Tspsc Telangana History : Important Committees || తెలంగాణ ఉద్యమ కమిటీలు || Tspsc Telangana History in Telugu

Tspsc Telangana History : Important Committees || తెలంగాణ ఉద్యమ కమిటీలు || Tspsc Telangana History in Telugu

 తెలంగాణ ఉద్యమ కమిటీలు 

Tspsc Telangana History :  Important Committees in Telugu
Gk in Telugu || General Knowledge in Telugu
Tspsc Telangana History in Telugu


➠ అరవమందు అయ్యంగార్‌ కమిటీ :

Telangana History in Telugu : దీనిని రాజ్యాంగ సంస్కరణల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని నిజాం ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణల కొరకు సెప్టెంబర్‌ 22, 1937 న ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క పూర్తి నివేదికను బాబే హుకుమత్‌ అగస్టు 31 1938 న ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో ఉద్యోగాలలో స్థానికులకే అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక యంత్రంగ ఏర్పాటు చేయడం, భావ ప్రకటన, పత్రికా స్వాతంత్రాలు, స్వేచ్చగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం  వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 

➠ పండిట్‌ సుందర్‌లాల్‌ కమిటీ :

పండిట్‌ సుందర్‌ లాల్‌ అధ్యక్షతన, ఖాజీ అబ్దుల్‌ గఫార్‌, మౌలానా అబ్దుల్‌ మిస్త్రీ సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జే.ఎస్‌ చౌదరి అక్రమ పరిపాలన, మిలిటరీ దురాగతాలుకు వ్యతిరేకంగా ఈ కమిటీని రూపొందించడం జరిగింది. 1948 నవంబర్‌లో ఈ కమిటీ హైద్రాబాద్‌లో పర్యటించి సమాచారాన్ని సేకరించింది. 

➠ పింగళి జగన్మోహన్‌ కమిటీ :

ముల్కి ఉద్యమం సందర్భంగా సిటీ కాలేజ్‌లో జరిగిన హత్యోదంతంపై సెప్టెంబర్‌ 09, 1952 న ఈ కమిటీని నియమించారు. దీని నివేదికను డిసెంబర్‌ 28, 1952న సమర్పించారు. 

➠ ఎస్‌.కె. థార్‌ కమిటీ :

భాష ప్రాతిపాదికన రాష్ట్రాలు ఏర్పాటు ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కొరకు అధ్యయనం చేయడానికి ఎస్‌.కె థార్‌ ఆధ్వర్యంలో పన్నాలాల్‌, జగత్‌ నారాయణలాల్‌ సభ్యులుగా జూన్‌ 17, 1948న ఈ కమిటీ ఏర్పాటు చేసినారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా దీని నివేదికను డిసెంబర్‌ 13, 1948న సమర్పించినారు. 

➠ జె.వి.పి కమిటీ :

ఆంధ్రరాష్ట్రం ఏర్పాటను సాధ్యం కాదని తెలిపిన ఎస్‌.కె థార్‌ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తు మళ్లీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు డిసెంబర్‌ 18, 1948 న జె.వి.పి కమిటీని ఏర్పాటు చేసారు. దీని సభ్యులుగా 1) జవహర్‌లాల్‌ నెహ్రూ, 2) వల్లబాయి పటేల్‌, 3) పట్టాభి సీతారామయ్య లు ఉన్నారు. 
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నాళ్లపాటు వాయిదా వేయాలని సంఘం అభిప్రాయం పడినది. కానీ ఆంధ్రరాష్ట్ర విషయంలో మాత్రం సడలింపు ఇచ్చింది. కానీ మద్రాసు నగరాన్ని ఆంధ్రులు వదులుకుంటే అది సాధ్యమవుతుందని వంటి అంశాలతో దీని నివేదికను ఏప్రిల్‌ 5, 1949న సమర్పించారు. కానీ మద్రాసు నగరాన్ని వదులు కోవడానికి ఆంధ్రులు ఇష్టపడకపోవడం, ముఖ్యమంత్రి విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు ఆగిపోయింది. 

