
ఇండియా పరిశ్రమలు జికే క్వశ్చన్స్ : జికె ప్రశ్నలు - జవాబులు
Gk Questions in Telugu : India Industries
Gk in Telugu : India Industries Questions and Answers
1. కింది వాటిలో జేమ్స్ వాట్ కు సంబంధించిన వాక్యాల్లో సరైంది గుర్తించండి ?
1) ఆవిరి యంత్రం కనుకున్న తర్వాత బొగ్గు వాడకం పెరిగింది.
2) రైల్వే నౌకా రవాణాలు అభివృద్ది చెందాయి.
3) పారిశ్రామిక విప్లవం ఏర్పడిరది.
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 3 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3 మాత్రమే
జవాబు : డి) 1, 2 మరియు 3 మాత్రమే
2) పరిశ్రమల రంగ పరిమాణంలో అసమానతలో సరికానిది ?
ఎ) పరిమాణం బట్టి పరిశ్రమలు మూడు రకాలు
బి) పారిశ్రామిక వ్యవస్థను ఒక పిరమిడ్‌తో పోల్చారు
సి) పిరమిడ్ శిఖరాన చిన్న పరిశ్రమలను చూపించారు.
డి) అడుగున భారీ పరిశ్రమలను చూపించారు.
జవాబు : డి) అడుగున భారీ పరిశ్రమలను చూపించారు.
3) పారిశ్రామిక ప్రారంభంలో తయారీ రంగంలో ఉత్పాదక పరిశ్రమల కంటే ఏవి అధికంగా ఉండేవి ?
ఎ) మౌలిక పరిశ్రమలు
బి) వినియోగ వస్తు పరిశ్రమలు
సి) మాధ్యమిక వస్తు పరిశ్రమలు
డి) పైవన్నీ
జవాబు : బి) వినియోగ వస్తు పరిశ్రమలు
4) మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పరిశ్రమలు ?
1) సింద్రి ఎరువు కర్మాగారం
2) పెన్సిలిన్ ఫ్యాక్టరీ
3) హిందూస్థాన్ షిప్‌యార్డు
4) చిత్తరంజన్ రైలు ఇంజిన్ల కర్మాగారం
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1, 2 మరియు 3 మాత్రమే
సి) 2 మరియు 4 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4 మాత్రమే
జవాబు : డి) 1, 2, 3 మరియు 4 మాత్రమే
Gk Questions in Telugu :
5) ఎవరి నమూనా పారిశ్రామిక అభివృద్దికి బలమైన పునాది ?
1) హరాడో నమూనా
2) మహాల్‌నోబిస్ నమూనా
3) డి.ఆర్ గాడ్గిల్ నమూనా
4) డి.పి ధర్
జవాబు : 2) మహాల్‌నోబిస్ నమూనా
6) కింది వాటిని జతపరచండి ?
1) రూర్కెలా కర్మాగారం
2) బిలాయ్ కర్మాగారం
3) దుర్గాపూర్ కర్మాగారం
4) ఎరువుల కర్మాగారం
ఎ) సంగాల్
బి) ఒడిశా
సి) ఛత్తిస్‌ఘడ్
డి) పశ్చిమబెంగాల్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
జవాబు : బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
7) ఏ ప్రణాళిక కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి అయిదు రెట్లు పెరిగింది ?
ఎ) 7వ
బి) 6వ
సి) 8వ
డి) 10వ
జవాబు : బి) 6వ
8) 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడానికి తీసుకున్న చర్యలు ఏమిటి ?
ఎ) నాణ్యమైన అవస్థాపన సౌకర్యాల కల్పన
బి) వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ది
సి) ఖాయిలా పడిన పరిశ్రమల అభివృద్ది
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
9) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ప్రస్తుత ఆధార సంవత్సరం ఏది ?
ఎ) 1993-94
బి) 2004-05
సి) 2011-12
డి) 2017-18
జవాబు : సి) 2011-12
Gk Questions in Telugu :
10) 2023 ఏప్రిల్ లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ విలువ ఎంత ?
