
పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సుల్లో ఎంట్రన్స్ కొరకు
గేట్ - 2024 నోటిఫికేషన్ విడుదల
Admissions in Telugu || Jobs in Telugu
Gate 2024 in Telugu : భారతదేశంలో ప్రఖ్యాతిపొందిన విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సుల్లో ఎంట్రన్స్ కొరకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే Gate 2024 కొన్ని కంపెనీలలో ఉద్యోగాలు పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన, కఠినమైన పరీక్ష గేట్. గేట్ ఎంట్రన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్ / ఫార్మసీ విభాగాల్లో పీజీల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా బీహెచ్‌ఈఎల్, గెయిల్, ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, సీవోఏఎల్, ఎన్‌హెచ్‌ఏలు, ఎన్‌ఎండీసీ, ఓఎన్‌జీసీ, మహారత్న, నవరత్న వంటి ప్రసిద్ద కంపెనీలు కూడా గేట్ స్కోరు ప్రమాణికంగా తీసుకొని ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పిస్తాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షను బెంగళూర్‌లోని ఐఐఎస్సీతో పాటు ఏడు ఐఐటీలు (బాంబే, ఢల్లీి, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ) కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ సంవత్సరం బెంగళూరులోని ఐఐఎస్సీ ఆర్గనైజింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తుంది.
Gate 2024 ఎంట్రన్స్ టెస్ట్ వ్రాయలనుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హూమానిటీస్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 1800 (రిజర్వేషన్‌లు బట్టీ ఫీజులో రాయితీ ఉంటుంది) చెల్లించి 29 సెప్టెంబర్ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2024 పరీక్షలను 3, 4, 10, 11 ఫిబ్రవరి 2024 తేదిల్లో నిర్వహిస్తారు.
గేట్ పరీక్ష పూర్తిగా మల్టిఫుల్ ఛాయిస్ పద్దతిలో నిర్వహిస్తారు. మొత్తం 65 ప్రశ్నలకు గాను 100 మార్కులుంటాయి. ఈ పరీక్షను 3 గంటలలో పూర్తి చేయాలి. జనరల్ అప్టిట్యూడ్, ఇంజీనిరింగ్ నుండి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. గేట్ పరీక్షను అభ్యర్థులు రెండు పేపర్లలో రాసే అవకాశం ఉంటుంది. గేట్ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు 1 లేదా 2 సంవత్సరాలు ఉంటుంది.
Also Read : Gk Questions in Telugu
➺ Gate 2024 అర్హత :
- టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, ఇంజనీరింగ్, హ్యూమానిటీస్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
- చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ Gate 2024 పరీక్ష ఫీజు :
- 1800/- జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- 900/- మహిళలు/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
ఆలస్య రుసుముతో
- 2300/- జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- 1400/- మహిళలు/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
➺ Gate 2024 ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
➺ Gate 2024 పరీక్షా విధానం :
గేట్ పరీక్ష మొత్తం 65 ప్రశ్నలకు గాను 100 మార్కులతో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. రెండు పేపర్లలో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు ఒకటి లేదా రెండు పేపర్లు వ్రాసే అవకాశం ఉంటుంది. గేట్ 2024 నుండి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నుండి కూడా ప్రశ్నలు అడుగుతారు. గేట్ పరీక్షలో నెగెటీవ్ మార్కుల విధానం ఉంటుంది. ఒక తప్పు సమాధానంకు 33.33 శాతం ఋణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మార్కులు తగ్గుతాయి. న్యూమరికల్ బహుళ ఎంపిక ప్రశ్నలకు ఋణాత్మక మార్కులు ఉండవు. ఈ పరీక్షను అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు.
ఎ) బహుళైచ్చిక ప్రశ్నలు
నాలుగు ఆప్షన్‌లు ఇస్తారు. అందులో ఒకటి మాత్రమే సరైన సమాధానం అభ్యర్థులు సరైన సమాధానాన్ని మాత్రమే గుర్తించాలి.
