
కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధికారాలు, విధులు
Indian Polity & Constitution Gk Questions in Telugu || Gk Questions in Telugu || Gk Questions in Telugu with Answers || General Knowledge Gk Questions in Telugu with Answers
Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
1) రాష్ట్రపతి, క్షమాబిక్ష అధికారాలను ఎవరి సలహా ప్రకారం మాత్రమే వినియోగించాలి ?
ఎ) కొలీజియం వ్యవస్థ
బి) అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
సి) ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి
డి) సుప్రీంకోర్టు ధర్మాసనం
జవాబు : సి) ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి
2) కింద పేర్కొన్న అంశాల్లో సరైనది గుర్తించండి :
1) ఆర్టికల్ 72(1)(ఎ)-సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలను రాష్ట్రపతి రద్దు చేయగలరు.
2) ఆర్టికల్ 72(1)(బి)-కేంద్ర చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులకు విధించే శిక్షలను రాష్ట్రపతి రద్దు చేయగలరు.
3) ఆర్టికల్ 72(1)(సి)-ఉరిశిక్షను రద్దు చేసి క్షమాబిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
4) ఆర్టికల్ 72(1)(డి)-ఉరిశిక్షకు క్షమాబిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రాల గవర్నర్లకు ఉంటుంది.
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 3 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 2 మరియు 4 మాత్రమే
జవాబు : ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
3) మరణశిక్ష విధించిన ఖైదీ క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరిస్తే ఆ రోజు నుండి ఎన్ని రోజుల్లోపు మరణశిక్షను అమలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది ?
ఎ) 7 రోజులు
బి) 14 రోజులు
సి) 21 రోజులు
డి) 30 రోజులు
జవాబు : బి) 14 రోజులు
4) రాష్ట్రపతి దౌత్యాధికారాలకు సంబంధించి సరైంది గుర్తించండి :
1) విదేశాలకు మన దేశం తరపున రాయబారులను నియమిస్తారు.
2) ఇతర దేశాల నుండి మన దేశానికి నియమితులయ్యే విదేశీ రాయబారులను అనుమతిస్తారు.
3) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎంపికలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తారు.
4) ఐక్యరాజ్యసమితికి మన దేశం తరపున ప్రతినిధులను నియమిస్తారు.
ఎ) 1, 3 మరియు 4 మాత్రమే
బి) 1, 2 మరియు 3 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 2 మరియు 4 మాత్రమే
జవాబు : డి) 1, 2 మరియు 4 మాత్రమే
5) కింద పేర్కొన్న అంశాల్లో సరైనది గుర్తించండి :
1) కామన్వేల్త్ దేశాల్లో భారతదేశ ప్రతినిధిని హైకమీషనర్ అంటారు.
2) ఇతర దేశాల్లో భారతదేశ ప్రతినిధిని దౌత్యవేత్త అంటారు.
3) రాష్ట్రపతి విదేశాంగ సర్వీసులను క్రమబద్దీకరిస్తారు.
4) మన దేశానికి, ఇతర దేశాలతో సంత్సంబందాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4 మాత్రమే
జవాబు : సి) 1, 2, 3 మరియు 4
Also Read : Gk Questions in Telugu
6) రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించి సరైంది గుర్తించండి :
1) కేబినేట్ మంత్రుల నియామకంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
2) లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మేజర్టీ ఏ రాజకీయ పార్టీకి రాని సందర్భంలో ప్రధానిని నియమించే సమయంలో విచక్షణ అధికారాన్ని వినియోగిస్తారు.
3) ప్రభుత్వాలు తరచూ అధికారాన్ని కోల్పొతున్న సమయంలో లోకసభను రద్దు చేసే విషయంలో విచక్షణాధికారాన్ని కల్గి ఉంటారు.
4) ఆపద్దర్మ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నియంత్రిస్తారు.
ఎ) 2, 3 మరియు 4 మాత్రమే
బి) 1, 2, 3 మరియు 4
సి) 1, 2 మరియు 3
డి) 1, 2 మరియు 4 మాత్రమే
జవాబు : ఎ) 2, 3 మరియు 4 మాత్రమే
7) రాష్ట్రపతి సైనికాధికారాలకు సంబంధించి సరైంది గుర్తించండి :
1) త్రివిధ దళాలకు అధిపతిగా వ్యవహరిస్తారు.
