
చంద్రాయన్ - 3 గురించి మీకు ఈ విషయాలు తెలుసా .. !
Gk in telugu : Chandrayaan -3 project in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
చంద్రునిపై అన్వేషణ, పరిశోధన కోసం ఇస్రో చేపడుతున్న మరో ప్రతిష్టాత్మక మిషన్ Chandrayaan-3. గతంలో చంద్రయన్ -2 పరీక్ష విఫలం కావడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్-3 రూపకల్పన చేశారు. ఈ Chandrayaan-3 ప్రయోగాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ Chandrayaan-3 రాకేట్ చంద్రునిపైకి అగస్టు 23 లేదా 24, 2023 రోజున ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రునిపై సాప్ట్ లాండింగ్ అయ్యాయి. Chandrayaan-3 నింగిలోకి పంపించడంతో ఈ ఘనత సాధించిన నాల్గవ దేశం(అమెరికా, చైనా, రష్యా) గా భారత్ నిలవనుంది. ఇస్రోచైర్మన్ సోమ్‌నాథ్ నేతృత్వంలోని బృందం ఈ మిషన్‌లో పాలుపంచుకోనుంది. Chandrayaan-3 రాకేట్ యొక్క బరువు 3900 కేజీలు ఉంటుంది. ఈ ప్రాజేక్టు డైరెక్టర్‌గా పి.వేణుముత్తువేల్ వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజేక్టు కోసం బడ్జెట్ 615 కోట్ల ఖర్చు చేయడం జరుగుతుంది.
చంద్రయాన్ - 3 మిషన్ ఏమిటి ? |
---|
భూమి చుట్టు నిరంతరంగా తిరుగుతూ పండు వెన్నెలను అందించేచంద్రునిపై పైకి ల్యాండర్‌ను పంపించి చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండర్‌ను ల్యాండింగ్ చేయడం ద్వారా అందులోని రోబోట్‌లు బయటకు వచ్చేలా చేసి చంద్రునిపై శాస్త్రీయ ప్రయోగాలు జరిపి ఆ సమాచారాన్ని భూమి చేరేవేసే లక్ష్యంతో Chandrayaan-3 ప్రయోగం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రునిపై ఉపరితలం గురించి అక్కడి వాతావరణ పరిస్థితులు, ఖనిజాలు, నీటి జాడల గురించి మరింత విశ్లేషణ చేసి పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఈ Chandrayaan-3 మిషన్ ఉపయోగపడుతుంది.
చంద్రయాన్ - 3 లో ఏమేం ఉంటాయి ? అవి ఎలా పనిచేస్తాయి .. ! |
---|
చంద్రయాన్ - 3లో ప్రొపల్షన్ మాడ్యుల్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అనే మూడు ముఖ్యమైన భాగాలుంటాయి.
ఇందులో ముఖ్యమైన భాగమైన ప్రొపల్షన్ మాడ్యూల్ భాగం విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి 100 కి.మీ దూరమున్న కక్ష్యలోకి తీసుకెళ్లడానికి సహయపడుతుంది. చంద్రునికి 100 కి.మీ దూరంలో విక్రమ్ ల్యాండర్ విడిపోయి చంద్రుని ఉపరితలంపైకి ల్యాండింగ్ అవుతుంది. ఈ విధంగా ల్యాండర్ చంద్రునిపై సురక్షితంగా ల్యాండింగ్ అయిన తర్వాత ల్యాండర్‌లోని రోవర్‌లు చంద్రుని ఉపరితలంపైకి చేరుకొని చంద్రునికి సంబందించిన సమాచారాన్ని విశ్లేషించి భూమికి పంపిస్తుంది. చంద్రయాన్-2 లో వాడిన పేర్లనే ఈ చంద్రయాన్ -3 లో ఉపయోగించడం జరుగుతుంది.
