బ్యాంకుల్లో క్లర్క్‌ కొలువుల జాతర || IBPS Clerk 4545 Vacancies Notification and Online Form Out || IBPS Clerk jobs -2023 in telugu || Jobs in Telugu || Latest Jobs in Telugu

బ్యాంకుల్లో క్లర్క్‌ కొలువుల జాతర || IBPS Clerk 4545 Vacancies Notification and Online Form Out ||  IBPS Clerk jobs -2023 in telugu

బ్యాంకుల్లో క్లర్క్‌ కొలువుల జాతర

IBPS Clerk Jobs -2023 in telugu

Jobs in Telugu || Latest Jobs in Telugu || Telangana Jobs in Telugu

" 4545 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ "
" ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా రెండు దశలలో ఎంపిక ప్రక్రియ "
" ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష "
" 01-07-2023 నుండి ధరఖాస్తులు స్వీకరణ
"

IBPS Clerk Jobs -2023 in telugu : బ్యాంకింగ్‌ రంగం .. ఒక్కసారి కొలువుదీరితే .. వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు ! చక్కటి వేతనాలు, కెరీర్‌ పరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే భావన !! అందుకే .. ఏటా లక్షల మంది బ్యాంకు కొలువుల నియామక పరీక్షలకు సన్నద్దమవుతుంటారు ! నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా ? అని ఎదురుచూస్తూ ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. ఇలాంటి వారందరికి IBPS తీపికబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4545 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోస్టుల వివరాలు, ప్రిపరేషన్‌, అర్హత, ముఖ్యమైన తేదిలు కింద ఇవ్వడం జరిగింది.

Institute of Banking Personal Selection (IBPS) .. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ మొదలు స్పెషలిస్టు ఆఫీసర్ల వరకూ .. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. IBPS ఏర్పాటైనప్పటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. వందల, వేల సంఖ్యలో నియామకాలు చేపడుతుంది. తాజాగా ఐబీపీఎస్‌ సంస్థ.. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ క్లర్క్స్‌ (CRP Clerk - 13) పేరిట 4545 పోస్టుల భర్తీ కోసం నోటీఫికేషన్‌ జారీ చేసింది.

01 జూలై 2023 నుండి ప్రారంభమయ్యే ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 21 జూలై 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. రెండు ధపాలుగా జరిగే ఈ పరీక్షకు ప్రిలిమినరీ పరీక్ష అగస్టు / సెప్టెంబర్‌ 2023 లో జరుగుతుంది. మేయిన్స్‌ ఎగ్జామ్‌ అక్టోబర్‌ 2023 లో నిర్వహిస్తారు.

IBPS విడుదల చేసిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ క్లర్క్స్‌ (CRP Clerk - 13) లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌లో 77 పోస్టులు, తెలంగాణలో 27 పోస్టులున్నాయి. IBPS Clerk పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 21 జూలై 2023 లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ అగస్టు / సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. అలాగే మేయిన్స్‌ ఎగ్జామ్‌ అక్టోబర్‌ 2023 లో నిర్వహిస్తారు. ఎగ్జామ్‌ యొక్క హాల్‌టికెట్లను పరీక్ష తేది కంటే వారం ముందుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ యొక్క ఫలితాలను సెప్టెంబర్‌ / అక్టోబర్‌ 2023 లో ప్రకటిస్తారు. అక్టోబర్‌ 2023 నిర్వహించే మేయిన్స్‌ పరీక్ష ఫలితాలను ఏప్రీల్‌ 2024 లో ప్రకటించడం జరుగుతుంది.

IBPS విడుదల చేసిన 4545 క్లర్క్‌ పోస్టుల భర్తీ అనేది ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా రెండు దశలలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఐబీపీఎస్‌ పరీక్షను దేశంలోని 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తారు.

మొత్తం పోస్టుల సంఖ్య
దేశవ్యాప్తంగా మొత్తం 4545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో
ఆంధ్రప్రదేశ్‌ లో - 77
తెలంగాణలో - 27 పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు ఇతర రీజియన్లకు కూడా పోటీ పడోచ్చు. ఎంచుకున్న రీజియన్‌కు సంబందించి .. అక్కడి అధికారిక భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక రాష్ట్రానికి సంబందించిన పోస్టులకే ధరఖాస్తు చేసుకోవచ్చు.


 అర్హత
  • ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కల్గి ఉండాలి.

 వయోపరిమితి
  • జూలై 1, 2023 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మద్యలో ఉండాలి.
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు

 పరీక్ష ఫీజు
  • 850/- జనరల్‌ / ఓబిసి అభ్యర్థులకు
  • 175/- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
 ధరఖాస్తు విధానం
  • ఆన్‌లైన్‌ లో ధరఖాస్తు చేసుకోవాలి.

