జ్ఞానేంద్రియాలు
Sense Organs in Telugu
మానవ శరీరంలోని ముఖ్యమైన ఐదు భాగాలను జ్ఞానేంద్రియాలు అని పిలుస్తారు. అవి
1) కన్ను
2) ముక్కు
3) చెవి
4) నాలుక
5) చర్మం
ఇవి మాననవ శరీరంలో ముఖ్య భూమికను పోషిస్తాయి.
1) కన్ను :
సర్వేంద్రియాం నయనం ప్రధానం అంటారు. మన శరీరంలో కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను లేకపోతే ప్రపంచాన్ని చూడలేము.కన్ను లేకపోతే ప్రపంచమంతా చీకటీగా కనిపిస్తుంది. కన్ను, కంటికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘‘ ఆప్తమాలజీ ’’ అంటారు. మానవ శరీరంలోనే ముఖ్యమైనదిగా పేర్కొనే కన్ను నిర్మాణంలో బయటి పొర (ధృడస్తరం), మధ్యపొర (రక్తనాళాలు), లోపలి పొర (నేత్రపటలం, రెటీనా) అనే మూడు పొరలుంటాయి. కనుపాప మధ్యలో మనకు కనిపించే గుండ్రటి రంధ్రాన్ని ‘‘తారక (ఐరిస్)’’ అంటారు. కంటి లోపలి పొర అయిన రెటీనాలో 1) దండకణాలు 2) శంఖుకణాలు అనే రెండు కణాలుంటాయి.
దండకణాలు రొడాప్సిన్ వర్ణకాన్ని కల్గి ఉంటాయి. విటమిన్ `ఎ తీసుకోవడం వల్ల రొడాప్పిస్ పెంపొందించుకోవచ్చు. ఇవి నలుపు, తెలుపు రంగులు చూడడానికి ఉపయోగపడతాయి. గుడ్లగూబ, గబ్బిలం వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
శంఖ కణాలు ఐడాప్సిన్ అనే వర్ణకాన్ని కల్గి ఉంటాయి. ఇవి ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను గుర్తించుటకు సహాయపడతాయి. దండకణాలు, శంఖు కణాలు లేని ప్రాంతాన్ని అంధ చుక్క అంటారు. ఈ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు.
కనుచూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొరను రెటీనా అని పిలుస్తారు. 1 సెకను కాలంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. మానవ శరీరంలోని కన్ను 16 రకాల రంగులను గుర్తించగల్గుతుంది. కన్నులోని 6 కండరాల ఏకకాలంలో పనిచేస్తే కనుగుడ్డు కదులుతుంది. నేత్రదానం ఇచ్చే సమయంలో కన్నులోని కార్నియా భాగాన్ని విడదీస్తారు. పుస్తకం పఠించేటప్పుడు కన్నుకు, పుస్తకానికి కనీసం 30 సెంటిమీటర్ల దూరం ఉండాలి. అలాగే టివికి కన్నుకు 2.5 మీటర్ల దూరం నుండి చూడాలి. కనురెప్పలు లేని జంతువులు పాములు, చేపలు. కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులను లాక్రిమల్ గ్రంథులు అంటారు.
➠ కంటికి వచ్చే వ్యాదులు :
- గ్లూకోమా
- హస్వదృష్టి
- దూరదృష్టి
- అస్థిగ్మాటిజమ్
- ప్రెస్ బయోఫియా
- స్ట్రా బిస్‌మాస్
- కెరటో మలాసియా
- ట్రాకోమా
- కాటరాక్ట్ (శుక్లాలు)
- కంజెక్టివైటిస్ (కళ్లకలక)
- గ్జెరాప్తాల్మియా (పొడికళ్లు)
- వర్ణాంధత్వం
2) చెవి :
చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. మనకు బయటకు కనిపించే భాగాన్ని చెవి దొప్ప అంటారు. మధ్య చెవిలో దాగలి కూటకము, కర్ణాంతరాస్థి అనే భాగాలు గొలుసులుగా పనిచేస్తాయి. ఇవి శబ్ద తరంగాలను గ్రహించి లోపలి చెవిలోకి పంపిస్తాయి. మానవ శరీరంలో అతిచిన్న ఎముకగా ఈ కర్థాంతరాస్థిని పిలుస్తారు. శబ్దాలను గ్రహించే లోపలి చెవిలో అస్థిగహనం, త్వచగహనం అనే రెండు భాగాలు ఉంటాయి. చెవి దగ్గర పెరోటిడ్ అనే గ్రంథులుంటాయి. మొత్తం 6 ఎముకలతో చెవి నిర్మాణం ఉంటుంది.
