ఇండియా జియోగ్రఫీ జికే క్వశ్చన్స్
Gk Questions in telugu (India Geography) Part - 4

1. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది ?
ఎ) హిమాచల్ ప్రదేశ్
బి) గోవా
సి) ఉత్తరాఘండ్
డి) జమ్మూ అండ్ కాశ్మీర్
జవాబు : బి) గోవా
2) అండమాన్ మరియు నికోబార్ తీరరేఖ పొడవు ఎన్ని కి.మీ ఉంటుంది ?
ఎ) 7218 కి.మీ
బి) 6518 కి.మీ
సి) 7517 కి.మీ
డి) 5517 కి.మీ
జవాబు : సి) 7517 కి.మీ
3) కింద తెలిపిన వాటిలో చమురు ఉత్పత్తి క్షేత్రం కానిది ఏది గుర్తించండి ?
ఎ) బాంబే హై
బి) జామ్‌నగర్
సి) అంకాలేశ్వర్
డి) దిగ్భోయ్
జవాబు :బి) జామ్‌నగర్
4) భారతదేశంలో PPPతో నిర్మించబడిన మొట్టమొదటి కోచ్ ఫ్యాక్టరీ ఏది ?
ఎ) పాలక్కాడ్
బి) పాటియాలా
సి) గ్వాలియర్
డి) సికింద్రాబాద్
జవాబు : ఎ) పాలక్కాడ్
5) ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ?
1) సముద్రం మాంద్యం వల్ల రాన్ ఆఫ్ కచ్ ఏర్పడినది
2) రాజస్థాన్‌లోని చిన్న ప్రవాహాల ద్వారా ఏర్పడిన సారవంతమైన వరద మైదానాలు - రోహి
3) ఆరావల్లికి తూర్పున ఉన్న భూమిని బగర్ అని పిలుస్తారు.
4) కుచమన్ సంభార్ మరియు దిద్వానా ఉప్పునీటి సరస్సులు
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1, 2 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2 మరియు 3
6) కొల్లేరు మరియు చిల్కా సరస్సుల మద్య ఉన్న తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు ?
ఎ) ఆంధ్ర మైదానం
బి) కొంకణ్ మైదానం
సి) ఉత్కల్ మైదానం
డి) పైవేవీ కావు
జవాబు : సి) ఉత్కల్ మైదానం
7) భారతదేశంలో ద్వీపకల్ప ఫీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది ?
ఎ) అగస్త్యమాల
బి) ముల్లయనగిరి
సి) ఆనముడి
డి) దొడ్డబెట్ట
జవాబు : సి) ఆనముడి
8) తెలంగాణ రాష్ట్రంలోని ఫీఠభూమికి సంబందించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ?
1) ఇది పెనెప్లైన్‌కి ఉదాహరణ
2) ఇది ప్రధానంగా ఆర్కియన్ గ్నీస్‌లతో కూడి ఉంటుంది.
3) ఈ పీఠభూమి యొక్క సగటు ఎత్తు దాదాపు 500 మీటర్లు ఉంటుంది.
పైవాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
ఎ) 1 మరియు 2
బి) 1 మరియు 3
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
9) ఈ క్రింది భారతీయ నదులలో ఏది మహరాష్ట్రలో ఉద్భవించి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్రా తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ?
ఎ) కావేరి
బి) కృష్ణా
సి) మహనది
డి) నర్మద
జవాబు : బి) కృష్ణా
ఈ క్రింది వాటిలో సింధు నదికి కుడి ఒడ్డున ఉన్న ఉపనదులు గుర్తించండి ?
1) ష్యోక్
2) గిల్గిట్
3) ద్రాస్
4) గోమల్
పైవాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 4
సి) 2, 3 మరియు 4
డి) పైవన్నీ
జవాబు : బి) 1, 2 మరియు 4
11) ఈ క్రింది వాటిలో జలపాతాలను వాటి నదులతో జతపర్చండి :
1) కపిల్దర జలపాతం - గోదావరి
2) జోగ్ జలపాతం - శరావతి
3) శివసముద్రం జలపాతం - కావేరి
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) పైవన్నీ
జవాబు : సి) 2 మరియు 3
12) ఈ క్రింది వాటిలో పశ్చిమ ఘాట్, ఈశాన్య భారతదేశం, హిమాలయాల దిగువన ఏ రకం అడవులు ఉంటాయి :
ఎ) ఉష్ణమండల సతత హరిత
బి) ఉష్ణమండల తేమ ఆకురాల్చే
సి) ఉష్ణమండల పొడి ఆకురాల్చే
డి) టైడల్ ఫారెస్టు
జవాబు : బి) ఉష్ణమండల తేమ ఆకురాల్చే
13) ప్రపంచంలోనే అతిపెద్ద సౌర ఆవిరి వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది ?
ఎ) తమిళనాడు
బి) ఉత్తరప్రదేశ్
సి) మహారాష్ట్ర
డి) గుజరాత్
జవాబు : సి) మహారాష్ట్ర
14) తమిళనాడులోని బొగ్గు నిక్షేపాలకు నైవేలి ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఇది దేనికి ప్రసిద్ది ?