2) త్రివిధ దళాలకు అధిపతులను నియమిస్తారు.
3) శత్రు దేశాలపై యుద్దం ప్రకటిస్తారు. కానీ శాంతి ఒప్పందం కుదుర్చుకోలేరు.
4) విదేశాలతో శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది.
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4 మాత్రమే
జవాబు : బి) 1, 2 మరియు 4 మాత్రమే
8) రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక రక్షణలకు సంబంధించి సరైంది గుర్తించండి :
1) ఆర్టికల్ 361 రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక రక్షణలను తెలియజేస్తుంది.
2) సివిల్ కేసు వేయాలంటే 2 నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి
3) క్రిమినల్ కేసు నమోదు చేయాలంటే 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలి
4) పదవీకాలంలో నిర్వర్తించిన విధులకు గానూ పదవీవిరమణ అనంతరం ఏ న్యాయస్థానానికి బాద్యులు కారు
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4 మాత్రమే
జవాబు : బి) 1, 2 మరియు 4 మాత్రమే
9) భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అధికారాలను ఎక్కడ వివరించారు ?
ఎ) 16వవ భాగం ఆర్టికల్ 350-360
బి) 17వ భాగం ఆర్టికల్ 356-360
సి) 18వ భాగం ఆర్టికల్ 352-360
డి) 19వ భాగం ఆర్టికల్ 352-361
జవాబు : సి) 18వ భాగం ఆర్టికల్ 352-360
Also Read : Gk in Telugu
10) రాజ్యాంగంలో పేర్కొన్న అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించి సరికానిది ?
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్ 352
బి) అంతరంగిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్ 350
సి) రాష్ట్రపతి పాలన - ఆర్టికల్ 356
డి) ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్ 360
జవాబు : బి) అంతరంగిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్ 350
11) జాతీయ అత్యవసర పరిస్థితి (నేషనల్ ఎమర్జెన్సీ) కి సంబంధించి కిందివాటిలో సరైంది ?
1) బాహ్యా కారణాలతో అంటే విదేశాలతో యుద్దం సంభవించినప్పుడు విధిస్తారు.
2) అంతర్గత కారణాల వల్ల అంటే దేశంలో అంతరంగిక సంక్షోభం ఏర్పడినప్పుడు విధిస్తారు.
3) జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను 30 రోజుల్లోగా పార్లమెంటు ఆమోదించాలి.
4) జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను 30 రోజుల్లోగా పార్లమెంటు ఆమోదించాలి.
ఎ) 1, 3 మరియు 4 మాత్రమే
బి) 1, 2 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 2 మరియు 3 మాత్రమే
జవాబు : డి) 1, 2 మరియు 3 మాత్రమే
Also Read :
12) జాతీయ అత్యవసర పరిస్థితిక సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి :
1) పార్లమెంటు ఉభయసభలు 2/3 వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి.
2) ఒకవేళ లోక్‌సభ రద్దుయి ఉంటే రాజ్యసభ 2/3వ వంతు మెజార్టీతో ఆమోదించాలి.
3) లోక్‌సభకు ఎన్నికలు జరిగి లోక్‌సభ ఏర్పడితే 30 రోజుల్లోగా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదించాలి.
4) ఉభయ సభల మద్య అభిప్రాయ భేదాలు వస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 3 మరియు 4 మాత్రమే
సి) 1, 2, మరియు 4 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
13) పార్లమెంటు ఆమోదంతో 6 నెలలకు ఒకసారి చొప్పున జాతీయ అత్యవసర పరిస్థితిని గరిష్టంగా ?
ఎ) 12 నెలలు
బి) 3 సంవత్సరాలు
సి) 5 సంవత్సరాలు
డి) ఎంతకాలమైన
జవాబు : డి) ఎంతకాలమైన
14) జాతీయ అత్యవసర పరిస్థితి (నేషనల్ ఎమర్జెన్సీ) విధించినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 250 ప్రకారం కింది అంశాల్లో సరైంది ?
ఎ) రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది.
బి) పార్లమెంటు సమావేశాలు లేపుప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రపతి ఆర్టినెన్స్ జారీ చేయగలరు.
