India Rivers GK Questions in telugu || GK Questions on Rivers of India in telugu

india Rivers GK Questions in telugu ||  GK Questions on Rivers of India in telugu

ఇండియా జియోగ్రఫీ : ఇండియా రివర్‌ సిస్టమ్‌ జికే క్వశ్చన్స్‌ ఇన్‌ తెలుగు

GK Questions And Answer On Indian Rivers in telugu

1) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) సరస్సులు, చెరువుల అధ్యయనమును లిమ్నాలజీ అంటారు
2) నదుల అధ్యాయమును పోటమాలజీ అంటారు
3) ప్రపంచ నీటి దినోత్సవం - సెప్టెంబర్‌ చివరి ఆదివారం
ఎ) 1, 2 మరియు 2
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే

జవాబు : బి) 1 మరియు 2 మాత్రమే

2) ఈ క్రింది ఏ పర్వతాలు నర్మదా, తపతి నదుల మద్య కలవు ?
ఎ) అంబాల ఉన్నతి
బి) ఆరావళి పర్వతాలు
సి) సాత్పూరా పర్వతాలు
డి) లడక్‌ పర్వతాలు

జవాబు : సి) సాత్పూరా పర్వతాలు

3) భారతదేశ విస్తీర్ణంలో గంగానది ఎంత శాతం వాటాను కల్గి ఉంది ?
ఎ) 26.2 శాతం
బి) 9.8 శాతం
సి) 9.5 శాతం
డి) 7.9 శాతం

జవాబు : ఎ) 26.2 శాతం

4) ఈ క్రింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నదులు ఏవి ?
1) సబర్మతి
2) మహానది
3) మహి
4) కావేరి
5) తపతి
ఎ) 1, 2, 3, 4 మరియు 5
బి) 1, 2 మరియు 3 మాత్రమే
సి) 1, 3 మరియు 5 మాత్రమే
డి) 2 మరియు 4 మాత్రమే

జవాబు : సి) 1, 3 మరియు 5 మాత్రమే

5) ఈ క్రింది వాటిలో హిమాలయ నది ఏది ?
ఎ) బ్రహ్మపుత్ర
బి) మహానది
సి) నర్మద
డి) తపతి

జవాబు : ఎ) బ్రహ్మపుత్ర

India Rivers GK Questions in telugu :

6) భారతదేశంలో అతిపెద్ద అంతర్‌ భూభాగ నది వ్యవస్థ ఏ రాష్ట్రంలో కలదు ?
ఎ) ఉత్తరాఖండ్‌
బి) బీహార్‌
సి) రాజస్థాన్‌
డి) చత్తీస్‌ఘడ్‌

జవాబు : సి) రాజస్థాన్‌

7) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) భారతదేశంలో ముఖ్యమైన ఎడారి జీవనది - సింధూ నది
2) సింధూ నది థార్‌ ఎడారి గుండా ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.
ఎ) 1 మరియు 2 రెండూ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 రెండూ కాదూ

జవాబు : ఎ) 1 మరియు 2 రెండూ

8) హైందవి నది ఈ క్రింది ఆట వాటిలో దేనికి పేరు ?
ఎ) బ్రహ్మపుత్ర
బి) సింధు నది
సి) గంగా నది
డి) గోదావరి

జవాబు : బి) సింధు నది

9) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) సింధు నది టిబెట్‌లోని కైలాష్‌ పర్వతాల తూర్పు భాగాన గల మానస సరోవర్‌లోని ‘‘బోఖర్చ్‌ ’’ హిమానీ నదం నుండి పుట్టింది.
2) సింధు నది పొడవు 2880 కిలోమీటర్లు
3) ఇది గుజరాత్‌లోని కచ్‌ వద్ద అరేబియా మహసముద్రంలో కలుస్తుంది
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే

