
అమాయక వర్తకుడు
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
ఒక ఊరిలో ఒక అమాకపు వర్తకుడు ఉండేవాడు. అతనికి దైవభక్తి చాలా ఎక్కువ. ఒక రోజున తాను పూజిస్తున్న దేవతకు పూజ చేయడానికి ఒక మేకపిల్లను బలివ్వడానికి దగ్గరలోని నగరానికి వెళతాడు. ఆ నగరంలో ఒక మంచి మేకపిల్లను కొనుగోలు చేసి కాలినడకన గ్రామానికి బయలుదేరుతాడు. ఇలా తన గ్రామానికి నడిచివెళుతుండగా మార్గమద్యలో ముగ్గురు దొంగలు వర్తకుడు మేకను భుజాలపై వేసుకొని వెళ్లడాన్ని చూస్తారు. ఎలాగైన ఆ మేకను పొందాలనే దురుద్దేశ్యంతో ఒక పన్నాగం పన్నుతారు. ఆ వర్తకునికి కనబడకుండా ముగ్గురు దొంగలు వేరు వేరు స్థలాలలో నిలుచుంటారు. మొదట ఒక దొంగ వర్తకునికి అడ్డుగా వచ్చి ఇలా అన్నాడు ‘‘ఓ బాటసారి మేడలో కుక్కను వేసుకొని ఎక్కడికి వెళుతున్నావు. అయినా కుక్కను నడిపించాలి కానీ భుజాన వేసుకొని ఎందుకు నడుస్తున్నావు ’’ అని అన్నాడు. దాంతో కంగుతిన్న వర్తకుడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు ‘‘మూర్ఖుడా ఇది కుక్క కాదు. నేను దేవతకు బలివ్వడానికి నగరంలో కొనుగోలు చేసి తీసుకుకెళుతున్న మేకపిల్ల ’’ అని తన దారిగుండా వెళ్లసాగాడు. వర్తకుడు కొంతదూరం వెళ్లిన తర్వాత మరొక దొంగ అడ్డుగా వచ్చి నమస్కారం పెట్టి ఇలా అన్నాడు ‘‘ఓ పెద్దాయన కుక్కను ఎందుకు మోసుకెళుతున్నావు. దానికి కింద విడిచిపెడితే నడుస్తుంది కదా, ఎందుకు అంతలా కష్టపడుతున్నావు ’’ అన్నాడు. దీంతో వర్తకుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన భుజాలపై ఉన్న మేకపిల్లను కిందికి తదేకంగా చూసుకున్నాడు. నేను మోసుకెళుతున్నది మేకపిల్ల అయితే వీరేంటి కుక్కపిల్ల అంటున్నారని వర్తకుడు ఆలోచనలో పడతాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ కిందికి దించిన మేకపిల్లను మళ్లీ భుజాన వేసుకొని ముందుకుసాగుతాడు. కొందిదూరం వెళ్లాకా మూడో దొంగ తారసపడి ఇలా అన్నాడు ‘‘చీ చీ ఇదేంటి మీరు కుక్కపిల్లను భుజాన వేసుకొని వెళుతున్నారు. మీరు ఎందుకిలా చేస్తున్నారు ’’ అని ఇలా ముగ్గురు దొంగలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా మేకపిల్లను కుక్క అనేసరికి వర్తకుడు కంగారుపడి భుజాన వేసుకున్న మేకపిల్లను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ముగ్గురు దొంగలు వారు వేసిన పన్నాగం నిజం కావడంతో మేకపిల్లను తీసుకొని నవ్వుతూ వెళ్లిపోతారు.
0 Comments