
IBPS Specialist Officers Jobs in telugu
IBPS SO Job in Telugu || Jobs in Telugu || Latest Jobs in Telugu
బ్యాంకుల్లో స్పెషలిస్టు ఆఫీసర్ల కొలువుల జాతర
1402 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
01 అగస్టు 2023 నుండి ధరఖాస్తులు ప్రారంభం
IBPS Specialist Officers jobs in telugu : భారతదేశంతో బ్యాంకింగ్ రంగం అనేది ఒక సుస్థిర వ్యవస్థ. ఇందులో ఉద్యోగం సాధించాలని చాలా మంది అభ్యర్థులు కలలు కంటారు. బ్యాంకింగ్ రంగంలో డిగ్రీతోనే కేంద్ర కొలువు సాధించే వీలుంటుంది. అంతేకాకుండా అధిక వేతనాలు, అలవెన్సులు ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతిసంవత్సరం బ్యాంకింక్ రంగంలో పోస్టుల భర్తీ జరుగుతుంటుంది. బ్యాంకింగ్ రంగంలో విడుదలయ్యే నోటిఫికేషన్ల కొరకు చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తుంటారు. ఇలా ఎదురుచూసేవారికి ఐబీపీఎస్ శుభవార్త అందించింది. బ్యాంకింగ్ రంగంలో IBPS Specialist Officer ఉద్యోగాల కోసం భారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏకంగా 1402 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు, ప్రిపరేషన్, అర్హత, ముఖ్యమైన తేదిలు కింద ఇవ్వడం జరిగింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) .. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ మొదలు స్పెషలిస్టు ఆఫీసర్ల వరకూ .. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్ ఏర్పాటైనప్పటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. వందల, వేల సంఖ్యలో నియామకాలు చేపడుతుంది. తాజాగా ఐబీపీఎస్ సంస్థ.. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్పెషలిస్టు ఆఫీసర్ -2023 పేరిట 1402 పోస్టుల భర్తీ కోసం నోటీఫికేషన్ జారీ చేసింది.
01 అగస్టు 2023 నుండి ప్రారంభమయ్యే IBPS Specialist Officer పోస్టులలో సంబందిత విద్యార్హత కల్గి ఉండాలి. 21 అగస్టు 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. రెండు ధపాలుగా జరిగే ఈ పరీక్షకు ప్రిలిమినరీ పరీక్ష 30 డిసెంబర్ 2023న లో జరుగుతుంది. మేయిన్స్ ఎగ్జామ్ 28 జనవరి 2024 రోజున నిర్వహిస్తారు.
ఐబీపీఎస్ విడుదల చేసిన కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ Specialist Officerలో పోస్టులకు డిగ్రీ / సంబందిత కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 21 అగస్టు 2023 లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ 30 డిసెంబర్ 2023న నిర్వహిస్తారు. అలాగే మేయిన్స్ ఎగ్జామ్ 28 జనవరి 2024 లో నిర్వహిస్తారు. ఎగ్జామ్ యొక్క హాల్‌టికెట్లను పరీక్ష తేది కంటే వారం ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క ఫలితాలను జనవరి 2024 లో ప్రకటిస్తారు. 28 జనవరి 2024న నిర్వహించే మేయిన్స్ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 2024 లో ప్రకటించడం జరుగుతుంది. ఇంటర్యూకు సంబందించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి/మార్చి 2024 లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్యూలను ఫిబ్రవరి / మార్చి 2024 లో నిర్వహించి ఏప్రిల్ 2024 లో అలాట్‌మెంట్ ఇస్తారు.
Also Read : Latest Jobs in Telugu
➠ IBPS Specialist Officer పోస్టుల వివరాలు :
మొత్తం 1402 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఐటీ ఆఫీసర్ (120)
- అగ్రీకల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (500)
- రాజభాష (41)
- లా ఆఫీసర్ (10)
- హెచ్‌ఆర్/పర్సనల్ (31)
- మార్కెటింగ్ (700)
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్స్ విద్యార్హత | |
---|---|
ఐటీ ఆఫీసర్ (120) | కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో 4 సంవత్సరాల ఇంజనీరింగ్/ టెక్నాలజీ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డివోఈఏసీసీ ‘బి’ స్థాయి ఉత్తీర్ణత సాధించిన గ్రాడ్యుయేట్ |
అగ్రీకల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (500) | అగ్రికల్చర్/ హార్టికల్చర్/యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డైరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిస్కికల్చర్/ అగ్రిలో 4 సంవత్సరం డిగ్రీ (గ్రాడ్యుయేషన్). మార్కెటింగ్ అండ్ సహకారం/ సహకారం అండ్ బ్యాంకింగ్/ అగ్రో-ఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్/ ఫుడ్ టెక్నాలజీ/ డైరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్/ ఫిషరీస్ ఇంజినీరింగ్ |
రాజభాష (41) | డిగ్రీ (గ్రాడ్యుయేషన్) స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) స్థాయిలో ఆంగ్లం మరియు హిందీ సబ్జెక్టులుగా సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. |
లా ఆఫీసర్ (10) | న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బి) మరియు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు ఉండాలి. |
హెచ్‌ఆర్/పర్సనల్ (31) | గ్రాడ్యుయేట్ మరియు రెండు సంవత్సరాల పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా రెండు సంవత్సరాల పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / హెచ్‌ఆర్ / హెచ్‌ఆర్‌డీ/ సోషల్ వర్క్ / లేబర్ లా |
ఐటీ (120) | గ్రాడ్యుయేట్ మరియు రెండు సంవత్సరాల పూర్తి సమయం ఎంఎంఎస్(మార్కెటింగ్)/ రెండు సంవత్సరాల పూర్తి సమయం ఎంబీఏ (మార్కెటింగ్)/ రెండు సంవత్సరాల పూర్తి సమయం పీజీడిబిఏ / పీజీడిబిఎం/పీజీపిఎం/పీజీడిఎంతో మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ |
ఐబీపిఎస్ విడుదల చేసిన 1402 స్పెషలిస్టు ఆఫీసర్స్ పోస్టుల భర్తీ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్యూ ద్వారా మూడు దశలలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఐబీపీఎస్ పరీక్షను దేశంలోని 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తారు.
