
మూలధన మార్కెట్ - స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు
India Economy|| India Gk in Telugu || General Knowledge in Telugu ||
మూలధన మార్కెట్‌లో స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు ప్రధాన భాగంగా ఉంటాయి. ఈ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లను సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారు. స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు దేశ ఆర్థిక స్థితికి సూచికగా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లో చేర్చిన సెక్యూరిటీలకు మూలధన మార్కెట్‌లో న్యాయబద్ధమైన ధర లభిస్తుంది. పన్నుల విధింపులో కొన్ని రాయితీలు ఉంటాయి. సెక్యూరిటీలు ఉన్న కంపెనీలకు వ్యాపార వర్గాల్లో నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందుకే మూలధన మార్కెట్‌లో స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు ముఖ్య భూమికను పోషిస్తాయి. పోటీపరీక్షలలో కూడా ఈ విభాగంపై అధిక ప్రశ్నలు వస్తాయి.
➺ భారతదేశం - స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు :
భారతదేశంలో 1939 సంవత్సరంలో 7 స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు ఉండగా 1945 సంవత్సరంలో 21 ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 8 స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు ఉన్నాయి. వీటిలో 5 మాత్రమే శాశ్వతమైనవి. వీటికి స్టాక్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తింపు ఇస్తుంది.
1) బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ :
ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో ఏర్పాటైన మొట్టమొదటి స్టాక్ ఎక్ఛ్సేంజ్. దీనిని 1875 సంవత్సరంలో ‘‘ది నేషనల్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్’’ పేరుతో ప్రేమ్‌చంద్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉంది.
2) అహ్మదాబాద్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (1894)
3) కోల్‌కటా స్టాక్ ఎక్ఛ్సేంజ్ (1908)
4) మగధ్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు (1986)
5) నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (1992)
దీనిని 1992 సంవత్సరంలో మనోహర్ జే.ఫెర్మానీ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం మహరాష్ట్ర రాజధాని ముంబాయిలో ఉంది.
➺ ప్రపంచంలో ముఖ్యమైన స్టాక్ మార్కెట్ సూచికలు :
- డోజోన్స్ (న్యూయార్క్)
- నిక్కీ (టోక్యో)
- హంగ్‌సెంగ్ (హాంగ్‌కాంగ్)
- డోలెక్స్,
- సెన్సెక్స్
- నిఫ్టీ ఫిప్టీ
➺ భారతదేశంలో స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు అనుసరించే సూచికలు :
➠ సెన్సెక్స్
దీనికి మరోపేరు సెన్సీటీవ్ ఇండెక్స్. ఇది బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌కు చెందినది. ఇందులో ప్రాతినిధ్య సంస్థ సంఖ్య 30 వరకు ఉన్నాయి. ఇది 1978 - 79 ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తుంది.
➠ నేషనల్ ఇండెక్స్
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌కి చెందిన మరో సూచిక. దీనికి ప్రాతినిధ్య సంస్థలు 100 వరకు ఉన్నాయి.. ఇది 1983-84 ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తుంది.
➠ బీఎస్‌ఈ 200
ఈ సూచికలోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 200 వరకు ఉంటుంది. ఇది 1989-90ని ఆధార సంవత్సరంగా తీసుకుంటుంది. ఇందులో దాదాపు 21 వరకు ప్రభుత్వ రంగ సంస్థలు వాటాలు నమోదై ఉన్నాయి.
➠ డాలెక్స్
బీఎస్‌ఈ 200 డాలర్ విలువను డాలెక్స్ అంటారు. దీని ఆధార సంవత్సరం 1989-90.
➠ బాంకెక్స్
ఇది 2003 నుండి అమల్లో ఉంది. దీనిలో 10 బ్యాంకుల వాటాలు కల్గి ఉంది.
➠ నిఫ్టీ ఫిఫ్టీ
ఈ సూచికను ఎన్‌ఎస్‌ఈ ఉపయోగిస్తుంది. దీనిలో 50 వరకు ప్రాతినిధ్య సంస్థలు వాటాలు ఉన్నాయి.
➺ కమోడిటీ మార్కెట్ :
కమోడిటీ మార్కెట్‌లో వస్తువుల ధరలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. అమ్మకం, కొనుగోలుదారులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ధరలను ముందుగా అంచనా వేస్తారు. దానికి అనుగుణంగా వారు సంబందిత వస్తువుకు రాబోయే కాలంలో ఉన్న పరిస్థితిని అంచనా వేసి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలాంటి ఒప్పందాలను కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్ అంటారు.
వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడిచమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు వంటి వస్తువులపై భవిష్యత్తు అంచనాపై వ్యాపారం కొనసాగుతుంది. ఈ మార్కెట్‌కు చెందిన ఎక్చ్సేంచ్‌లను కమోడిటీ ఎక్ఛ్సేంజ్‌లు అంటారు.
భారతదేశంలో నేషనల్ మల్టీ కమోడిటీ ఎక్ఛ్సేంచ్, ఎంసీఎక్స్, నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటీవ్స్ ఎక్ఛ్సేంజ్ లిమిటెడ్, ఏసీఈ వంటి కమోడిటీ ఎక్ఛ్సేంజ్‌లు ఉన్నాయి.
➺ క్రిసిల్ (క్రేడిట్ రేటీంగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) :
దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబాయి లో ఉంది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి రేటింగ్ ఏజేన్సీ. ఇది సంస్థల వ్యాపార నష్టభయం, నిర్వహణ నష్టభయం, ఆర్థిక నష్టభయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రేటింగ్ ఇస్తుంది.
0 Comments