తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో వైద్యఆరోగ్య శాఖలో నోటిఫికేషన్
Telangana Medical Officers Jobs in telugu
156 Medical Officer Posts Notification Released
Telangana Medical Officers (Ayush) Jobs, Online Apply, Eligibility, Age, Last Date
Jobs in Telugu || Latest Jobs in Telugu || Telangana Jobs in Telugu
Telangana Medical Officers (Ayush) Jobs in telugu : ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న 156 మెడికల్ ఆఫిసర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుష్ విభాగంలోని ఆయుర్వేదం(Ayurveda)లో 54, హోమియో(Homeo)లో 33, యునాని(Unani)లో 69 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అగస్టు 7, 2023 నుండి అగస్టు 22, 2023 వరకు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో ఆయుర్వేదంలో మొత్తం 54 పోస్టులుండగా మల్టీ జోన్-1 లో 37, మల్టీ జోన్-2 లో 17 పోస్టులున్నాయి. హోమియో మెడికల్ ఆఫిసర్ పోస్టులు మొత్తం 33 ఉండగా మల్టీ జోన్-1 లో 23, మల్టీజోన్ -2లో 10 పోస్టులున్నాయి. యునానిలో మొత్తం 69 పోస్టులుండగా మల్టీజోన్-1 లో 36, మల్టీ జోన్-2 లో 33 ఉన్నాయి. జూలై 1, 2023 నాటికి 18 నుండి 44 సంవత్సరాలు నిండివారు ఈపోస్టుల కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికకైన అభ్యర్థులకు 54,220 నుండి 1,33,630 పేస్కేల్ ఉంటుంది.
పాయింట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది:
అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లను ఇస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ అభ్యర్థులకు గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాలలో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. ఇలా మొత్తం 100 పాయింట్ల ప్రాతిపాదికన తుది అభ్యర్థులను ఎంపికచేస్తారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకొనే సమయంలో ఆధార్‌కార్డు, పదోతరగతి సర్టిఫికేట్, డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, డిగ్రీ సర్టిఫికేట్, బోర్డు ఆఫ్ ఇండియన్ మెడిసిన్, తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అనుభవధృవీకరణ పత్రం(వర్తిస్తే), నివాసం ధృవీకరణ పత్రం కోసం స్టడీ సర్టిఫికేట్ (1 నుండి 7వ తరగతి వరకు), కుల ధృవీకరణ పత్రము, నాన్-క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 44 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 500 రూపాయలు చెల్లించి ధరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ? |
పోస్టు పేరు |
మల్టిజోన్-1 |
మల్టీజోన్-2 |
మొత్తం |
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) |
37 |
17 |
54 |
మెడికల్ ఆఫీసర్ (హోమియో) |
23 |
10 |
33 |
మెడికల్ ఆఫీసర్ (యూనాని) |
36 |
33 |
69 |
మొత్తం |
96 |
60 |
156 |
జీతభత్యాలు ఎలా ఉంటాయి. |
పోస్టు పేరు |
జీతం |
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) |
54,220 - 1,33,630 |
మెడికల్ ఆఫీసర్ (హోమియో) |
54,220 - 1,33,630 |
మెడికల్ ఆఫీసర్ (యూనాని) |
54,220 - 1,33,630 |
వయస్సు ఎంత ఉండాలి ? |
పోస్టు పేరు |
వయస్సు |
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) |
18 నుండి 44 సంవత్సరాల వరకు |
మెడికల్ ఆఫీసర్ (హోమియో) |
18 నుండి 44 సంవత్సరాల వరకు |
మెడికల్ ఆఫీసర్ (యూనాని) |
18 నుండి 44 సంవత్సరాల వరకు |
రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. |
ఈ పోస్టుకు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఏమిటి ? |
పోస్టు పేరు |
అర్హత |
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) |
ఆయుర్వేదలో డిగ్రీ |
మెడికల్ ఆఫీసర్ (హోమియో) |
హోమియోలో డిగ్రీ |
మెడికల్ ఆఫీసర్ (యూనాని) |
యూనానిలో డిగ్రీ |
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 500 రూపాయలు చెల్లించి ధరఖాస్తులు సమర్పించాలి ఉంటుంది.
ఆన్‌లైన్ ధరఖాస్తు సమయంలో ఏమేం సమర్పించాలి ? |
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- అభ్యర్థి సంతకం
- ఆధార్ కార్డు
- ఎస్‌ఎస్‌సి/10వ తరగతి సర్టిఫికేట్
-
సంబందిత డిగ్రీ మార్కుల మెమో
- బోర్డు ఆఫ్ ఇండియన్ మెడిసిన్, తెలంగాణ నుండి పొందిన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- అనుభవ (ఎక్స్‌ఫీరియన్స్) సర్టిఫికేట్ (ఉంటే)
- 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ (లోకల్ క్యాండిటేడ్ నిర్ధారణకొరకు)
- కుల ధృవీకరణ పత్రము
- నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (అర్హత ఉంటే)
-
స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ (అర్హత ఉంటే)
-
సదరన్ సర్టిఫికేట్ (వికలాంగులు అయితే)
- సర్వీస్ సర్టిఫికేట్ (అర్హలు అయితే)
ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? |
పాయింట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
Telangana Medical Officers (Ayush) Jobs in telugu : అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లను ఇస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ అభ్యర్థులకు గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాలలో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. ఇలా మొత్తం 100 పాయింట్ల ప్రాతిపాదికన తుది అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు |
ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభ తేది |
అగస్టు 7, 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తులు చివరి తేది |
అగస్టు 22, 2023 |
మల్టీజోన్ -1 |
కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, ములుగు |
అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల |
కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి |
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ(వరంగల్ అర్భన్), వరంగల్ |
మల్టీజోన్ -2 |
సూర్యాపేట, నల్గొండ, యాదాద్రిభువనగిరి, జనగాం |
మెడ్చల్‌మల్కాజ్‌గిరి, హైద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ |
మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబగద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్ |
రాష్ట్రం |
తెలంగాణ |
పోస్టు పేరు |
మెడికల్ ఆఫీసర్స్ (ఆయుర్వేద, హోమియో, యూనాని) |
డిపార్ట్‌మెంట్ |
వైద్య ఆరోగ్య శాఖ (ఆయూష్) |
మొత్తం పోస్టులు |
156 |
జీతం |
54,220 - 1,33,630 |
అర్హత |
డిగ్రీ |
వయస్సు |
18 - 44 సంవత్సరాలు |
ధరఖాస్తు విధానం |
ఆన్‌లైన్ |
ఎంపిక |
పాయింట్ల ఆధారంగా |
చివరి తేది |
22 అగస్టు 2023 |
ధరఖాస్తు ఫీజు |
500 |
అధికారిక వెబ్‌సైట్ |
Click Here |
నోటిఫికేషన్ |
Click Here |
ఆన్‌లైన్ అప్లై |
Click Here |
0 Comments