1) 118.1
2) 140.2
3) 150.2
4) 129
జవాబు : 2) 140.2
Also Read :
11) ప్రస్తుతం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో లెక్కించే పరిశ్రమలు ?
ఎ) సంఘటిత పరిశ్రమలు
బి) అసంఘటిత పరిశ్రమలు
సి) సంఘటిత, అసంఘటిత పరిశ్రమలు
డి) సంఘటిత, కుటీర పరిశ్రమలు
జవాబు : ఎ) సంఘటిత పరిశ్రమలు
12) ఈ క్రింది వాటిలో కోర్ పరిశ్రమలో లేని పరిశ్రమ ఏది ?
ఎ) సహజ వాయువు
బి) సిమెంట్ పరిశ్రమ
సి) కాగితం పరిశ్రమ
డి) ఉక్కు పరిశ్రమ
జవాబు : సి) కాగితం పరిశ్రమ
13) 1948 పారిశ్రామిక తీర్మాణంలో ఏ రంగంలోని పరిశ్రమలను పదేళ్ల తర్వాత ప్రభుత్వం జాతీయం చేస్తుంది ?
ఎ) ప్రభుత్వ గుత్తాధిపత్య పరిశ్రమలు
బి) మిశ్రమ రంగ పరిశ్రమలు
సి) ప్రభుత్వ అజమాయిషీ పరిశ్రమలు
డి) పైవన్నీ
జవాబు : బి) మిశ్రమ రంగ పరిశ్రమలు
14) భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ది బ్యాంకును సిఫార్సు చేసింది ఎవరు ?
ఎ) అజిత్ సింగ్
బి) రాధామోహన్ సింగ్
సి) నరేంద్ర సింగ్
డి) మన్మోహన్‌సింగ్
జవాబు : ఎ) అజిత్ సింగ్
15) 1991 నూతన పారిశ్రామిక తీర్మాణం రూపకల్పన చేసింది ఎవరు ?
ఎ) పి.వి నరసింహారావు - వాజ్‌పెయీ
బి) వాజ్‌పేయీ - మన్హోహన్ సింగ్
సి) పి.వి నరసింహరావు - మన్మోహన్‌సింగ్
డి) పి.వి నరసింహరావు - ప్రణబ్‌ముఖర్జీ
జవాబు : సి) పి.వి నరసింహరావు - మన్మోహన్‌సింగ్
16) ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఈ క్రింది ఏ రంగాల్లో వందశాతం అనుమతిస్తున్నారు ?
ఎ) తేయాకు తోటలు
బి) సెజ్‌లు
సి) కొరియర్ సేవలు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
17) మేకిన్ ఇండియా ఏ రోజున ప్రారంభించారు ?
ఎ) 2014 సెప్టెంబర్ 15
బి) 2014 సెప్టెంబర్ 25
సి) 2015 సెప్టెంబర్ 25
డి) 2016 సెప్టెంబర్ 25
జవాబు : బి) 2014 సెప్టెంబర్ 25
18) పారిశ్రామిక ఎకనామిక్స్ సెన్సెస్ ప్రకారం అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం ఏది ?
ఎ) మహారాష్ట్ర
బి) మణిపూర్
సి) తమిళనాడు
డి) ఆంధ్రప్రదేశ్
జవాబు : ఎ) మహారాష్ట్ర
19) నవరత్న హోదా పొందిన పరిశ్రమలకు ఉన్న అర్హతలు ఏవి ?
ఎ) రూ.1000 కోట్ల లాభాలు ఉండాలి
బి) మూలధన వ్యయం చేయడంలో జాయింట్ వెంచర్‌కి స్వేచ్ఛ ఉండాలి
సి) దేశీయ విదేశీ మార్కెట్‌లో మూలధనం సమకూర్చుకోవచ్చు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
20) ప్రైవేటు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ప్రథమ స్థానంలో ఉన్న కంపెనీ ఏది ?
ఎ) రిలయన్స్ కంపనీ
బి) టీసిఎస్ కంపనీ
సి) టాటా మోటార్స్ కంపనీ
డి) లార్సన్ అండ్ టర్భో కంపనీ
జవాబు : ఎ) రిలయన్స్ కంపనీ
0 Comments