IBPS PO 2023 Notification Out : Apply Online, Eligibility, Result in Telugu || IBPS PO Recruitment for Probationary Officers jobs in telugu

IBPS PO Recruitment for Probationary Officers jobs in telugu
>

IBPS Probationary Officers Jobs in telugu 
IBPS PO Job in Telugu || IBPS PO Jobs in Telugu || Jobs in Telugu || Latest Jobs in Telugu
 

IBPS PO - 2023 నోటిఫికేషన్‌ విడుదల 

3049 పోస్టుల భర్తీ

01 అగస్టు 2023 నుండి ధరఖాస్తులు ప్రారంభం 

Latest Jobs in Telugu : బ్యాంకు ఉద్యోగార్థులకు తీపి కబురు .. దేశంలోని బ్యాంకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించే ఐబీపీఎస్‌ మూడు వేలకు పైగా ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతోనే ఐబీపీఎస్‌ పీవో పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే .. ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనంతోపాటు బ్యాంకింగ్‌ రంగంలో ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది. అందుకే బ్యాంకింగ్‌ రంగంలో విడుదలయ్యే నోటిఫికేషన్ల కొరకు చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో .. IBPS PO పోస్ట్‌ల వివరాలు, ఎంపిక, అర్హత, ప్రిపరేషన్‌, సబ్జెక్టులు, ఎంపిక విధానం, ఆన్‌లైన్‌, వయస్సు, ముఖ్యమైన తేదీలు, ఎగ్జామ్‌ సెంటర్‌లు గురించి క్రింద వివరాలు ఇవ్వడం జరిగింది. 

    ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర భవిష్యత్తుకు భరోసా కల్పించే రంగం బ్యాంకింగ్‌. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో కొలువు సాధిస్తే.. కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోకుండా ముందుకుసాగవచ్చు. ఐబీపీఎస్‌ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. తాజాగా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌ / మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) .. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ మొదలు స్పెషలిస్టు ఆఫీసర్ల వరకూ .. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్‌ ఏర్పాటైనప్పటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. వందల, వేల సంఖ్యలో నియామకాలు చేపడుతుంది. తాజాగా ఐబీపీఎస్‌ సంస్థ.. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొమేషనరీ ఆఫీసర్‌ -2023 పేరిట 3049 పోస్టుల భర్తీ కోసం నోటీఫికేషన్‌ జారీ చేసింది.

01 అగస్టు 2023 నుండి ప్రారంభమయ్యే IBPS Probationary Officers ఏదేని డిగ్రీ విద్యార్హత కల్గి ఉండాలి.  21 అగస్టు 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. రెండు ధపాలుగా జరిగే ఈ పరీక్షకు ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్‌ / అక్టోబర్‌ 2023 లో జరుగుతుంది. మేయిన్స్‌ ఎగ్జామ్‌ నవంబర్‌ 2023 లో నిర్వహిస్తారు. 

ఐబీపీఎస్‌ విడుదల చేసిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌  ప్రొబేషనరీ ఆఫీసర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 21 అగస్టు 2023 లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ సెప్టెంబర్‌ / అక్టోబర్‌ 2023 నిర్వహిస్తారు. అలాగే మేయిన్స్‌ ఎగ్జామ్‌ నవంబర్‌ 2023 లో నిర్వహిస్తారు. ఎగ్జామ్‌ యొక్క హాల్‌టికెట్లను పరీక్ష తేది కంటే వారం ముందుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ యొక్క ఫలితాలను అక్టోబర్‌ 2023లో ప్రకటిస్తారు. నవంబర్‌ 2023 నిర్వహించే మేయిన్స్‌ పరీక్ష ఫలితాలను డిసెంబర్‌ 2023 లో ప్రకటించడం జరుగుతుంది. ఇంటర్యూకు సంబందించిన హాల్‌టికెట్లను జనవరి / ఫిబ్రవరి 2024 లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంటర్యూలను జనవరి / ఫిబ్రవరి 2024 లో నిర్వహించి ఏప్రిల్‌ 2024 లో అలాట్‌మెంట్‌ ఇస్తారు. 

