.webp)
ప్రాథమిక హక్కులు జికే క్వశ్చన్స్ : జికె ప్రశ్నలు - జవాబులు
Fundamental Rights of Indian Constitution in Telugu
1. సుప్రీం కోర్టు ఏ కేసులో హక్కులను పరిత్యజించు సిద్దాంతం (డాక్టరైన్ ఆఫ్ వీవర్) గురించి పేర్కొనడం జరిగింది ?
1) బేహారం vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు
2) ప్రకాష్ కదం vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కేసు
3) రఘునందన్ నాయక్ vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు
4) రణబీర్ సింగ్ vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
జవాబు : 1) బేహారం vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు
2) రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఏ పౌరుడు కూడా వదులుకునే వీల్లేదని, వాటిని అమలు చేయాల్సిన బాద్యతల నుండి ప్రభుత్వం తప్పించుకునే అవకాశం లేదని పేర్కొనడాన్ని ఏమంటారు ?
1) డాక్టర్ ఆఫ్ లూజర్
2) డాక్టరైన్ ఆఫ్ అవైడ్
3) డాక్టరైన్ ఆఫ్ వీవర్
4) డాక్టరైన్ ఆఫ్ లాప్సెస్
జవాబు : 3) డాక్టరైన్ ఆఫ్ వీవర్
3) ప్రాథమిక హక్కులకు సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
ఎ) 1950, జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన ప్రారంభ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను 7 రకాలుగా వర్గీకరించారు.
బి) 1978 ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తిహక్కును తొలగించారు.
సి) ప్రస్తుతం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల సంఖ్య 6
డి) రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని మహాత్మగాంధీ పేర్కొన్నారు.
1) ఎ, బి మరియు సి మాత్రమే
2) ఎ, బి మరియు డి మాత్రమే
3) ఎ, సి మరియు డి మాత్రమే
4) ఎ, బి, సి మరియు డి మాత్రమే
జవాబు : 1) ఎ, బి మరియు సి మాత్రమే
4) సమానత్వపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు ?
1) ఆర్టికల్ 13 నుండి 18
2) ఆర్టికల్ 14 నుండి 18
3) ఆర్టికల్ 15 నుండి 19
4) ఆర్టికల్ 15 నుండి 18
జవాబు : 2) ఆర్టికల్ 14 నుండి 18
5) సమానత్వపు హక్కుకు సంబంధించి కింది వాటిలో సరైంది ?
ఎ) బ్రిటన్‌లో అమల్లో ఉన్న ‘‘ది రూల్ ఆఫ్ లా’’ ఆధారంగా భారత రాజ్యంగంలో సమానత్వపు హక్కును పొందుపరిచారు.
బి) ఆర్టికల్ 14(ఎ) - చట్టం దృష్టిలో సమానత్వం గురించి వివరిస్తుంది.
సి) ఆర్టికల్ 14(బి) - చట్టం మూలంగా సమాన రక్షణ గురించి వివరిస్తుంది.
డి) ఆర్టికల్ 14(సి) - చట్టపరమైన వివక్షల గురించి వివరిస్తుంది.
1) ఎ, బి మరియు సి మాత్రమే
2) ఎ, సి మరియు డి మాత్రమే
3) ఎ, బి, సి మరియు డి మాత్రమే
4) ఎ, బి మరియు డి మాత్రమే
జవాబు : 1) ఎ, బి మరియు సి మాత్రమే
6) కింద పేర్కొన్న అంశాల్లో సరైన దానిని గుర్తించండి :
ఎ) మన దేశంలో ఒకేరకమైన నేరం చేసినప్పుడు ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు అందరికి ఒకేరకమైన శిక్ష ఉంటుంది.
బి) రాష్ట్రపతి, గవర్నర్‌లు తమ విధుల నిర్వహణలో ప్రత్యేక రక్షణలు, మినహయింపులు కల్గి ఉంటారు.
సి) సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు తమ విధుల నిర్వహణలో ప్రత్యేక రక్షణలు, మినహయింపులు కల్గి ఉంటారు.
డి) మన దేశంలోని విదేశీ రాయబారులు తమ విధుల నిర్వహణలో ప్రత్యేక రక్షణలు మినహయింపులు కల్గి ఉంటారు.
1) ఎ, సి మరియు డి మాత్రమే
2) ఎ, బి మరియు సి మాత్రమే
3) ఎ, బి, సి మరియు డి మాత్రమే
4) ఎ, బి మరియు డి మాత్రమే
జవాబు : 3) ఎ, బి, సి మరియు డి మాత్రమే
7) ఈ క్రింది వాటిలో సరైనదానిని గుర్తించండి ?
ఎ) చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావనను అమెరికా నుండి గ్రహించారు.
బి) ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్‌లు ప్రత్యేక రక్షణను కల్గి ఉంటారు.
సి) మన దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఆస్తి పన్ను నుండి మినహాయించారు.
డి) చట్టం దృష్టిలో సమానత్వం అనే భావనను బ్రిటన్ నుండి గ్రహించారు.
