Telangana Culture : Gk quesions in Telugu || Gk MCQ Questions with Answers

Gk Questions with Answers ||

 Gk MCQ Questions with Answers 

Telangana Culture Gk quesions in Telugu

1) తెలంగాణలోని వివిధ కులాలు వారు చేసే పనికి సంబంధించి సరికాని జతను గుర్తించండి :
ఎ) ఈడిగ - కల్లు తీసి అమ్మేవారు
బి) సాలెవారు - నేతపనిచేసి విదేశాలలో అమ్మేవారు
సి) ఉప్పవరివాళ్లు - బావులు తవ్వడం, ఇల్లు కట్టడం
డి) బలిజలు - వేట వీరి ప్రధాన వృత్తి

జవాబు : డి) బలిజలు - వేట వీరి ప్రధాన వృత్తి

2) ఈ క్రింది వాటిలో తెలంగాణలో పాటలు పాడుతూ బిక్షాటన చేసేవాళ్లు ఎవరు ?
ఎ) జాంబవులు
బి) బావురి
సి) సిందోళ్లు
డి) మాతంగి

జవాబు : డి) మాతంగి

3) ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడీలను షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించింది?
ఎ) 1976
బి) 2015
సి) 2001
డి) 1997

జవాబు :ఎ) 1976

4) ‘‘దండారీ పండుగ’’ ఎవరి యొక్క ముఖ్య పండుగగా జరుపుకుంటారు ?
ఎ) లంబాడీలు
బి) గోండులు
సి) చెంచులు
డి) కోయలు

జవాబు : బి) గోండులు

5) సుగాలి / బంజారా అని ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు ?
ఎ) లంబాడీలు
బి) గోండులు
సి) చెంచులు
డి) కోయలు

జవాబు : ఎ) లంబాడీలు

6) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) తెలంగాణలో లంబడీలు అతిపెద్ద తెగ ` దాదాపుల తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించి ఉన్నారు.
2) తెలంగాణలో చెంచులు నాగర్‌కర్నూల్‌ జిల్లా మరియు నల్గొండ జిల్లాలో ఎక్కువగా నివసిస్తారు.
ఎ) 1 మరియు రెండూ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు రెండూ కావు

జవాబు : ఎ) 1 మరియు రెండూ

7) ఈ క్రింది వాటిలో ఎవరి యొక్క అవాసాలను ‘‘పెంట’’ అని అంటారు ?
ఎ) కొండారెడ్డిలు
బి) గోండులు
సి) లంబాడీలు
డి) చెంచులు

జవాబు : డి) చెంచులు

8) పరదాన్లు ఈ క్రింది ఎవరి యొక్క వీరగాధను ఇతివృత్తాలుగా చేసుకొని పాటలు పాడుతూ జీవనం కొనసాగిస్తారు.
ఎ) కోయలు
బి) గోండులు
సి) లంబాడీలు
డి) చెంచులు

జవాబు : బి) గోండులు

9) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి :
1) సదర్‌ పండుగ - యాదవులు
2) తీజ్‌ పండుగ - బంజారా
3) అక్కిపేన్‌ - గోండుల దేవత
4) శీత్లా భవాని పండుగ - చెంచులు

ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 4 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4

జవాబు : సి) 4 మాత్రమే

10) గుస్సాడీ నృత్యం ఈ క్రింది ఏ జాతర సందర్భంగా చేస్తారు ?
ఎ) సమ్మక్క సారలమ్మ
బి) గొల్లగట్టు జాతర
సి) నాగోబా జాతర
డి) ఏడుపాయల జాతర

జవాబు : సి) నాగోబా జాతర

11) రెండవ తిరుపతి / తెలంగాణ తిరుపతి అని ఏ జాతరను అంటారు ?
ఎ) కురుమూర్తి జాతర
బి) మన్నెంకొండ జాతర
సి) వేలాల జాతర
డి) కొరవి జాతర

జవాబు : ఎ) కురుమూర్తి జాతర

12) తెలంగాణ అమర్‌నాథ్‌ అని ఈ క్రింది వాటిలో ఏ జాతరను పిలుస్తారు ?
ఎ) గంగమ్మ జాతర
బి) సిద్దుల గుట్ట జాతర
సి) కొత్తకొండ జాతర
డి) సలేశ్వరం జాతర

జవాబు : డి) సలేశ్వరం జాతర

13) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) నిర్మల్‌ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి
2) నిర్మల బొమ్మల తయారికి ఉపయోగించే కలప పునికి కర్ర
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2 రెండూ కావు
డి) 1 మరియు 2 రెండూ

జవాబు :డి) 1 మరియు 2 రెండూ

14) ఈ క్రింది వాటిలో ఏ కళాకారులను తెలంగాణలో ‘‘నకాషీ’’ లు అని పిలుస్తారు ?
ఎ) పెంబర్తి కళాకారులు
బి) చేర్యాల స్క్రోల్‌ పేయింటింగ్స్‌ కళాకారులు
సి) సిల్వర్‌ ఫిలిగ్రీ తయారు చేసే కళాకారులు
డి) పైవన్నీ

జవాబు : బి) చేర్యాల స్క్రోల్‌ పేయింటింగ్స్‌ కళాకారులు

15) పెంబర్తి హస్తకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ?
ఎ) కడర్ల రామయ్య
బి) అయిలా చారీ
సి) బిఎస్‌ రాములు
డి) గంజం అంజయ్య

జవాబు : బి) అయిలా చారీ

16) సిల్వర్‌ ఫిలిగ్రీ కళ అనేది ఒక ?
ఎ) బంగారు తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు, నగలు తయారు చేయుట
బి) వెండి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు, నగలు తయారు చేయుట
సి) ఇత్తడి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు తయారు చేయుట
డి) రాగితీగతో రకరకాల బొమ్మలు, జాలీలు తయారు చేయుట