చంద్రయాన్-3 మిషన్ ఎన్ని రోజులు ఉంటుంది ? |
---|
చంద్రయాన్ - 3 ల్యాండర్ యొక్క జీవిత కాలం కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ల్యాండర్ కమ్యూనేషన్ కట్ అవుతుంది. చంద్రయాన్ - 2 లో పంపించిన ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలకు పైగా ఉంటుంది. కాబట్టి చంద్రయాన్- 3 లో మళ్లీ ఆర్బిటర్‌ను పంపించడం లేదు. గతంలో పంపించిన ఆర్బిటర్ చంద్రుని చుట్టుఉన్న కక్ష్యలోనే తిరుగుతూ పనిచేస్తుంది.
చంద్రయాన్-3 లాంచింగ్ ఎప్పుడు ? |
---|
జూలై 14 2023 రోజున మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్‌దావన్ అంతరిక్ష కేంద్రం నుండి చంద్రయాన్-3 మిషన్ ప్రారంభమవుతుంది. ఈ చంద్రయాన్-3 రాకేట్ చంద్రునిపైకి అగస్టు 23 లేదా 24, 2023 రోజున ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది.
చంద్రయాన్-3 లో వాడిన టెక్నాలజీ ఎంటీ ? |
---|
చంద్రయాన్ -3లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఈ పరిజ్ఞానం ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇందులో 7 రకాల సాంకేతిక పరిజ్ఞానాలను వాడడం జరిగింది.
1) అల్టీమీటర్స్ :
ఇవి ఎత్తును నియంత్రిస్తాయి. ఇవి రేడియో లేజర్ ప్రిక్వెన్సిస్ సహాయంతో పనిచేస్తాయి.
2) వెలోసీ మీటర్స్ :
ఇవి వేగాన్ని నియంత్రిస్తాయి. ఇందులో లేజర్ డాప్లర్ వెలోసీమీటర్, ల్యాండర్ హరిజెంటర్ వెలోసీమీటర్ కెమెరా ఉంటాయి.
3) ఇనర్షియల్ మెజర్‌మెంట్ :
ఇది ల్యాండర్ యొక్క ఇనర్షియల్‌ను లెక్కిస్తుంది. లేజర్ గైరోస్కోప్ ఆధారంగా పనిచేస్తాయి.
4) ప్రొపల్షన్ సిస్టమ్ :
ఇందులో అత్యాధునిక 800ఎన్ తోటేబుల్ లిక్విడ్ ఇంజన్‌లు, కంట్రోల్ ఇంజన్‌లు ఉంటాయి.
5) నెవిగేషన్ గైడెన్స్ అండ్ కంట్రోల్ :
ఇందులో ల్యాండిరగ్ మార్గాన్ని నిర్ధేశించి ప్రొజెక్టరీ డిజైన్, సాప్ట్‌వేర్ ఉంటుంది.
6) హాజార్డ్స్ డిటెక్షన్ మరియు అవాయిడెన్స్ :
7) ల్యాండిరగ్ లెగ్ మెకానిజం :
ఇందులో ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకేందుకు ఇవి ఉపయోగపడతాయి.
- చంద్రయాన్ - 3 మొత్తం బరువు 3,920 కిలోలు ఉంటుంది. ఇందులో ప్రొపల్షన్ మాడ్యుల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలుంటాయి.
- ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్‌లో మూడు, రోవర్‌లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్-3లో అమర్చారు.
- 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్‌లో 1,696 కేజీల అపోజి ఇంధనం నింపారు. దీని సాయంతోనే ల్యాండర్, రోవర్‌లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- చంద్రుని కక్ష్య నుండి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్‌లో ఓ పరికరాన్ని అమర్చారు. చంద్రుని ఉపరితల నివాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది.
- రోవర్‌లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్‌మ్యూయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది.
- చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణలక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది.
- ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రెడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటీవ్ అయానోస్పియర్ , అట్మాస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండిరగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి.
- అల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్లు తేలితే వాటి జాబితా తయరికి ఉపయోగిస్తారు.
- లేజర్ ప్రేరేపిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది. చుట్టు ఏముంది వంటివి శోధిస్తుంది.
- చంద్రయాన్-2 వైఫల్యంతో చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఆగిపోయాయి. చంద్రాయన్-2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్-3 లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే పంపుతున్నారు.
- ఈ చంద్రాయన్-3 విజయవంతం అయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై చేరిన మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించనుంది.
0 Comments