పిసినారి నిర్వాకం కథ తెలుగులో || Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu

పిసినారి నిర్వాకం  కథ తెలుగులో || Telugu Kathalu || Telugu Stories

 పిసినారి నిర్వాకం 

Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu

ఒక ఊరిలో రంగయ్య తన కుటుంబంతో జీవించేవాడు. తన కూతురుని వేరే గ్రామంలోని యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. తన కొడుకు ఇంకా బాల్యదశలోనే ఉన్నాడు. రంగయ్య  తన ఊరిలో కిరాణం షాపు నడిపించేవాడు. ప్రతిరోజు పట్నం వెళ్లి అక్కడ వస్తువులను తక్కువ ధరకు తీసుకువచ్చి తన ఊరిలో లాభానికి అమ్మేవాడు. ఆ ఊరిలో మరొక దుకాణం లేకపోవడంతో గ్రామస్థులు ఏ వస్తువు కావాలన్నా రంగయ్య దుకాణంలోనే కొనాల్సి వచ్చేది. అయితే రంగయ్య భార్య ఈశ్వరమ్మ పరమ పిసినారి (లోభి) పైగా నోటి దురుసు ఎక్కువగా ఉండేది. కనీస జాలి లేకుండా అధిక ధరలకు వస్తువులు అమ్ముతూ గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేసేది. ఊరిలో మరొక కిరాణం లేకపోవడం గత్యంతరం లేక గ్రామస్థులు ఈశ్వరమ్మ వద్దనే కొనుక్కెళ్లేవారు. 

ఒకరోజు ఈశ్వరమ్మ వేరే గ్రామంలోని తన కూతురుని చూసివద్దామని రంగయ్యను అడిగింది. దీంతో రంగయ్య ‘‘ నాకు పని ఉంది. నువ్వు పిల్లాడిని తీసుకొని వెళ్లు. వేరే కుండలో మంచి తేనె దాచాను, అది అమ్మాయికి చాలా ఇష్టం తీసుకెళ్లు ’’ అన్నాడు రంగయ్య. ‘‘ ఎందుకు దండగా ! అల్లుడు తెస్తాడుగా ’ అంటూ అక్కడే పెట్టింది ఈశ్వరమ్మ. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుండి 5 కొబ్బరిబొండాలు దింపింది. వాటి పీచు ఒలిచి, సంచీలో వేసుకొని పిల్లాడితో కూతురు వద్దకు ప్రయాణమైంది ఈశ్వరమ్మ. 

ఇలా కూతురు వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా పిల్లాడికి దాహం వేసింది. ‘‘అమ్మా దహమేస్తోంది. మంచినీళ్లు కావాలి’ అన్నాడు పిల్లాడు. ఈశ్వరమ్మ మంచినీళ్ల డబ్బా తేవడం మరిచిపోయింది. ఈ గుట్ట దాటితే గాని నీటికుంట దొరకదు, ఇప్పుడెలా ? అనుకొని ‘కాస్త ఓర్చుకో నాయానా ! మరో రెండు ములుపుల తిరిగితే గుట్ట వస్తుంది. అక్కడ తాగుదువుగాని’ అంది ఈశ్వరమ్మ. పిల్లాడు సరేనని తలాడించడంతో ముందుకు సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్లీ అడిగాడు పిల్లాడు. ‘వచ్చేశాం ! మర్కొ మలుపు అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయడంతో పిల్లాడు భరించలేకపోయాడు. సమీపంలో నీటికుంట ఎక్కడా కనిపించలేదు. ‘పోనీ అక్కయ్య కోసం తెచ్చిన కొబ్బరిబోండాం ఇవ్వమ్మ త్రాగుతాను !’ అన్నాడు పిల్లాడు. పిల్లాడు అలా అడగడంతో కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఇలా చేస్తున్నాడు అని అపార్థం చేసుకుంది ఈశ్వరమ్మ. అసలు కాయలు దింపినప్పుడే కొబ్బరి నీళ్లు తాగుతానని మంకుపట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది.ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు సూటి పెట్టాడని నవ్వుకుంది. మరికాసేపట్లో అక్కయ్య ఇంటికి చేరుకుంటాము అంతవరకు ఓర్చుకో అంది. అంతేకాని పిల్లాడికి నిజమైన దాహమని గుర్తించలేకపోయింది ఈశ్వరమ్మ. నాలుగు అడుగులు వేశాడో లేదో ఎండకు కళ్లు తిరిగి నేలపై కిందపడ్డాడు. అప్పుడు పిల్లాడిది మంకు కాదు నిజమైన దాహం అని ఈశ్వరమ్మ అర్థమైంది. వెంటనే సంచిలోనుండి కొబ్బరిబొండాలు తీసి పిల్లాడికి తాగించింది. కానీ అప్పటికే పిల్లాడు స్పృహ తప్పిపడిపోయాడు. ‘‘ నేను కొబ్బరి బొండాం కావాలని అడిగినప్పుడు ఇచ్చి ఉంటే బాగుండేది. నా పిసినారితనంతో నా పిల్లాన్ని ఇలా చేసుకున్నాను ’’ అంటూ బోరున విలపించింది ఈశ్వరమ్మ. దాంతో రోడ్డుపై నడిచే పాదచారులు  వచ్చి చూశారు కానీ ఏమి చేయలేక చూస్తుండిపోయారు. 

ఇంతలో తన గ్రామానికి చెందిన ఒక వైద్యుడు రోడ్డుపై వెళుతుండగా ఈశ్వరమ్మను  గుర్తుపట్టి దగ్గరకు వచ్చాడు. స్పృహతప్పి పడిపోయిన పిల్లాడిని చూశాడు. ‘‘నా కొడుకును వెంటనే చూడండి కళ్లు తేలేసి స్పృహ లేకుండా పడిఉన్నాడు. నీకు దండం పెడతా .. ఎదో ఒకటి చేయ్యి ’’ అంది ఈశ్వరమ్మ వైద్యుడితో. వైద్యుడు తన సంచిలోని ఇంజక్షన్‌ తీసి పిల్లాడికి ఇచ్చాడు. కొద్ది సమయం తర్వాత పిల్లాడు లేచి కూర్చున్నాడు. తర్వాత కొబ్బరిబొండాం కొట్టి పిల్లాడికి తాగించింది ఈశ్వరమ్మ. పిల్లాడు ఎప్పటిలాగే లేచి నిలబడ్డాడు. పిల్లాడు లేచేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది ఈశ్వరమ్మ. 

‘‘ నిత్యావసరాలు తీరగా మిగిలిన డబ్బులు దాచుకుంటే దాన్ని ‘‘పొదుపు’’ అంటారు. కడుపు మాడ్చుకొని కూడబెడితే దాన్ని ‘‘పిసినారితనం’’ అంటారు. నీ పిసినారితనంతో కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశావు. గ్రామస్థులను వేదించావు. దానివల్ల చెడ్డపేరు సాధించావు తప్ప చిటికడెంత గౌరవం పొందలేక పోయావు.’’ అంటూ హితబోధ చేశాడు వైద్యుడు. దీంతో జ్ఞానోదయం అయిన ఈశ్వరమ్మ అప్పటినుండి ప్రవర్తన మార్చుకొని పిసినారితనాన్ని వదిలేసి అందరికి సహాయం చేస్తు జీవించింది. 


Moral : పిసినారితనంలో ప్రాణమీదికి తెచ్చుకోవద్దు 


Post a Comment

0 Comments