Tspsc Telangana History :

➠ కైలాస్‌నాథ్‌ వాంఛూ కమిటీ :

ఆంధ్రరాష్ట్రం విభజన సమస్యల పరిష్కారం గురించి జనవరి 1953 లో కైలాస్‌నాథ్‌ వాంఛూ కమిటీ ఏర్పాటు చేశారు. మద్రాసు ఉమ్మడి రాజధానిగా 4 సంవత్సరాలు ఉండాలనే నిబంధనలతో ఆంధ్రప్రాంతంలోని 7 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలనే తుది నిర్ణయంతో దీని నివేదికను ఫిబ్రవరి 7, 1953న సమర్పించారు. దీని నివేదిక ప్రకారం 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు చేయబడిరది. 

➠ సయ్యద్‌ ఫజల్‌ అలీ కమీషన్‌ :

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ  (స్టేట్‌ రీ-ఆర్గనైజేషన్‌ కమిటీ) కొరకు సయ్యద్‌ ఫజల్‌ అలీ నేతృత్వంలో హృదయానాత్‌ కుంజ్రు, కవలం మాధవ ఫణిక్కర్‌లు సభ్యులుగా డిసెంబర్‌ 29, 1953న సయ్యద్‌ ఫజల్‌ అలీ కమీషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికను సెప్టెంబర్‌ 30, 1955 కేంద్రానికి సమర్పించింది. 
నివేదికలోని ముఖ్యాంశాలు 
  • హైద్రాబాద్‌ విదర్భలతో పాటు మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
  • 5వ చాప్టర్‌లో హైద్రాబాద్‌ రాష్ట్రం గురించి, 6వ చాప్టర్‌లో ఆంధ్ర రాష్ట్రం వాదనల గురించి వివరించారు. 
  • ఫేరా 369 నుండి 389 వరకు హైదరాబాద్‌, ఆంధ్ర రాష్ట్ర వాదనలు పొందు పర్చారు.
  • ప్రస్తుతానికి హైద్రాబాద్‌ రాష్ట్రాన్ని కొనసాగించాలని 1961 లో హైద్రాబాద్‌ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ద్వారా 2/3 వంతు సభ్యులు ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. 
  • హైద్రాబాద్‌ను  విడదీసి ఆంధ్రలో కలపడాన్ని వ్యతిరేకించింది. 
  • మరాఠి భాస మాట్లాడే ప్రాంతాలను మహరాష్ట్రలో, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను కర్నాటకలో కలపాలని సూచించింది. 
  • తెలుగు మాట్లాడే బీదర్‌ ప్రాంతంతో సహ 10 జిల్లాలతో కూడిన హైద్రాబాద్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. 

➠ కుమార్‌ లలిత్‌ కమిటీ :

తెలంగాణలోని మిగులు నిధులు లెక్క తీయడానికి కుమార్‌ లలిత్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కుమార్‌ లలిత్‌ నేతృత్వంలో ఈ కమిటీని జనవరి 23, 1969న ఏర్పాటు చేశారు. దీని నివేదికను మార్చి 14, 1969న సమర్పించారు. 

➠ వశిష్ఠ భార్గవ కమిటీ :

8 సూత్రాల ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని మిగులు నిధులపై విశ్లేషణ జరపడానికి వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేశారు. వశిష్ఠ భార్గవ నేతృత్వంలో మకుట్‌ నిహరీ మధూర్‌, హరిభూషణ్‌ బార్‌ సభ్యులుగా ఏప్రిల్‌ 23, 1969న ఏర్పాటు చేశారు. దీని నివేదికను ఫిబ్రవరి 18, 1970న కేంద్రం ఆమోదించింది. 

