సింహం నాయకత్వ ప్రతిభ కథ తెలుగులో || Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu

నాయకత్వ ప్రతిభ 

The Lion Leadership

Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu

ఒకానొక కాలంలో ఒక విశాలమైన అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం అడవికి రాజుగా ఉండేది. సింహం తెలివైనది, సత్వర నిర్ణయాలు తీసుకొనే గొప్ప సింహం రాజుగా పేరుంది. అంతేకాకుండా అడవిలోని జంతువులందరికి సహాయం చేసేది. ఎండాకాలం కావడంతో వర్షాలు కురవక తీవ్రమైన కరువుకాటకం వచ్చింది. అడవిలోని జంతువులన్ని దాహార్తితో అలమటిస్తున్నాయి. నీటికోసం కొన్ని మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా చూసి ఆందోళన చెందిన అడవి రాజు సింహం ఎంతో చింతించింది. దీనికి సత్వర పరిష్కారం కనుగొనే క్రమంలో అడవిలోని జంతువులందరితో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి అడవిలోని అన్ని జంతువులు వచ్చాయి. 

సమావేశానికి అన్ని జంతువులు వచ్చిన తర్వాత వాటన్నింటితో సింహం ఇలా అంది 

‘‘ చూడండి మన అడవిలో వర్షాలు లేక జంతువులన్ని నీటికి అలమటిస్తున్నాయి. మనకున్న కొద్ది నీటివనరులను మనందరం కలిసి సమిష్టిగా వంతులవారీగా వాడుకోవాలి. లేకుంటే మనం మరణించే అవకాశం ఉంది. ఈ కష్టసమయంలో అందరు ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరికి మద్దతు పలకాలి. ఈ కరువు అనే ఈ గడ్డుపరిస్థితిని ఎదుర్కొవడానికి నేను ఒక ప్రణాళికను రూపొందించాను’’ అని అంది. దీంతో జంతువులన్ని సింహరాజు ఏమి చెబుతాడో అని ఆసక్తిగా ఎదురుచూశాయి. 

తాను రూపొందించిన ప్రణాళిక గురించి వివరిస్తూ సింహం ఇలా అంది ‘‘ జంతువులారా మనందరము నీటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ప్రతి ఒక్కరికి న్యాయమైన వాటా లభించేలా చూసుకోవాలి. మితంగా మరియు ఒకరిఒకరు సహకారంతో ఉన్న నీటివనరులను చివరి వరకు కొనసాగించాలి ’’ అని అంది. దీనికి అడవిలోని జంతువులన్ని ఒప్పుకున్నాయి. ప్రతిరోజు జంతువులు నీరు వంతులవారీగా త్రాగేందుకు కొన్ని జంతువులను నియమించాడు. దీంతో జంతువులన్నింటిలో ఐక్యతాభావం పెంపొందింది. 

సింహనికి అడవిలో వచ్చిన పేరుప్రఖ్యాతలను సహించని ఒక నక్క సింహం రూపొందించిన ప్రణాళికకు భంగం కల్గించి సింహం నాయకత్వాన్ని కించపరచాలని పన్నాగం పన్నింది. ఒక రోజు నక్క నీరు త్రాగడానికి వచ్చి నక్క తనలో తాను ఇలా అనుకుంది ‘‘ నేను అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగితే మిగతా జంతువులకు నీరు దొరకక అలమటిస్తారు. దీంతో జంతువులన్ని సింహం ప్రణాళికను లోపభూయిష్టంగా ఉందని సింహం విశ్వసనీయతను కోల్పొతాయి ’’ అని అనుకుంది. 

ఇలా దుర్మార్గమైన ఆలోచనతో నక్క నీటి ఒప్పందాన్ని ఉల్లంఘించి అపారమైన నీటిని త్రాగడం ప్రారంభించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇతర జంతువులకు నీటి కొరత ఏర్పడినది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి నీటి గుంతలపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది సింహం. ఇలా కొన్ని రోజుల తర్వాత ఇదంతా నక్క చేసిన పన్నాగం అని సింహానికి తెలుస్తుంది. వెంటనే నక్కను పిలిచి ఇలా అంది ‘‘ చూడు నీ స్వార్థం వల్ల అమాయక జంతువులు నీరు దొరక్క ఎంతో అలమటించాయి. నీ చర్యల వల్ల ఐక్యత, సహాకారం కొరవడి జంతువుల మద్య గొడవలు జరిగాయి. జంతువులన్ని నీపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేశావు ’’ అని అంది సింహాం. 

నక్క పశ్చాత్పాపంతో తలవంచి ‘‘ సింహరాజ నన్ను క్షమించు నేను స్వార్థంతో నిన్ను, నీ నాయకత్వాన్ని ఒమ్ము చేయాలని ఇదంతా చేశాను. దీనిని నేను తీవ్రంగా చింతిస్తున్నాను. ఇకనుండి ఇలా చేయను నన్ను మన్నించండి ’’ అని అంది

నక్క తన తప్పు తెలుసుకొని పశ్చాతాపడడంతో సింహం నక్కను క్షమించి వదిలేసింది. ఆ రోజు నుండి నక్క సింహం యొక్క ప్రణాళికను చక్కగా అమలు చేసింది. కొద్ది రోజులకు వర్షాకాలం రావడంతో విస్తారంగా వర్షాలు పడి వాగులు, వంకలు నీటితో నిండి అడవంతా పచ్చగా మారిపోయింది. జంతువులన్ని హాయిగా జీవించాయి. 

Moral : ఇతరుల పట్ల స్వార్థంగా ఉండరాదు 

Post a Comment

0 Comments