
Satavahana Dynasty : Gk questions and Answers in telugu Part - 3
Satavahana Dynasty gk questions in telugu :
1) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) శాతవాహనుల యొక్క మూలపురుషుడు శ్రీముఖుడు
2) తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు
3) శాతవాహన రాజ్యస్థాపకుడు శాతవాహనుడు
4) చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం శాతవాహనుల యొక్క రాజధానులు మూడు ఉన్నాయి.
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 2 మరియు 4 మాత్రమే సరైనవి
డి) 1 మరియు 4 మాత్రమే
జవాబు : సి) 2 మరియు 4 మాత్రమే సరైనవి
2) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) శాతవాహనులలో గొప్పవాడు - యజ్ఞశ్రీ శాతకర్ణి
2) శాతవాహనులలో చివరివాడు - 2వ పులోమావి
3) శాతవాహనులలో రాజులు - వైదిక మతాన్ని రాణులు, బౌద్ధమతాన్ని ఆచరించారు.
4) శాతవాహనుల యొక్క రాజలాంఛనం - సూర్యుడు
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 1, 2 మరియు 3 మాత్రమే
సి) 2 మరియు 4 మాత్రమే
డి) 3 మరియు 4 మాత్రమే
జవాబు : డి) 3 మరియు 4 మాత్రమే
3) కోటి లింగాలలో లభించిన నాణేములను బట్టి శాతవాహనుల కంటే ముందు తెలంగాణలో కోటిలింగాల నుండి పరిపాలించిన వారిని గుర్తించండి :
1) గోబధ
2) నారాయణ
3) కంవయాస
4) సమగోస
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1, 2 మరియు 3 మాత్రమే
సి) 2, 3 మరియు 4 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4
జవాబు :డి) 1, 2, 3 మరియు 4
4) ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి :
1) చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా గోబధ (గోభధ్రుడు) నాణేములను ముద్రించాడు.
2) సమగోప వేయించిన నాణేములు ` ప్రతిష్టానపురంలో లభ్యమయ్యాయి.
3) కుషాణులు మొదటిసారిగా మహారాజు, రాజాధిరాజా అనే బిరుదులను ధరించగా వాటిని శాతవాహనులు కూడా ధరించారు.
4) శ్రీముఖుని యొక్క నాణేములు కోటిలింగాల మధ్య లభ్యమయ్యాయి.
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 3 మరియు 4 మాత్రమే
సి) 2 మరియు 4 మాత్రమే
డి) 2 మాత్రమే
జవాబు : డి) 2 మాత్రమే
5) ఈ క్రింది వాటిని సరికాని జతను గుర్తించండి :
1) పీ.టి శ్రీనివాస అయ్యంగార్ - కోటిలింగాల
2) వి.వి మిరాశి - విదర్భ
3) సుక్తాంకర్ - కన్నడ
4) పి.వి పరబ్రహ్మశాస్త్రి - ఆంధ్ర
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 4 మాత్రమే
డి) 1, 2 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1 మరియు 4 మాత్రమే
6) కె.ఏ నీలకంఠశాస్త్రీ అభిప్రాయం ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
1) జాతినామం - ఆంధ్ర
2) వంశనామం - శాతవాహన
3) ఇంటి నామం - శాతకర్ణి
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
7) ఈ క్రింది వాటిలో చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సరికాని జతను గుర్తించండి :
1) బి.ఎస్.ఎల్ హనుమంతరావు - శాతవాహనులు - ఆర్యులు
2) ఆర్.ఎస్ భ్రహ్మ - శాతవాహనులు - ఆంధ్రభృత్యులు
3) డి.సి సర్కార్ - శాతవాహనులు - ద్రావిడులు
4) ఆర్.జి భండార్కర్ - శాతవాహనులు - ఆంధ్రభృత్యులు
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 3 మరియు 4 మాత్రమే
డి) 2, 3 మరియు 4 మాత్రమే
జవాబు : బి) 2 మరియు 3 మాత్రమే
8) ఈ క్రింది వాటిని జతపర్చండి :
1) సోమదేవ
2) హేమచంధ్రుడు
3) హలుడు
4) రాజశేఖరుడు
ఎ) గాధసప్తశతి
బి) కావ్యమీమాంస
సి) కథా సరిత్సాగరం
డి) అభినవ చింతామణి
ఎ) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
జవాబు : డి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
9) వాయువ్య భారతదేశంలో ఆంధ్రప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించే కాలంనాటికి కింది వాటిలో ఎవరు సమకాలీకులీగా ఉన్నారు ?
1) ఇండో గ్రీకులు
2) శకులు
3) పార్దిమన్లు
4) కుషానులు
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 3 మరియు 4 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
Satavahana Dynasty gk questions with answers in telugu :
10) ఆంధ్రశాతవాహనుల గురించి తెలియజేసిన అశోకుడి శిలాశాసనం పేరు ఏమిటీ ?
ఎ) 13వ శిలా శాసనం
బి) 14వ శిలా శాసనం
సి) 10వ శిలా శాసనం
డి) 19వ శిలా శాసనం
జవాబు : ఎ) 13వ శిలా శాసనం
0 Comments