బి) బహుళ ఎంపిక ప్రశ్నలు
ఇవి కూడా బహుళైచ్చిక ప్రశ్నల్లానే ఉంటాయి. కానీ ఇందులో ఒకటికంటే ఎక్కువ ఆప్షన్‌లుంటాయి. సమాధానంలో అన్ని సరైన ఆప్షన్‌లను గుర్తించాలి.
సి) సంఖ్యా (న్యూమరికల్) సమాధాన ప్రశ్నలు
ఇందులో ఎలాంటి ఆప్షన్‌లు ఉండవు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్ కీబోర్డు ఉపయోగించి రాయాలి. సమాధానంలో పక్కన యూనిట్‌లను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దగ్గర స్థాయిలో స్థాయిలో ఇవ్వవచ్చు. సరైన సమాధానం 92.24 అనుకుంటే 92.23 నుండి 92.25 మధ్యలో రాసిన మార్కులు ఇస్తారు.
పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను తీసుకెళ్లడానికి వీలులేదు. అభ్యర్థులు కాలిక్యులేషన్స్ చేసుకోవడానికి వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. వర్చువల్ క్యాలిక్యులేటర్ అన్ని రకాల ఫంక్షన్స్ లేకపోవడం వల్ల దానికి తగ్గట్లుగా ప్రశ్నలు అడుగుతారు. గేట్ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు 1 లేదా 2 సంవత్సరాలు ఉంటుంది.
Also Read : Gk in Telugu
➺ Gate 2024 పరీక్షా కేంద్రాలు :
తెలంగాణ
- హైద్రాబాద్
- మెదక్
- నల్గొండ
- అదిలాబాద్
- కరీంనగర్
- ఖమ్మం, కొత్తగూడెం
- నిజామాబాద్
- సూర్యాపేట
- వరంగల్
ఆంధ్రప్రదేశ్
- చీరాల
- చిత్తూర్
- గూడూర్
- గుంటూర్
- కడప
- నెల్లూర్
- ఒంగోలు
- తిరుపతి
- ఏలూరు
- కాకినాడ
- సూరంపాలెం
- రాజమహేంద్రవరం
- శ్రీకాకుళం
- తాడేపల్లిగూడెం
- విజయవాడ
- విశాఖపట్నం
- విజయనగరం,
- అనంతపూర్
- కర్నూలు
కెటగిరీ | సాధారణ ఫీజు | ఆలస్య రుసుముతో |
మహిళలు/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు | 900/- | 1400/- |
మిగతా వారికి | 1800/- | 2300/- |
ముఖ్యమైన తేదీలు | |
---|---|
నోటిఫికేషన్ విడుదల | అగస్టు 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 24 అగస్టు 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 29 సెప్టెంబర్ 20233 |
ఆలస్య రుసుముతో చివరి తేది | 13 అక్టోబర్ 2023 |
సవరణలకు చివరి తేది. | 7 నుండి 11 నవంబర్ 2023 |
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ | 03 జనవరి 2024 |
పరీక్ష తేది | 3, 4, 10, 11 ఫిబ్రవరి 2024 |
ఫలితాలు విడుదల | 16 మార్చి 2024 |
స్కోర్ కార్డు డౌన్‌లోడ్ | 23 మార్చి 2024 |
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | గేట్ |
పేరు | గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2024 |
దేశం | ఇండియా |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | సీబీటీ |
ఎక్కడ | దేశవ్యాప్తంగా |
విద్యార్హత | సంబందిత సబ్జెక్టులో డిగ్రీ |
పరీక్ష ఫీజు | 900 / 1800 |
ధరఖాస్తు ప్రారంభం | 24 అగస్టు 2023 |
ధరఖాస్తు ముగింపు | 29 సెప్టెంబర్ 2023 |
పరీక్ష | 3, 4, 10, 11 ఫిబ్రవరి 2024 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
0 Comments