Tspsc Telangana History :

➠ కైలాస్‌ నాథ్‌ వాంఛూ కమిటీ :

జీ.వో నెం.36 వివాదం నేపథ్యంలో ముల్కి నిబంధనలను విశ్లేషించడానికి కైలాస్‌ నాథ్‌ వాంఛూ కమిటీ ని ఏప్రిల్‌ 19, 1969న కె.ఎన్‌ వాంఛూ నేతృత్వంలో  ఎం.సి సెతాల్వాడ్‌, నిరేన్‌ డే ఆనాటి అటార్ని జనరల్‌ సభ్యులుగా ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 21, 1969 న సమర్పించిన నివేదికలో ముల్కి నిబంధనలు రాజ్యాంగ విరుద్దం అని పేర్కొంది. ముల్కి నిబంధనలు అమలు చేయాలంటే రాజ్యాంగంలో 16(3)ను సవరణ చేయాలని, అది సవరణ చేస్తే ప్రాథమిక హక్కులకు భంగం కల్గుతుందని కాబట్టి ముల్కి నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. 

➠ జయభారత్‌ రెడ్డి కమిటీ :

6 సూత్రాల పథకం రాష్ట్రపతి ఉత్తర్వుల విరుద్దంగా ఉద్యోగాల ఉల్లంఘనపై జయభారత్‌ రెడ్డి చైర్మన్‌ గా కమలనాథ్‌, ఉమాపతిలు సభ్యులుగా ఏర్పాటు చేశారు. 1984 లో తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు స్వామినాథన్‌ ఫిర్యాదు మేరకు నాన్‌ముల్కి ఉద్యోగుల లెక్కలు తీయడానికి ఎన్‌.టి.ఆర్‌ ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్దంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ఉద్యోగాలు పొందారని నివేదిక సమర్పించింది. 

➠ గిరిగ్లాని కమిటీ :

610 జీవో ఉత్తర్వులలో జరిగిన అక్రమాలపై అధ్యయం చేయడానికి గిరిగ్లాని కమిటీ ఏర్పాటు చేశారు. ఇది ఏకసభ్య కమిటీ. దీనిని 25, జూన్‌ 2001న ఏర్పాటు చేశారు. 

➠ తార్కుండే కమిటీ :

బూటకపు ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించడానికి జలగం వెంగళ్‌రావు కాలంలో 1977లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 

➠ హైమన్‌డార్ప్‌ కమిటీ :

కొమురం భీం మరణించిన తర్వాత గోండులు ఎదుర్కొన్న సమస్యలపై అధ్యయనం చేయడానికి హైమన్‌డార్ప్‌ కమిటీని నియమించారు. ఈ కమిటీ తీర్పును అనుసరించి 1949 లో ఆదివాసి ప్రాంతాల క్రమబద్దీకరణ, నోటిఫైడ్‌ ట్రైబల్‌ ఏరియా రూల్స్‌ ఏర్పాటు చేసినారు. 

➠ హితన్‌ భయ్యా కమిటీ :

విద్యుత్‌చ్చక్తి రంగానికి సంబందించి మార్పులు సూచించడానికి నియమించబడిన కమిటీ హీతన్‌ భయ్యా కమిటి. 

Tspsc Telangana History :

➠ ప్రణబ్‌ముఖర్జి కమిటీ :

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వివిధ పార్టీల అభిప్రాయాలు, సంప్రదింపుల కొరకు ప్రణబ్‌ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ప్రణబ్‌ముఖర్జి అధ్యక్షునిగా ఉన్నాడు. దీనిలో దయానిధిమారన్‌, రఘువంశ్‌ ప్రసాద్‌సింగ్‌ సభ్యులుగా ఉన్నారు.

➠ రోషయ్య కమిటీ :

తెలంగాణపై అధ్యయం చేయడానికి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 2009 లో రోషయ్య అధ్యక్షునిగా ఈ కమిటిని నియమించింది. 
➠ శ్రీకృష్ణ కమిటీ :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పరిస్థితిపై సంప్రదింపులు చేయడానికి 3 ఫిబ్రవరి 2010న జస్టిస్‌ శ్రీ కృష్ణ అధ్యక్షతన వినోద్‌ కుమార్‌ దుగ్గల్‌, రవీందర్‌ కౌర్‌, రణబీర్‌ సింగ్‌, అబూసలే సభ్యులుగా శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. 

Post a Comment

0 Comments