ కోట
జవాబు : ఎ) ఎలగందుల కోట
17) దోమకొండ కోట ఏ జిల్లాలో ఉంది ?
ఎ) నల్గొండ
బి) కామారెడ్డి
సి) నిజామాబాద్
డి) మెదక్
జవాబు : బి) కామారెడ్డి
18) పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్ల అరవ విక్రమాదిత్యచే నిర్మించిన కోట ఏది ?
ఎ) భువనగిరి కోట
బి) రాచకొండ కోట
సి) నిర్మల్ కోట
డి) గద్వాల్ కోట
జవాబు : ఎ) భువనగిరి కోట
19) ముస్లీం బహమనీ రాజ్యానికి హిందూ విజయనగర రాజ్యానికి మధ్య ప్రాంతంగా వారధిగా ఉండే ఈ క్రింది కోట ఏది ?
ఎ) భువనగిరి కోట
బి) రాచకొండ కోట
సి) నిర్మల్ కోట
డి) గద్వాల్ కోట
జవాబు : బి) రాచకొండ కోట
ఇది నల్గొండ జిల్లాలో ఉంది. దీనిని రేచర్ల సింగమరాయలు నిర్మించాడు.
Temples in Telangana Gk questions in telugu :
20) నిర్మల్ కోటను ఎవరు నిర్మించారు ?
ఎ) బ్రిటిష్ వారు
బి) ఫ్రెంచ్‌వారు
సి) నిమ్మనాయకుడు
డి) పెద సోమభూపాలుడు
జవాబు : బి) ఫ్రెంచ్‌వారు
21) భారతదేశంలో అతిపెద్ద ఫిరంగి ఈ క్రింది ఏ కోటలో కలదు ?
ఎ) భువనగిరి కోట
బి) రాచకొండ కోట
సి) నిర్మల్ కోట
డి) గద్వాల్ కోట
జవాబు : డి) గద్వాల్ కోట
22) గోల్కొండ కోటకు సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) దీనికి గల పూర్వపు నామం - మంకాల్
2) దీనిని మొదట కాకతీయులు నిర్మించగా కుతుబ్‌షాహీలు అభివృద్ది పరిచారు
3) ఈ కోట మొత్తం 87 బురుజులు 8 ప్రవేశద్వారాలు కల్గి ఉంది
4) మెగస్తనీస్ ప్రకారం ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం జరిగింది.
ఎ) 1, 2, 3 మరియు 4
బి) 1, 2 మరియు 3 మాత్రమే
సి) 2, 3 మరియు 4
డి) 1 మరియు 4 మాత్రమే
జవాబు : బి) 1, 2 మరియు 3 మాత్రమే
పెరిస్టా పకారం ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం జరిగింది.
23) మెదక్ కోటను ఎవరు నిర్మించారు ?
ఎ) గణపతి దేవుడు
బి) ప్రతాపరుద్రుడు
సి) రుద్రమదేవి
డి) రుద్రదేవుడు
జవాబు : బి) ప్రతాపరుద్రుడు
24) తెలంగాణలో అత్యంత పొడవైన కోట ఏది ?
ఎ) ప్రతాపరుద్ర కోట
బి) పానగల్ కోట
సి) రామగిరి కిల్లా
డి) గోల్కొండ
జవాబు : ఎ) ప్రతాపరుద్ర కోట
దీనియొక్క పొడవు 240 కి.మీ ఉంటుంది.
25) తెలంగాణలో అతిపెద్ద శత్రు దుర్భేద్యమైన కోటగా దేన్ని అభివర్ణిస్తారు ?
ఎ) ప్రతాపరుద్రకోట
బి) పానగల్ కోట
సి) రామగిరి ఖిల్లా
డి) గోల్కొండ
జవాబు : సి) రామగిరి ఖిల్లా
0 Comments