ప్రిలిమినరీ ఎగ్జామ్‌ సెంటర్‌లు
తెలంగాణ హైద్రాబాద్
కరీంనగర్
ఖమ్మం
వరంగల్‌
ఆంధ్రప్రదేశ్‌ చీరాల
చిత్తూర్
ఏలూరు
గుంటూర్
కడప
కాకినాడ
కర్నూలు
నెల్లూరు
ఓంగోలు
రాజమండ్రి
శ్రీకాకుళం
తిరుపతి
విజయవాడ
విశాఖపట్నం
విజయనగరం
మెయిన్స్‌ ఎగ్జామ్‌ సెంటర్‌లు
తెలంగాణ హైద్రాబాద్
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్‌ గుంటూర్
కర్నూలు
విజయవాడ
విశాఖపట్నం

IBPS Clerk Jobs -2023 in telugu : మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 4545 క్లర్క్‌ పోస్టుల యొక్క భర్తీకి పరీక్ష నిర్వహించనుంది. అవి
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
కెనరా బ్యాంక్‌
ఇండియన్‌ ఒవర్సీస్‌ బ్యాంక్‌
యూకో బ్యాంక్‌
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
పంజబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
ఇండియన్‌ బ్యాంక్‌
పంజాబ్‌ అండ్‌ సింధ్‌

 ఎంపిక ప్రక్రియ
మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ రెండో దశలో మెయిన్‌ పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ విజయం సాధించి తుదిజాబితాలోకి వస్తే ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ ఇస్తారు. తుది ఎంపికలో మెయిన్‌ పరీక్షలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
IBPS Clerk Jobs -2023 వ్రాత పరీక్షలను ఇంగ్లీష్‌, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు కూడా ఉంది.

ప్రిలిమినరీ పరీక్షా విధానం :

ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 మార్కుల పేపర్‌ ఉంటుంది. ఇందులో కనీస మార్కులు సాధించిన వారు మేయిన్స్‌ అర్హత సాధిస్తారు.

విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
న్యూమరికల్‌ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
రిజనీంగ్‌ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం 100 100 60 నిమిషాలు

మెయిన్‌ పరీక్షా విధానం :

ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌ లిస్టును రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్‌ / ఫైనాన్షియల అవేర్‌నెస్ 50 50 35 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 40 35 నిమిషాలు
రిజనింగ్‌ అండ్‌ కంప్యూటర్ 50 60 45 నిమిషాలు
క్వాంటిటేటీవ్‌ అప్టిట్యూడ్‌ 50 50 45 నిమిషాలు
మొత్తం 190 200 160 నిమిషాలు

ముఖ్యమైన తేదీలు
IBPS Clerk - 2023 1 జూలై 2023
IBPS Clerk ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభ తేది 1 జూలై 2023
IBPS Clerk ఆన్‌లైన్‌ ధరఖాస్తు చివరి తేది 21 జూలై 2023
IBPS Clerk ప్రిలిమ్స్‌ పరీక్ష తేది అగస్టు / సెప్టెంబర్‌
IBPS Clerk మేయిన్స్‌ పరీక్ష తేది అక్టోబర్‌ 20

IBPS Clerk - 2023 ఆన్‌లైన్‌ ధరఖాస్తు చేసుకోవడం ఎలా ?

అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు సమర్పించాలి. పరీక్ష ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అభ్యర్థులు ఫోన్‌ నెంబర్‌ మరియు ఈ మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రర్‌ చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన లాగిన్‌ ఐడి మరియు పాస్‌వర్డ్‌ అందించబడతాయి. అభ్యర్థులు ఐబీపిఎస్‌ అధికారిక  వెబ్‌సైట్‌లోకి వెళ్లేట్లు ఇక్కడ మేము ధరఖాస్తు లింకు అందించాము. ఐబీపిఎస్‌ క్లర్క్‌ 2023 కోసం ధరఖాస్తు చేసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి. ఆన్‌లైన్‌ చేసే సమయంలో పాస్‌పోర్టు సైజు ఫోటో, సంతకం, ఎడమ బొటనవ్రేలి ముద్ర, చేతివ్రాత డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది.


కెటగిరి‌ జాబ్స్
నిర్వహించు సంస్థ ఐబీపీఎస్‌
పోస్టు పేరు ఐబీపీఎస్‌ క్లర్క్‌
దేశం ఇండియా
మొత్తం ఉద్యోగాలు 4545
ఎక్కడ దేశవ్యాప్తంగా
తెలంగాణ ఖాళీలు 27
ఆంధ్రప్రదేశ్‌ ఖాళీలు 77
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్
పరీక్ష విధానం ఆన్‌లైన్‌
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్‌ మరియు మేయిన్స్‌ పరీక్ష
ఎంపిక ప్రక్రియ రిలిమ్స్‌ మరియు మేయిన్స్‌ పరీక్ష
విద్యార్హత ఏదేని డిగ్రీ
వయోపరిమితి 20 నుండి 28 సంవత్సరాలు
పూర్తి సమాచారం కొరకు Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తుల కొరకు Click Here

1) IBPS Clerk -2023 వివరణాత్మక నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేయబడుతుంది ?

జవాబు : IBPS Clerk -2023 వివరణాత్మక నోటిఫికేషన్‌ 01 జూలై 2023 రోజున విడుదల చేయబడిరది.

2) IBPS Clerk -2023 కోసం వయస్సు పరిమితి ఎంత కావాలి ?

జవాబు : IBPS Clerk -2023 వయస్సు పరిమితి 20 నుండి 28 సంవత్సరాలు ఉండాలి.

3) IBPS Clerk -2023 లో ఎన్ని పోస్టుల కోసం ఎన్ని ఖాళీలు విడుదలయ్యాయి ?

జవాబు :IBPS Clerk -2023 నోటిఫికేషన్‌తో 4545 ఖాళీలు విడుదలయ్యాయి. ‌

4) IBPS Clerk -2023 కోసం ధరఖాస్తు రుసుము ఎంత ?

జవాబు : IBPS Clerk -2023 పరీక్ష ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/వికలాంగుల అభ్యర్థులకు రూ.175.

5)IBPS Clerk -2023 పరీక్ష తేది ఏమిటి ?

జవాబు : IBPS Clerk -2023 ప్రిలిమినరీ పరీక్ష అగస్టు / సెప్టెంబర్‌లో జరుగుతుంది.

Post a Comment

0 Comments