➠ పరీక్ష ఫీజు :
- 850/- జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- 175/- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షా సెంటర్‌లు | ||
---|---|---|
State | Preliminary Exam | Mains Exam |
తెలంగాణ | హైద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ | హైద్రాబాద్ |
ఆంధ్రప్రదేశ్ | చీరాల, చిత్తూర్, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఓంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం | విజయవాడ, విశాఖపట్నం |
➠ వయోపరిమితి :
- అగస్టు 1, 2023 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మద్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.
➠ ఎంపిక ప్రక్రియ :
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ ఎంపిక విధానం మూడు అంచెలలో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. మూడో దశ ఇంటర్యూ ఉంటుంది. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ ఉత్తీర్ణులైనవారికి ఇంటర్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులకు మెయిన్స్ అబ్జెక్టివ్ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్యూలో వచ్చిన మార్కులను 80:20 నిష్పత్తిలో తీసుకొని వాటి ఆధారంగా తుదిఎంపిక చేస్తారు.
Also Read : NIACL Recruitment 2023
ముఖ్యమైన తేదీలు | |
---|---|
నోటిఫికేషన్ విడుదల | 1 అగస్టు 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 1 అగస్టు 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 21 అగస్టు 2023 |
ప్రిలిమ్స్ పరీక్ష తేది | 30, 31 డిసెంబర్ 2023 |
ప్రిలిమ్ పరీక్షా ఫలితాలు | జనవరి 2024 |
మేయిన్స్ పరీక్ష తేది | 28 జనవరి 2024 |
మేయిన్ పరీక్షా ఫలితాలు | ఫిబ్రవరి 2024 |
ఇంటర్యూ నిర్వహించు తేది | ఫిబ్రవరి / మార్చి 2024 |
అలాట్‌మెంట్ | ఏప్రిల్ 2024 |
ఐబీపీఎస్ ద్వారా మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 1402 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల యొక్క భర్తీకి పరీక్ష నిర్వహించనుంది. అవి
1) బ్యాంక్ ఆఫ్ బరోడా2) కెనరా బ్యాంక్
3) ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్
4) యూకో బ్యాంక్
5) బ్యాంక్ ఆఫ్ ఇండియా
6) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
7) పంజబ్ నేషనల్ బ్యాంక్
8) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
9) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
10) ఇండియన్ బ్యాంక్
11) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
➠ ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవడం ఎలా ?
అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు సమర్పించాలి. పరీక్ష ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అభ్యర్థులు ఫోన్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రర్ చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ అందించబడతాయి. అభ్యర్థులు ఐబీపిఎస్ అధికాక వెబ్‌సైట్‌లోకి వెళ్లికుండా ఇక్కడ మేము ధరఖాస్తు లింకు అందించాము. ఐబీపిఎస్ స్పెషలిస్టు ఆఫీసర్స్ 2023 కోసం ధరఖాస్తు చేసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ చేసే సమయంలో పాస్‌పోర్టు సైజు ఫోటో, సంతకం, ఎడమ బొటనవ్రేలి ముద్ర, చేతివ్రాత డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | ఐబీపీఎస్ |
పోస్టు పేరు | స్పెషలిస్టు ఆఫీసర్స్ |
దేశం | ఇండియా |
మొత్తం ఉద్యోగాలు | 1402 |
ఎక్కడ | దేశవ్యాప్తంగా |
పాల్గొనే బ్యాంకులు | 11 |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | ఆన్‌లైన్ |
ఎంపిక ప్రక్రియ | ప్రిలిమ్స్, మేయిన్స్ మరియు ఇంటర్యూ |
విద్యార్హత | ఏదేని డిగ్రీ / సంబందిత విద్యార్హత |
వయోపరిమితి | 20 నుండి 30 సంవత్సరాలు |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 1 అగస్టు 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 21 అగస్టు 2023 |
ప్రిలిమ్స్ పరీక్ష తేది | 30, 31 డిసెంబర్ 2023 |
మేయిన్స్ పరీక్ష తేది | 28 జనవరి 2024 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
జవాబు : IBPS Specialist Officer వివరణాత్మక నోటిఫికేషన్ అగస్టు 2023 రోజున విడుదల చేయబడిరది..
జవాబు : IBPS Specialist Officer కు వయస్సు పరిమితి 20 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్‌లను బట్టి సడలింపు ఉంటుంది.
జవాబు :IBPS Specialist Officer నోటిఫికేషన్‌తో 1402 ఖాళీలు విడుదలయ్యాయి.
జవాబు : IBPS Specialist Officer పరీక్ష ఫీజు ఎస్సీ/ఎస్టీ/వికలాంగుల అభ్యర్థులకు రూ.175/-, మిగతా వారికి 850/-
జవాబు : IBPS Specialist Officer ప్రిలిమినరీ పరీక్ష 30, 31 డిసెంబర్ 2023, మేయిన్ పరీక్ష 28 జనవరి 2024
0 Comments