1) ఎ, బి, సి మరియు డి మాత్రమే
2) ఎ, బి మరియు సి మాత్రమే
3) ఎ, బి మరియు డి మాత్రమే
4) ఎ, సి మరియు డి మాత్రమే
జవాబు : 1) ఎ, బి, సి మరియు డి మాత్రమే
8) సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు జరుగుతుందని, సమాన పరిస్థితుల్లో మాత్రమే సమానత్వాన్ని వర్తింపజేయవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ?
1) రాంజువాయ్ సింగ్ vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
2) చంపకం దొరైరాజన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు
3) చిరంజిత్ లాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) రాజ్ నారాయణ్ సింగ్ vs ఇందిరా గాంధీ కేసు
జవాబు : 3) చిరంజిత్ లాల్ ` యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
9) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) ఆర్టికల్ 14(ఎ) ప్రకారం మన దేశంలో కుల, మత, జాతి, లింగ జన్మ సంబంధమైన వివక్షతో సంబంధం లేకుండా చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానులే.
2) ఆర్టికల్ 14(బి) ప్రకారం సమాన పరిస్థితుల్లో సమాన రక్షణ లభిస్తుంది.
3) 1 మరియు 2 మాత్రమే
4) ఆర్టికల్ 14(సి) ప్రకారం చట్టపరమైన వివక్ష సమంజసమే.
జవాబు : 3) 1 మరియు 2 మాత్రమే
Fundamental Rights Gk Question in Telugu :
10) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మన దేశంలో కుల, మత, జాతి, లింగ, జన్మ సంబంధమైన వివక్షలను నిషేదించారు ?
1) ఆర్టికల్ 15
2) ఆర్టికల్ 16
3) ఆర్టికల్ 17
4) ఆర్టికల్ 18
జవాబు : 1) ఆర్టికల్ 15
11) కుల, మత, జాతి, లింగ, జన్మ సంబంధమైన అంశాల ప్రాతిపాదికపైన ప్రభుత్వం ఎవరిని వివక్షకు గురిచేయరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది ?
1) ఆర్టికల్ 12(1)
2) ఆర్టికల్ 13(1)
3) ఆర్టికల్ 14(1)
4) ఆర్టికల్ 15(1)
జవాబు : 4) ఆర్టికల్ 15(1)
12) కుల, మత, జాతి, లింగ, జన్మ సంబంధమైన కారణాలతో బహిరంగ, పబ్లిక్ ప్రదేశాల్లో వ్యక్తుల ప్రవేశాన్ని నిరాకరించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది ?
1) ఆర్టికల్ 15(2)
2) ఆర్టికల్ 15(3)
3) ఆర్టికల్ 15(4)
4) ఆర్టికల్ 15(5)
జవాబు : 1) ఆర్టికల్ 15(2)
Also Read :
13) మహిళలు, బాలికలకు కల్పించే ప్రత్యేక రక్షణలను వివక్షగా పరిగణించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది ?
1) ఆర్టికల్ 15(1)
2) ఆర్టికల్ 15(2)
3) ఆర్టికల్ 15(3)
4) ఆర్టికల్ 15(4)
జవాబు :3) ఆర్టికల్ 15(3)
14) షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి విద్యాసంస్థల్లో కల్పించే ప్రత్యేక రిజర్వేషన్‌లను వివక్షగా భావించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది ?
1) ఆర్టికల్ 15(4)
2) ఆర్టికల్ 15(5)
3) ఆర్టికల్ 15(6)
4) ఆర్టికల్ 15(7)
జవాబు : 1) ఆర్టికల్ 15(4)
15) సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు రాజ్యాంగానికి ఆర్టికల్ 15(4) ను చేర్చారు ?
1) శంకరీ ప్రసాద్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) ఆనంద మోహన్ vs స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్
3) చంపకం దొరైరాజన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్
4) బాబూలాల్ పరాటే vs స్టేట్ ఆఫ్ బాంబే
జవాబు : 3) చంపకం దొరైరాజన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్
16) రాజ్యాంగానికి ఆర్టికల్ 15(4) ను ఏ ప్రధాని కాలంలో, ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ?
1) జవహర్‌లాల్ నెహ్రూ, 1వ రాజ్యాంగ సవరణ చట్టం
2) జవహర్‌లాల్ నెహ్రూ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం
3) ఇందిరాగాంధీ, 24వ రాజ్యాంగ సవరణ చట్టం
4) మొరార్జి దేశాయి, 44వ రాజ్యాంగ సవరణ చట్టం
జవాబు : 1) జవహర్‌లాల్ నెహ్రూ, 1వ రాజ్యాంగ సవరణ చట్టం
17) విద్యా సంస్థల్లో ఓబీసి వర్గాల వారికి ప్రత్యే రిజర్వేషన్‌లను ఏ ప్రధాని కాలంలో, ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించారు ?
