దొంగల పన్నాగం - తెనాలి రామకృష్ణ తెలివి కథ తెలుగులో || Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu

దొంగల పన్నాగం -  తెనాలి రామకృష్ణ తెలివి  కథ తెలుగులో || Telugu Kathalu || Telugu Stories

 దొంగల పన్నాగం -  తెనాలి రామకృష్ణ తెలివి 

Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu

ఒక రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తుండేది. ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి ‘‘అవ్వా ! మేము యాత్రికులము. చాలాదూరం ప్రయాణం చేయుటచే బాగా అలసిపోయి ఉన్నాము. మీరు దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే ఇక్కడ కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని వెళతాము’’ అన్నారు. ఆమె అంగీకరించడంతో ఆ గదిలోనే నివసించసాగారు. ఒక రోజున వాళ్లు బంగారు నాణేలతో ఉన్న కుండను ఒకటి తెచ్చియిచ్చి దాన్ని భద్రంగా చూడవల్సిందని ఆమెకు చెప్పారు. ఆమెకు అనుమానం వచ్చి ‘‘ ఇంత సొమ్ము మీకెక్కడిదీ ? మీరు దొంగలా ?’’ అని అడిగింది. ‘‘ కాదు, మేము యాత్రీకులము. ప్రతీ రాత్రీ మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ, జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము. వాళ్లు మాకు కానుకగా యీ బంగారు నాణేలను ఇస్తుంటారు. మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి ! అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు’’ అన్నారు. అందుకు ముసలమ్మ అంగీకరించింది. 

ఒక రోజున వాళ్లు ఇంటికి తిరిగివస్తుండగా దారిలో ఏవో తినబండారాలు, పళ్లూకన్పించాయి. ఆ రోజు వాళ్లవద్ద పైకమేమీ లేదు. మరి అవి ఎట్లా కొనక్కోవాలి. అవ్వయిల్లు దగ్గరలోనే ఉన్నది. అందుచేత వారిలో ఒకణ్ణి పోయి కుండను తీసుకురమ్మని చెప్పారు. వెళ్లినవాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వగట్టిగా ‘‘ కుండను ఇతనికి ఇవ్వవచ్చునా ? అని కేకవేసింది. ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురూ ‘‘‘ఆ ఇవ్వవచ్చు’’ అన్నారు. వెంటనే ఆమె వచ్చినవానికి కుండనిచ్చింది. ఆ వచ్చిన వాడు దురాశాపరుడు. ఆ నాణేల కుండతో పక్కదోవన ఎక్కడికో పారిపోయాడు. ఎంతసేపటికి అతడు రాలేదని మిగతా ముగ్గురూ అవ్వవద్దకు వెళ్లి ‘‘అవ్వా ! కుండ ఏది ? అని అడిగారు. ‘‘వచ్చిన వాడికి కుండను ఇవ్వవచ్చునని అరచి చెప్పారు కదా’’ అందుచేత కుండను వానికి ఇచ్చినాను ’’ అంది. దానికి ఆ ముగ్గురు దొంగలూ నానా రభసా చేయసాగారు. ‘‘ ముసలమ్మ దొంగది. మా సొమ్మంతా దొంగిలించింది’’ అని అరవసాగారు. ఆ గొడవకి చుట్టుపక్కలవారు అనేకమంది పోగయ్యారు. ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో తెనాలి రామక్రిష్ణ ఆ దాడిగుండాపోతూ వీరిగోల విన్నాడు. ఆ సమయంలోనే ప్రాత:కాల వ్యాయామం చేస్తూ వెళుతున్న మహారాజు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయనకు రామలింగడు జరిగినదంతా వివరించి ‘‘ అవ్వను దూషించడం మంచిపనికాదు. అవ్వ నిజాయితీపరురాలు. మోసకారికాదు !’’ అన్నాడు. 

‘‘ఐతే ఆమె నిర్ధోషియని నీవే నిరూపించి చూపించు ’’ అని రామలింగని రాజుగారు అజ్ఞాపించారు. రామలింగడు ఆ ముగ్గుర్నీ ఒక పక్కకు పిలిచి జరిగినదంతా చెప్పండి అని అడిగాడు. అంతా విన్న రామలింగడు ‘‘ఈ అవ్వ దోషికాదు. ఆమె అబద్దమాడుటలేదు. మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెకును కుండనిమ్మని చెప్పారు కదా ? ఇప్పుడు మీరు ముగ్గురే  ఉన్నారు ! మీకు కుండానెట్లా యిస్తుంది ?’’ అని అడిగాడు. ఏం జవాబుచెప్పాలో వాళ్లకి తోచలేదు. వాళ్లని నిలదీసిన మీదట, తామూకూడా దొంగలమేనని వాళ్లు ఒప్పుకున్నారు. 

రామలింగని తెలివికి రాజుగారు సంతోషించి బంగారు ఉంగరంతో సత్కరించాడు. ఆ ముగ్గురి దొంగల్ని బంధించి చెరసాలలో వేయించాడు. 


Moral of Story :  మోసపు సొమ్ము ఎన్నాళ్లూ ఉండదు

Post a Comment

0 Comments