ఐబీపిఎస్‌ విడుదల చేసిన 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ అనేది ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్యూ ద్వారా మూడు దశలలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

Also Read : Gk Questions in Telugu


➺ పరీక్ష ఫీజు :

  • 850/- జనరల్‌ / ఓబిసి అభ్యర్థులకు
  • 175/- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ లో ధరఖాస్తు చేసుకోవాలి.

పరీక్షా సెంటర్‌లు
State Preliminary Exam Mains Exam
తెలంగాణ హైద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం మరియు వరంగల్‌ హైద్రాబాద్‌ మరియు కరీంనగర్‌
ఆంధ్రప్రదేశ్‌ అనంతపూర్‌, చీరాల, చిత్తూర్‌, ఏలూరు, గుంటూర్‌, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఓంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం గుంటూర్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం

➺ మొత్తం పోస్టుల సంఖ్య :

  • దేశవ్యాప్తంగా మొత్తం 3049 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

➺ వయోపరిమితి :

  • అగస్టు 1, 2023 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మద్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

Also Read : Gk in Telugu 

➺ ఎంపిక ప్రక్రియ :

ఐబీపీఎస్‌ స్పెషలిస్టు ఆఫీసర్‌ ఎంపిక విధానం మూడు అంచెలలో ఉంటుంది. మొదటి దశలో మెయిన్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ రెండో దశలో మెయిన్‌ పరీక్ష ఉంటాయి. మూడో దశ ఇంటర్యూ ఉంటుంది. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ ఉత్తీర్ణులైనవారికి ఇంటర్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులకు మెయిన్స్‌ అబ్జెక్టివ్‌ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్యూలో వచ్చిన మార్కులను 80:20 నిష్పత్తిలో తీసుకొని వాటి ఆధారంగా తుదిఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్‌ విడుదల 1 అగస్టు 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభ తేది 1 అగస్టు 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు చివరి తేది 21 అగస్టు 2023
ప్రిలిమ్స్‌ పరీక్ష తేది సెప్టెంబర్‌ / అక్టోబర్‌
ప్రిలిమ్‌ పరీక్షా ఫలితాలు అక్టోబర్‌ 2023
మేయిన్స్‌ పరీక్ష తేది నవంబర్‌ 2023
మేయిన్‌ పరీక్షా ఫలితాలు డిసెంబర్‌ 2023
ఇంటర్యూ నిర్వహించు తేది జనవరి / ఫిబ్రవరి 2024
అలాట్‌మెంట్ ఏప్రిల్‌ 2024

ఐబీపీఎస్‌ ద్వారా మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 1402 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల యొక్క భర్తీకి పరీక్ష నిర్వహించనుంది. అవి

1) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
2) కెనరా బ్యాంక్‌
3) ఇండియన్‌ ఒవర్సీస్‌ బ్యాంక్‌
4) యూకో బ్యాంక్‌
5) బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
6) సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
7) పంజబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
8) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
9) బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
10) ఇండియన్‌ బ్యాంక్‌
11) పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తు చేసుకోవడం ఎలా ?

అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు సమర్పించాలి. పరీక్ష ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అభ్యర్థులు ఫోన్‌ నెంబర్‌ మరియు ఈ మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రర్‌ చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన లాగిన్‌ ఐడి మరియు పాస్‌వర్డ్‌ అందించబడతాయి. అభ్యర్థులు ఐబీపిఎస్‌ అధికాక వెబ్‌సైట్‌లోకి వెళ్లికుండా ఇక్కడ మేము ధరఖాస్తు లింకు అందించాము. ఐబీపిఎస్‌ స్పెషలిస్టు ఆఫీసర్స్‌ 2023 కోసం ధరఖాస్తు చేసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి. ఆన్‌లైన్‌ చేసే సమయంలో పాస్‌పోర్టు సైజు ఫోటో, సంతకం, ఎడమ బొటనవ్రేలి ముద్ర, చేతివ్రాత డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది.