1) పివి నరసింహారావు 76వ రాజ్యాంగ సవరణ చట్టం
2) అటల్ బిహారి వాజ్‌పేయీ 86వ రాజ్యాంగ సవరణ చట్టం
3) మన్మోహన్ సింగ్, 93వ రాజ్యాంగ సవరణ చట్టం
4) నరేంద్రమోదీ, 101వ రాజ్యాంగ సవరణ చట్టం
జవాబు : 3) మన్మోహన్ సింగ్, 93వ రాజ్యాంగ సవరణ చట్టం
18) విద్యాసంస్థల్లో ఓబిసి వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్‌లను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది ?
1) ఆర్టికల్ 15(4)
2) ఆర్టికల్ 15(5)
3) ఆర్టికల్ 15(6)
4) ఆర్టికల్ 15(7)
జవాబు : 2) ఆర్టికల్ 15(5)
19) ఓబీసీ వర్గాల వారికి విద్యా సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్‌లు రాజ్యాంగ బద్దమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ?
1) అశోక్ కుమార్ ఠాగూర్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) నందినీ శతపతి vs స్టేట్ ఆఫ్ ఓడిశా కేసు
3) అనూప్ మిశ్రా vs స్టేట్ ఆఫ్ ఇండియా కేసు
4) చంపకం దొరైరాజన్ vs యూనియన్ ఆఫ్ మద్రాస్ కేసు
జవాబు : 1) అశోక్ కుమార్ ఠాగూర్ ` యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
Fundamental Rights Gk Question in Telugu :
20) భారత పార్లమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు - నివాస అర్హతల చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది ?
1) 1955
2) 1956
3) 1957
4) 1959
జవాబు : 3) 1957
21) ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కింది వాటిలో సరైంది ?
ఎ) ఆర్టికల్ 16(1) - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పౌరుందరికి సమాన అవకాశాలు కల్పించాలి
బి) ఆర్టికల్ 16(2) - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 7 రకాల వివక్షలు నిషేదం
సి) ఆర్టికల్ 16(3) - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని రూపొందించగలరు.
డి) ఆర్టికల్ 16(4) - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించవచ్చు.
1) ఎ, బి మరియు డి మాత్రమే
2) ఎ, బి మరియు సి మాత్రమే
3) ఎ, సి మరియు డి మాత్రమే
4) ఎ, బి, సి మరియు డి మాత్రమే
జవాబు : 4) ఎ, బి, సి మరియు డి మాత్రమే
22) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణ ప్రాంత నివాసితులకు మాత్రమే తెలంగాణలోని ఉద్యోగాలను రిజర్వ్ చేస్తూ రూపొందించిన నిబంధనలు ఏవి ?
1) అవాస్ భద్రతా నిబంధనలు
2) ముల్కీ నిబంధనలు
3) గిర్‌గ్లానీ నిబంధనలు
4) వికాస ప్రగతి నిబంధనలు
జవాబు : 2) ముల్కీ నిబంధనలు
23) 32వ రాజ్యాగం సవరణ చట్టం ద్వారా ఏ ప్రధాని కాలంలో తెలంగాణ ప్రాంతం వారికి ప్రత్యేక రక్షణలు కల్పించే ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ భద్రత కల్పించారు ?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) ఇందిరాగాంధీ
3) రాజీవ్ గాంధీ
4) పి.వి నరసింహరావు
జవాబు :2) ఇందిరాగాంధీ
24) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముల్కీ నిబంధనలు చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రకటించింది ?
1) రవీంద్ర నాయక్ vs యూనియన్ ఆఫ్ ఇండియాకేసు
2) పి.డి.టి ఆచారి vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు
3) ఎ.వి.ఎస్ నరసింహరావు ` స్టేట్ ఆప్ ఆంధ్రప్రదేశ్ కేసు
4) పి.వి నరసింహరావు vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కేసు
జవాబు : 3) ఎ.వి.ఎస్ నరసింహరావు vs స్టేట్ ఆప్ ఆంధ్రప్రదేశ్ కేసు
25) ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలను నిర్ధేశిస్తున్న ఆర్టికల్ 371(డి) కి సంబంధించిన చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ?
1) 1974 జూలై 1
2) 1973 జూలై 1
3) 1972 జూలై 1
4) 1974 ఆగస్టు 4
జవాబు : 1) 1974 జూలై 1
26) ఏ కమీషన్ సిపార్సుల మేరకు వి.పి సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27 శాతం రిజర్వేషన్‌లు కల్పించింది ?
1) ఎం.ఆర్ మీనన్ కమీషన్
2) రంగరాజన్ కమీషన్
3) బి.పి మాండల్ కమీషన్
4) రంగనాథ్ మిశ్రా కమీషన్
జవాబు : 3) బి.పి మాండల్ కమీషన్
27) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కల్పించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది ?
1) ఆర్టికల్ 15(4)
2) ఆర్టికల్ 16(4ఎ)
3) ఆర్టికల్ 16(4బి)
4) ఆర్టికల్ 17(4)
జవాబు : 2) ఆర్టికల్ 16(4ఎ)
0 Comments