
IIT JAM - 2024 Admissions - 2024
ఐఐటీ జామ్ - 2024 నోటిఫికేషన్ విడుదల
Admissions in Telugu || Jobs in Telugu || Latest Jobs in Telugu
బయోటెక్నాలజీ, సైన్సెస్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీలో ప్రవేశం పొందడానికి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) - 2024 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిని 2024 లో ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తుంది. ఈ జామ్ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్), ఎంఎస్ ( రీసెర్చ్), జాయింట్ /డ్యూయల్ డిగ్రీ ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ -ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటేడ్ పీహెచ్‌డీలలో ప్రవేశం పొందవచ్చు. ఈ జామ్‌లో సాధించిన స్కోర్ ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీలలో పీజీ కోర్సులలో దాదాపు 3000 సీట్లు భర్తీ చేస్తారు. దీనితో పాటు నిట్‌లు, ఐఐఎస్సీ, ఐఐఈఎస్‌టీ, డిఐఏటీ, ఐఐపీఈ, జేఎన్‌సీఏఎస్‌ఆర్, ఎస్‌ఎల్‌ఐఈటీ తో పాటు ప్రముఖ సంస్థల్లో సీట్ల భర్తీకి జామ్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
Joint Admission test for Masters (JAM) - 2024 రాయలనుకునే అభ్యర్థులు వారు ఎంచుకున్న పరీక్షలను బట్టి సంబందిత సబ్జెక్టులలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. జామ్ పరీక్షను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా నిర్వహిస్తారు. మల్టిపుల్ ఆప్షన్స్ పద్దతిలో పేపర్ ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలకు గాను 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
Joint Admission test for Masters (JAM) - 2024 పరీక్షను రెండు పేపర్ల విధానంలో నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ఒక పేపర్‌కు రూ॥1800/-లు, రెండు పేపర్లకు రూ॥2500/- లు చెల్లించి ధరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్‌లను బట్టి ఫీజులో రాయితీ ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 13, 2023 లోగా ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవాలి. హాల్‌టికెట్లను 08 జనవరి 2024 నుండి అందుబాటులో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూర్, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం పరీక్షా కేంద్రాలున్నాయి.
Also Read : Gk Questions in Telugu
జామ్ యొక్క పరీక్షను 11 ఫిబ్రవరి 2024 రోజున సీబీటి విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు స్కోర్ కార్డులను 02 ఏప్రిల్ నుండి 21 జూలై 2024 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
➺ జామ్ కోర్సులు :
- ఎమ్మెస్సీ
- ఎమ్మెస్సీ (టెక్)
- ఎంఎస్ ( రీసెర్చ్)
- జాయింట్ /డ్యూయల్ డిగ్రీ ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ
- ఎమ్మెస్సీ -ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ
- ఇంటిగ్రేటేడ్ పీహెచ్‌డీ
వీటితో పాటు
- నిట్‌లు
- ఐఐఎస్సీ
- ఐఐఈఎస్‌టీ
- డిఐఏటీ
- ఐఐపీఈ
- జేఎన్‌సీఏఎస్‌ఆర్
- ఎస్‌ఎల్‌ఐఈటీ
➺ పరీక్ష ఫీజు :
- 1800/- (ఒక పేపర్‌కు), 2500/- (రెండు పేపర్లు) - జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- 900/- (ఒక పేపర్‌కు), 1250/- (రెండు పేపర్లు) - మహిళలు/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
➺ అర్హత :
- ఎంచుకున్న కోర్సుల వారీగా సంబందిత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
➺ పరీక్షా విధానం :
జామ్ పరీక్షను ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఉదయం కెమిస్ట్రీ, జియాలజీ, మేథమెటిక్స్, మధ్యాహ్నం బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మేథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ పేపర్లుంటాయి.
Also Read : Latest Jobs in Telugu
➺ పరీక్షా కేంద్రాలు :
తెలంగాణ
- హైద్రాబాద్
- వరంగల్
- కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
- గుంటూర్
- ఒంగోలు
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
ముఖ్యమైన తేదీలు | |
---|---|
నోటిఫికేషన్ విడుదల | సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 05 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 13 అక్టోబర్ 2023 |
ఆన్‌లైన్ పేమెంట్ చివరి తేది. | 13 అక్టోబర్ 2023 |
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ | 08 జనవరి 2024 |
పరీక్ష తేది | 11 ఫిబ్రవరి 2024 |
ఫలితాలు విడుదల | 22 మార్చి 2024 |
స్కోర్ కార్డు డౌన్‌లోడ్ | 02 ఏప్రిల్ నుండి 31 జూలై 2024 వరకు |
జామ్ టెస్ట్ పేపర్స్ |
---|
బయో టెక్నాలజీ |
కెమిస్ట్రీ |
ఎకనామిక్స్ |
జీయోలాజీ |
మ్యాథమేటిక్స్ |
మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్ |
ఫిజిక్స్ |
కెటగీరి | ఒక పేపర్ | రెండు పేపర్లు |
మహిళలు / ఎస్సీ / ఎస్టీ / వికలాంగులు | రూ॥ 900 | రూ॥1250 |
మిగతా వారికి | రూ॥ 1800 | రూ॥ 2500 |
సెషన్ | టెస్ట్ పేపర్స్ |
ఉదయం | కెమిస్ట్రీ, జీయోలాజీ, మ్యాథమేటిక్స్ |
మధ్యాహ్నం | బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ |
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | ఐఐటీ మద్రాస్ |
పేరు | జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) - 2024 |
దేశం | ఇండియా |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | సీబీటీ |
ఎక్కడ | దేశవ్యాప్తంగా |
విద్యార్హత | సంబందిత సబ్జెక్టులో డిగ్రీ |
ధరఖాస్తు ప్రారంభం | 05 అగస్టు 2023 |
ధరఖాస్తు ముగింపు | 13 అక్టోబర్ 2023 |
పరీక్ష | 11 ఫిబ్రవరి 2024 |
Notification కొరకు | Click Here |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
0 Comments