జవాబు : బి) వెండి తీగతో రకరకాల బొమ్మలు, జాలీలు, నగలు తయారు చేయుట

17) పోచంపల్లి చీరలకు ఏ సంవత్సరంలో భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది ?
ఎ) 2001
బి) 2002
సి) 2003
డి) 2005

జవాబు : డి) 2005

18) తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన ‘‘దర్రీస్‌ ’’ ఏ ప్రాంతానికి చెందినది ?
ఎ) వరంగల్‌
బి) నారాయణపేట
సి) అదిలాబాద్‌
డి) కోరుట్ల

జవాబు : ఎ) వరంగల్‌

19) తెలంగాణలో చందంపేట దేనికి ప్రసిద్ది చెందిన ప్రాంతం ?
ఎ) గాజులు
బి) కాగితం
సి) రంజాన్‌ కుండలు
డి) ముత్యాలు

జవాబు : డి) ముత్యాలు

20) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ది సంస్థ లోగో గోల్కొండ
2) పోచంపల్లి చేనేత పార్కు ఇండియా హ్యాండ్లూమ్‌ బ్రాండ్‌ గుర్తింపు 2017 లో వచ్చింది

ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2 రెండూ కావు
డి) 1 మరియు 2 రెండూ

జవాబు : ఎ) 1 మాత్రమే

21) ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి :
ఎ) భౌగోళిక గుర్తింపు చట్టం 2003 నుండి అమలులోకి వచ్చింది
బి) భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి కేంద్ర పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ నోడల్‌ ఏజన్సీగా పనిచేస్తుంది.
సి) మనదేశంలో భౌగోళిక సూచిక గుర్తింపు ప్రధాన కార్యాలయం Delhi లో కలదు
డి) తెలంగాణలో మొదట భౌగోళిక గుర్తింపు పొందిన నది - పోచంపల్లి ఇక్క
త్‌

జవాబు : సి) మనదేశంలో భౌగోళిక సూచిక గుర్తింపు ప్రధాన కార్యాలయం Delhiలో కలదు

22) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి :
1) కంచు ప్రతిమలు - శిల్పారామం
2) కంబల్లు - సిద్దిపేట
3) ఖాదీ బట్టలు - మెట్‌పల్లి
4) డోక్రా మెటల్‌ క్రాఫ్ట్‌ - అదిలాబాద్‌

ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 3 మరియు 4 మాత్రమే
సి) 2 మరియు 4 మాత్రమే
డి) 2 మాత్రమే

జవాబు : డి) 2 మాత్రమే

23) ‘‘థెమ్సా’’ నృత్యం తెలంగాణలో ఎవరు చేస్తారు ?
ఎ) కోయలు
బి) రాజ్‌గోండు
సి) లంబాడీలు
డి) కొండరెడ్లు

జవాబు : బి) రాజ్‌గోండు

24) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) గ్రామీణ వినోధాన్ని అందించే చిందు భాగవతంలో పౌరాణిక ఇతిహాసాలను కళాకారులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తారు.
2) చిందు భాగవతం నృత్య రూపంలో పేరుపొందిన మహిళ`చిందు ఎల్లమ్మ
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2 రెండూ కావు
డి) 1 మరియు 2 రెండూ

జవాబు : డి) 1 మరియు 2 రెండూ

25) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గు కథ
2) ఒగ్గు కథను సాధారణంగా గొల్ల కులస్థులు చెప్తారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2 రెండూ కావు
డి) 1 మరియు 2 రెండూ

జవాబు : ఎ) 1 మాత్రమే .

26) ‘‘ది మంకీ కింగ్స్‌ ఆఫ్‌ ఒగ్గు కథ’’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) డాక్టర్‌ కుమారస్వామి
బి) మిద్దె రాములు
సి) చుక్క సత్తయ్య
డి) యాదయ్య

జవాబు : ఎ) డాక్టర్‌ కుమారస్వామి

27) ‘‘జానపద కళాబ్రహ్మ’’ అనే బిరుదు ఎవరికి కలదు ? ఎ) డాక్టర్‌ కుమారస్వామి
బి) మిద్దె రాములు
సి) చుక్క సత్తయ్య
డి) యాదయ్య

జవాబు : బి) మిద్దె రాములు

28) ‘‘యక్షగానం’’ యొక్క పుట్టినిల్లు అని ఏ రాష్ట్రంను పిలుస్తారు ?
ఎ) తెలంగాణ
బి) ఆంధ్రప్రదేశ్‌
సి) చత్తిస్‌ఘడ్‌
డి) కర్ణాటక

జవాబు : డి) కర్ణాటక

29) తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు ?
ఎ) డాక్టర్‌ ఎస్‌.వి జోగారావు
బి) చెర్విరాల భాగయ్య
సి) సుద్దాల హనుమంతు
డి) సుద్దాల అశోక్‌ తేజ

జవాబు : బి) చెర్విరాల భాగయ్య

30) బుర్రకథ కళాకారులకు సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి :
1) బుర్ర కథను చెప్పే వారిని ‘‘జంగాలు’’ అంటారు
2) బుర్ర కథ పితామహుడు ` షేక్‌ నాజర్‌
3) తెలంగాణ ప్రాంతానికి చెందిన అల్లూరి అయోధ్య రామయ్య వ్రాసిన ప్రముఖ బుర్రకథ ` నైజాం విప్లవం
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1, 2 మరియు 3
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే

జవాబు : బి) 1, 2 మరియు 3‌

Post a Comment

0 Comments