
క్యాట్ - 2023 నోటిఫికేషన్ విడుదల
CAT 2023: Notification, Eligibility, Registration, Pattern, Syllabus, Preparation || Admissions in Telugu || Jobs in Telugu || Latest Jobs in Telugu
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ మల్టినేషనల్ కంపెనీలలో పనిచేస్తున్న సీఈవోలలో అధిక శాతం ఐఐటీలు, ఐఐఎంలలో చదివిన వారే ఉంటారనేది అతిశయోక్తి కాదు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐ.ఐ.ఎం) లలో ఎంబీఏ పూర్తి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపనీలలో కల్లు చెదిరే వేతనాలు పొందవచ్చు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఐఐఎంలలో సీటు సాధించాలంటే ‘‘క్యాట్’’ (కామన్ అడ్మిషన్ టెస్టు) లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ క్యాట్ -2023 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. క్యాట్ సంబంధించిన అర్హత ప్రమాణాలు, కాలేజీల వివరాలు, ఫీజు, సన్నద్దత వంటి అంశాలు కింద చర్చించడం జరిగింది.
భారతదేశ వ్యాప్తంగా నిర్వహించే క్యాట్ పరీక్షకు కఠినమైన పోటీ ఉంటుంది. పరిమితంగా ఉన్న సీట్ల కోసం ఎన్నో రేట్ల మంది పోటీపడాల్సి వస్తుంది. క్యాట్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత బిజినెస్ స్కూల్స్ స్క్రీనింగ్ టెస్ట్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్‌డిస్కషన్, పర్సనల్ ఇంటర్యూ వంటి వివిధ కేటగిరిలలో జల్లెడ పట్టి మరి ప్రవేశం కల్పిస్తున్నాయి. కాబట్టి క్యాట్‌కు సన్నద్దమయ్యే అభ్యర్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంపొందించుకుంటే ఐఐఎంలలో సీటు సాధించడం సులభం అవుతుంది.
క్యాట్ - 2023 కొరకు ఏదేని డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు 1200, మిగతా వారు 2400 రూపాయలు చెల్లించి 13 సెప్టెంబర్ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. సీబీటి పద్దతిలో 26 నవంబర్ 2023 రోజు పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ క్వశ్చన్స్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీ, రీడిరగ్ కాంప్రహేన్షన్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటీవ్ ఎబిలిటి నుండి ప్రశ్నలు అడుగుతారు.
➺ పరీక్ష ఫీజు :
- 2400/- జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- 1200/- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
➺ పరీక్షా విధానం :
- సీబీటి (కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్)
➺ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు :
- అహ్మదాబాద్
- అమృత్‌సర్
- బెంగళూర్
- బోద్‌గయా
- కోల్‌కటా
- ఇండోర్
- జమ్ము
- కాశ్మీర్
- కోజీకోడ్
- లక్నో
- నాగ్‌పూర్
- రాయ్‌పూర్
- రాంచీ
- రోప్‌తక్
- సాంబాల్‌పూర్
- షిల్లాంగ్
- సిర్మౌర్
- ఉదయ్‌పూర్
- విశాఖపట్నం
➺ అర్హత :
- కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు 45 శాతం) మార్కులతో ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
- చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ సబ్జెక్టులు :
- వెర్బల్ ఎబిలిటీ, రీడిరగ్ కాంప్రహేన్షన్
- లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్
- క్వాంటిటేటీవ్ ఎబిలిటి
➺ పరీక్ష విధానం :
గత ఏడాదిలో వెర్బల్ ఎబిలిటీ, రీడిరగ్ కాంప్రహేన్షన్ నుండి 24 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుండి 20 ప్రశ్నలు, క్వాంటిటేటీవ్ ఎబిలిటి నుండి 22 ప్రశ్నలు మొత్తం 66 ప్రశ్నలతో 198 మార్కులతో 2 గంటలలో పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు కూడా ఇదే పద్దతిలో నిర్వహించవచ్చు.
ముఖ్యమైన తేదీలు | |
---|---|
నోటిఫికేషన్ విడుదల | అగస్టు 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 02 అగస్టు 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 13 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ పేమెంట్ చివరి తేది. | 13 సెప్టెంబర్ 2023 |
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ | 25 అక్టోబర్ నుండి 26 నవంబర్ 2023 వరకు |
పరీక్ష తేది | 26 నవంబర్ 2023 |
కెటగీరి | ఫీజు |
ఎస్సీ / ఎస్టీ / వికలాంగులు | రూ॥ 1200 |
మిగతా వారికి | రూ॥ 2400 |
CAT 2023 పరీక్షా విధానం | |
---|---|
సబ్జెక్టు | సమయం |
వెర్బల్ ఎబిలిటీ, రీడిరగ్ కాంప్రహేన్షన్ | 40 నిమిషాలు |
లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ | 40 నిమిషాలు |
క్వాంటిటేటీవ్ ఎబిలిటి | 40 నిమిషాలు |
మొత్తం | 120 నిమిషాలు |
కెటగిరి | అడ్మిషన్స్ |
పేరు | ‘‘క్యాట్’’ (కామన్ అడ్మిషన్ టెస్టు) -2023 |
దేశం | ఇండియా |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | సీబీటీ |
ఎక్కడ | దేశవ్యాప్తంగా |
విద్యార్హత | ఏదేని డిగ్రీ |
ఫీజు | 1200 / 2400 |
ధరఖాస్తు ప్రారంభం | 02 అగస్టు 2023 |
ధరఖాస్తు ముగింపు | 20 సెప్టెంబర్ 2023 |
పరీక్ష | 26 నవంబర్ 2023 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
0 Comments