సి) ఎ మరియు బి
డి) జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను 30 రోజుల్లోగా పార్లమెంటు ఆమోదించాలి.
జవాబు : సి) ఎ మరియు బి
Also Read : Telangana History Gk Questions in Telugu
15) జాతీయ అత్యవవసర పరిస్థితి సమమయంలో ఉన్న సమయంలో సంభవించే మార్పులకు సంబంధించి సరైంది ?
1) ఆర్టికల్ 353 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అదికారాలపై కేంద్రం పరిమితులు విధించగలదు.
2) ఆర్టికల్ 354 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అధికారాలపై కేంద్రం పరిమితులు విధించగలదు.
3) ఆర్టికల్ 355 ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులు వెంటనే రద్దు అవుతాయి.
ఎ) 1, 2 మరియు 3
బి) 1, మరియు 3 మాత్రమే
సి) 1, మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1, మరియు 2 మాత్రమే
16) బాహ్య కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 19 లో పేర్కొన్న, స్వేచ్ఛా స్వాతంత్రాలు వెంటనే రద్దు అవుతాయని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది ?
ఎ) ఆర్టికల్ 355
బి) ఆర్టికల్ 357
సి) ఆర్టికల్ 358
డి) ఆర్టికల్ 361
జవాబు : సి) ఆర్టికల్ 358
17) జాతీయ అత్యవసర పరిస్థితి (నేషనల్ ఎమర్జెన్సీ) విధించినప్పటికీ ఆర్టికల్ 359 ప్రకారం ఏ ఆర్టికల్ లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు రద్దు కావు ?
ఎ) ఆర్టికల్ 14
బి) ఆర్టికల్ 20
సి) ఆర్టికల్ 21
డి) ఆర్టికల్ 20, 21
జవాబు : డి) ఆర్టికల్ 20, 21
18) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ప్రకారం జాతీయ అత్యవసర పరిసిÊథతి విధించిన తర్వాత దాన్ని రద్దు చేసే అంశానికి సంబంధించి సరైనది గుర్తించండి :
1) మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 1/10వ వంతు మంతి అత్యవసర పరిస్థితి రద్దును కోరుతూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇవ్వాలి.
2) లోక్‌సభ నిర్వహించే ప్రత్యేక సమావేశంలో సాధారణ మెజార్టీ లభిస్తే అత్యవసర పరిస్తితి రద్దు అవుతుంది.
3) పార్లమెంట్ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మాణాన్ని ఆమోదిస్తే అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది.
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 1, మరియు 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) 3 మాత్రమే
జవాబు : బి) 1, మరియు 2 మాత్రమే
19) ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధింపునకు సంబంధించి ‘‘అంతరంగిక సంక్షోభం’’ అనే పదాన్ని తొలగించి , దాని స్థానంలో ‘‘సాయుధ దళాలు తిరుగుబాబు’’ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ?
ఎ) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
బి) 43వ రాజ్యాంగ సవరణ చట్టం 1977
సి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
డి) 45వ రాజ్యాంగ సవరణ చట్టం 1979
జవాబు : సి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
Also Read : Latest Jobs in Telugu
20) కేంద్ర కేబినెట్ లిఖితపూర్వక సలహాతోనే ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్ధేశించారు ?
ఎ) 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951
బి) 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
సి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
డి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
జవాబు : డి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
21) మన దేశంలో మొదటిసారిగా భారత్‌పై చైనా దురాక్రమణ జరపడం వల్ల ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు విధించారు ?
ఎ) 1961, సెప్టెంబర్ 26
బి) 1962, అక్టోబర్ 26
సి) 1963 నవంబర్ 26
డి) 1963 డిసెంబర్ 31
జవాబు : బి) 1962, అక్టోబర్ 26
22) మన దేశంలో మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు వివిధ పదవులను నిర్వహిస్తున్న ప్రముఖులకు సంబంధించి సరైనది గుర్తించండి :
1) ప్రధానమంత్రి - జవహర్‌లాల్ నెహ్రూ
2) రాష్ట్రపతి - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
3) ఉప రాష్ట్రపతి - ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
4) కేంద్ర రక్షణ మంత్రి - వి.కె కృష్ణమీనన్
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4
జవాబు : బి) 1, 2 మరియు 4 మాత్రమే
0 Comments