జవాబు : బి) 1 మరియు 2 మాత్రమే

10) సింధూ నది ఏ పర్వత శ్రేణుల మద్య నుండి ప్రవహిస్తుంది ?
ఎ) లడక్‌, జస్కర్‌
బి) లడక్‌, రాకస్‌
సి) శేయక్‌, కారకోరం
డి) లడక్‌, నంగల్‌

జవాబు : ఎ) లడక్‌, జస్కర్‌

11) ఈ క్రింది వాటిలో సింధు నది యొక్క ఉపనది కానిది ఏది ?
ఎ) ద్రాస్‌
బి) సట్లేజ్‌
సి) గండక్‌
డి) షిగర్‌

జవాబు : సి) గండక్‌

12) సింధూ నది ఉపనదులకు సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) సింధు నదికి ఎడమ వైపు - జీలం, చినాబ్‌, రావి, సట్లెజ్‌
2) సింధు నదికి కుడి వైపున -  కాబూల్‌, షిగర్‌, కునార్‌, గోమల్‌
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 కాదు

జవాబు : ఎ) 1 మరియు 2

13) లైఫ్‌లైన్‌ ఆఫ్‌ కాశ్మిర్‌ అని ఈ క్రింది వాటిలో ఏ నదిని పిలుస్తారు ?
ఎ) జీలం
బి) చీనాబ్‌
సి) రావి
డి) బియాస్‌

జవాబు : ఎ) జీలం

14) ఈ క్రింది వాటిలో సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది ?
ఎ) జీలం
బి) చీనాబ్‌
సి) రావి
డి) సట్లేజ్‌

జవాబు : బి) చీనాబ్‌

India Rivers GK Questions in telugu :

15) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి :
ఎ) రావి - రోహతంగ్‌ కనుమ
బి) బియాస్‌ - శండుర్‌
సి) సట్లేజ్‌ - రాకాస్‌
డి) కాబూల్‌ - హిందూకుశ్‌ పర్వతాలు

జవాబు : బి) బియాస్‌ - శండుర్‌

16) భక్రానంగల్‌ ప్రాజేక్టు ఏ నదిపై కలదు ?
ఎ) బియాస్‌
బి) సట్లేజ్‌
సి) చీనాబ్‌
డి) మహానది

జవాబు : బి) సట్లేజ్‌

17) మృత్యు నది అని దేనిని పిలుస్తారు ?
ఎ) ష్యోక్‌ నది
బి) శిగర్‌ నది
సి) కాబూల్‌ నది
డి) గిల్‌గిట్‌ నది

జవాబు : ఎ) ష్యోక్‌ నది

18) గంగానదికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి :
1) ఈ నదిని బంగ్లాదేశ్‌లో పద్మ అని పిలుస్తారు
2) ఈ నదిని 2010 లో జాతీయ నదిగా గుర్తించారు
3) ఈ నది దేవప్రయాగ వద్ద అలకనందతో కలవడంతో గంగానదిగా పిలుస్తారు.
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

జవాబు : సి) 1 మరియు 3 మాత్రమే
2008 జాతీయ నదిగా గుర్తించారు. ఇది 2525 కి.మీ ఉంటుంది.

19) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి :
ఎ) విష్ణుప్రయాగ - దౌలి + అలక్‌నంద
బి) నంద ప్రయాగ - అలక్‌నంద + నందాకిని
సి) రుద్రప్రయాగ - మందాకిని + నందాకిని
డి) కర్ణప్రయాగ - పిండార్‌ + అలక్‌నంద

జవాబు : సి) రుద్రప్రయాగ - మందాకిని + నందాకిని

20) గంగానది ఎక్కడ మైదానంలోకి ప్రవేశిస్తుంది ?
ఎ) రుద్ర ప్రయాగ
బి) హరిద్వార్‌
సి) కేదరీనాథ్‌
డి) బద్రీనాథ్‌

జవాబు : బి) హరిద్వార్‌

Post a Comment

0 Comments