
సింహం - ఎలుక
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
ఒకానొక అడవిలో ఒక సింహం గుహలో నిద్రిస్తుంది. అంతలో ఒక ఎలుక సింహం నిద్రిస్తున్న గుహలోకి వచ్చింది. నిద్రిస్తున్న సింహంపైకి ఎక్కి, దిగుతూ ఆటలాడిరది. నిద్రిస్తున్న సింహం ముఖంపైకి వెళ్లి సింహం నిద్రకు భంగం కల్గించింది. నిద్రలేచిన సింహం తన నిద్రను పాడుచేసినందుకు ఎలుకపై గుర్రుగా చూసి తన పాదాన్ని లేపింది. సింహం కోపంతో చూడడంతో ఎలుకకు భయం వేసింది. వణుకుతున్న స్వరంతో ‘‘ఓ సింహరాజా ! నన్ను క్షమించు !! నేను పెద్ద తప్పు చేశాను. నేను నీ నిద్రకు ఆటంకం కల్గించాను. నన్ను ఈ ఒక్కసారికి వదిలేయ్ మళ్లీ ఇటువంటి పొరబాటు జన్మలో చేయను. నన్ను చంపకుండా వదిలేస్తే సమయం వచ్చినప్పుడు నేను నీ ఉపకారానాన్ని తిరిగి తప్పకుండా చెల్లించుకుంటాను ’’ అని అంది. ఇది విన్న సింహం జాలిపడి ఎలుకను చంపకుండా వదిలేసింది. ఎలుక బతికిబట్టకట్టినందుకు దేవుడా ! అంటూ అక్కడి నుండి తుర్రున వెళ్లిపోయింది.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు సింహం ఎప్పటిలాగే అడవిలో తిరుగుతుండగా ఒక తెలివైన వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకుంది. వలలో చిక్కిన సింహం సహాయం కోసం బిగ్గరగా గర్జించడం ప్రారంభించింది. ఎక్కడో ఉన్న ఎలుకకు సింహం గర్జించడం వినిపించింది. వెంటనే సింహంను వెతుక్కుంటూ వచ్చింది. వేటగాడు వేసిన వలలో చిక్కుకొని గర్జిస్తున్న సింహాన్ని చూసింది ఎలుక. గతంలో సింహం చంపకుండా వదిలేసిన సహకారాన్ని గుర్తుతెచ్చుకుంది ఎలుక. వెంటనే తన పదునైన పళ్లతో వేటగాడు వేసిన వలను కొరుక్కుంటు వెళ్లింది. నిమిషాల్లో వేటగాడు వేసిన ఉచ్చు నుండి సింహన్ని రక్షించింది. సింహ ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది.
నీతి : ఒకరికొకరు సహాయం చేసుకోవాలి
0 Comments