ఎ) ఫీట్
బి) లిగ్నైట్
సి) ఆంత్రాసైట్
డి) బిటుమినస్
జవాబు : బి) లిగ్నైట్
15) ప్రపంచంలోని మొత్తం జనాభాలో పోల్చితే భారతదేశం జనాభా శాతం ఎంత ?
ఎ) 21.3%
బి) 17.7%
సి) 11.25%
డి) 9.32%
జవాబు : బి) 17.7%
Also Read :
16) కాంచన గంగ శిఖరం ఎక్కడ ఉంది ?
ఎ) ఉత్తరాఘండ్
బి) ఉత్తరప్రదేశ్
సి) నేపాల్
డి) సిక్కిం
జవాబు : డి) సిక్కిం
17) ‘‘సాగరమాత’’ అని ‘‘ ఎవరెస్టు ’’ శిఖరాన్ని ఏ దేశ ప్రజలు పిలుస్తారు ?
ఎ) ఇండియా
బి) మయన్మార్
సి) నేపాల్
డి) బంగ్లాదేశ్
జవాబు : సి) నేపాల్
18) ‘‘జయంతియా ’’ అనే తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో నివసిస్తారు ?
ఎ) నాగాలాండ్
బి) మణిపూర్
సి) మేఘాలాయ
డి) మిజోరాం
జవాబు :సి) మేఘాలాయ
19) ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం కె2 ఏ పర్వతశ్రేణిలో ఉంది ?
ఎ) జస్కార్
బి) లడఖ్ శ్రేణి
సి) కారకోరం
డి) బంకేటీదాస్
జవాబు : సి) కారకోరం
20) కింది వాటిల ‘‘ ప్లయాలు ’’ అని వేటిని పిలుస్తారు ?
ఎ) ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు
బి) కదిలే ఇసుక దిబ్బలు
సి) ఉప్పునీటి సరస్సులు
డి) ఒండలి మైదానాలు
జవాబు : సి) ఉప్పునీటి సరస్సులు
21) భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఏది ?
ఎ) తీర మైదానాలు
బి) ద్వీపకల్ప పీఠభూమి
సి) ఉత్తర మైదానాలు
డి) హిమాలయాలు
జవాబు : బి) ద్వీపకల్ప పీఠభూమి
22) అజంతా పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) గుజరాత్
సి) మహారాష్ట్ర
డి) కర్ణాటక
జవాబు : సి) మహారాష్ట్ర
23) ‘‘మౌంట్ అబూ’’ వేసవి విడిది కేంద్రం ఏ పర్వతశ్రేణిలో ఉంది ?
ఎ) పశ్చిమ కనుమలు
బి) సాత్పూరా పర్వతాలు
సి) వింధ్య పర్వతాలు
డి) అరావళి పర్వతాలు
జవాబు : డి) అరావళి పర్వతాలు
24) జీవ వైవిధ్య ప్రాంతమైన ‘‘సెలైంట్ వ్యాలీ ’’ ఏ రాష్ట్రంలో ఉంది ?
ఎ) తెలంగాణ
బి) గుజరాత్
సి) కర్ణాటక
డి) కేరళ
జవాబు : డి) కేరళ
25) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది ?
ఎ) కేరళ
బి) ఒడిశా
సి) ఆంధ్రప్రదేశ్
డి) తమిళనాడు
జవాబు : సి) ఆంధ్రప్రదేశ్
26) ఈ క్రింది వాటిలో దేనిని ‘‘కాంతి తీర మైదానం అని పిలుస్తారు ?
ఎ) సర్కార్ తీరం
బి) వంగ తీరం
సి) మలబార్ తీరం
డి) కోరమాండల్ తీరం
జవాబు : బి) వంగ తీరం
27) ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది ?
ఎ) మహారాష్ట్ర -` కొంకణ్
బి) పశ్చిమబెంగాల్ - వంగ
సి) తమిళనాడు - కోరమాండల్
డి) ఒడిశా - సర్కార్
జవాబు :డి) ఒడిశా - సర్కార్
28) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది ?
ఎ) కేరళ
బి) ఒడిశా
సి) ఆంధ్రప్రదేశ్
డి) తమిళనాడు
జవాబు : సి) ఆంధ్రప్రదేశ్
29) ఈ క్రింది వాటిని జతపరచండి :
1) బాబు బుడాన్
2) ఫళని కొండలు
3) ఇలైమలై పర్వతాలు
4) సహ్యాద్రి
ఎ) తమిళనాడు
బి) మహారాష్ట్ర
సి) కర్ణాటక
డి) కేరళ
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
జవాబు :సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
30) సింధూనది ఏ పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తుంది ?
ఎ) కారకోరం, హిందూకుష్
బి) కైలాస, లద్దాఖ్
సి) లద్దాఖ్, జస్కర్
డి) జస్కర్, కైలాస
జవాబు : సి) లద్దాఖ్, జస్కర్
0 Comments