Also Read : Telangana History in Telugu


ఐబీపీఎస్‌ పీవో నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 మార్కుల పేపర్‌ ఉంటుంది. ఇందులో కనీస మార్కులు సాధించిన వారు మేయిన్స్‌ అర్హత సాధిస్తారు.

ప్రిలిమినరీ పరీక్షా విధానం
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 35 20 నిమిషాలు
రిజనీంగ్‌ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం 100 100 60 నిమిషాలు

ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌ లిస్టును రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

మెయిన్‌ పరీక్షా విధానం
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
రిజనింగ్‌ అండ్‌ కంప్యూటర్ 45 60 60 నిమిషాలు
డెటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటెషన్ 35 60 45 నిమిషాలు
జనరల్‌ / బ్యాంకింగ్‌ /ఎకానమీ అవేర్‌నెస్‌ 40 40 35 నిమిషాలు
ఇంగ్లీష్‌ 35 40 40 నిమిషాలు
మొత్తం 155 200 3 గంటలు
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ లెటర్‌ రైటింగ్‌ అండ్‌ ఎస్సే 02 25 30 నిమిషాలు


కెటగిరి‌ జాబ్స్
నిర్వహించు సంస్థ ఐబీపీఎస్‌
పోస్టు పేరు ఐబీపీఎస్‌ పీవో‌ ‌
దేశం ఇండియా
మొత్తం ఉద్యోగాలు 3049
ఎక్కడ దేశవ్యాప్తంగా
పాల్గొనే బ్యాంకులు 11
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్
పరీక్ష విధానం ఆన్‌లైన్‌
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్‌, మేయిన్స్‌ మరియు ఇంటర్యూ
విద్యార్హత ఏదేని డిగ్రీ
వయోపరిమితి 20 నుండి 30 సంవత్సరాలు
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభం 1 అగస్టు 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ముగింపు 21 అగస్టు 2023
ప్రిలిమ్స్‌ పరీక్ష సెప్టెంబర్‌ / అక్టోబర్‌
ప్రిలిమ్‌ ఫలితాలు అక్టోబర్‌ 2023
మేయిన్స్‌ పరీక్ష తేది నవంబర్‌ 2023
మేయిన్‌ ఫలితాలు డిసెంబర్‌ 2023
ఇంటర్యూ జనవరి / ఫిబ్రవరి 2024
పూర్తి సమాచారం కొరకు Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తుల కొరకు Click Here

1) IBPS PO‌ - 2023 వివరణాత్మక నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేయబడినది

జవాబు : IBPS PO వివరణాత్మక నోటిఫికేషన్‌ అగస్టు 2023 రోజున విడుదల చేయబడిరది..

2) IBPS PO కోసం వయస్సు పరిమితి ఎంత కావాలి ?

జవాబు : IBPS PO కు వయస్సు పరిమితి 20 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్‌లను బట్టి సడలింపు ఉంటుంది.

3) IBPS PO నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టుల ఖాళీలు విడుదలయ్యాయి ?

జవాబు :IBPS PO నోటిఫికేషన్‌తో 3049 ఖాళీలు విడుదలయ్యాయి. ‌

4) IBPS PO- 2023 కోసం ధరఖాస్తు రుసుము ఎంత ?

జవాబు : IBPS PO పరీక్ష ఫీజు ఎస్సీ/ఎస్టీ/వికలాంగుల అభ్యర్థులకు రూ.175/-, మిగతా వారికి 850/-

5) IBPS PO పరీక్ష తేదిలు ఏమిటి ?

జవాబు : IBPS PO ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్‌ / అక్టోబర్ 2023, మేయిన్‌ పరీక్ష నవంబర్‌ 2023

Post a Comment

0 Comments