3) నాలుక :
నాలుక రుచిని గ్రహిస్తుంది. రుచిని గ్రహించే గ్రాహకాలను జిహ్వ గ్రాహకాలు అంటారు. ఇవి నాలుకపై ఉండే రుచి కళికల్లో ఉంటాయి. రుచికళికలు పులుపు, చేదు, తీపి, ఉప్పు వంటి రుచులను గ్రహిస్తాయి. నాలుక ముందు భాగం తీపి, ఉప్పును, పక్కభాగం పులుపును, లోపలిభాగం చేదును గ్రహిస్తాయి.
4) చర్మము :
మానవ శరీరంలో అతిపెద్ద అవయవము చర్మం. చర్మము గురించి అధ్యయం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. చర్మంలో రెండు భాగాలుంటాయి. 1) బాహ్య చర్మం (ఎపిడెర్మిస్) 2) అంతర చర్మం (ఎండోడెర్మిస్)
➠ బాహ్య చర్మం (ఎపిడెర్మిస్) :
చర్మం యొక్క బయటి పొరను బాహ్యచర్మంగా పిలుస్తారు. ఇది నిర్జీకణాలతో ఏర్పడుతుంది. ఈ పొరలో ‘‘కెరాటిన్’’ అనే ప్రోటీన్ ఉంటుంది. గోళ్లు, కొమ్ములు, రోమాలలో కూడా ఈ ప్రొటీన్ కనిపిస్తుంది. చర్మంపై ఉండే రోమాలకు ‘‘మెలనిస్’’ అనే వర్ణ పదార్థం ఉండడం వల్ల మనకు రంగులో కనిపిస్తుంది. ఈ మెలరిన్ పదార్థం లేని వారు మనకు తెల్లగా కనిపిస్తారు. ఇలా కనిపించే వారిని ‘‘ఆల్బినోలు’’ అంటారు. భాహ్యచర్మంలో కార్నియస్ అనే పొర ఉంటుంది. ఇది అరచేతులమీద, అరికాళ్లమీద కనిపిస్తుంది.
➠ అంతర చర్మం (ఎండోడెర్మిస్)
దీనిలో స్వేదగ్రంథులు, సెబేసియన్ గ్రంథులు, రక్తనాళాలు, నాడులు, కొవ్వు కణజాలం వంటితో నిర్మించబడి ఉంటుంది. స్పర్శను గ్రహించే గ్రాహాకాలు అంతర చర్మంలో ఉంటాయి. ఈ గ్రాహకాలు వేళ్లకొనమీద, పెదవులపై కనిపిస్తాయి. అందువల్లనే మనము చేతివేళ్లతో, పెదవులతో ముట్టుకున్నవాటిని తొందరగా గుర్తుపడతాము. లోపలి సజీవ కణాలు గల పొరను మాల్ఫీజియన్ పొర / జనన స్తరము అని పిలుస్తారు. మాల్ఫీజియన్ పొర, రాలిపోయిన కార్నియస్ పొరలోని కణాలను తిరిగి ఏర్పరుస్తుంది.
చర్మంలోని గ్రంథులు
➠ సెబేషియస్ గ్రంథి (తైల గ్రంథి)
ఇది మానవ శరీరంపై ఉన్న చర్మం ఎండిపోకుండా చేస్తుంది. సెబేషియా గ్రంథులు సెబం అనే తైల పదార్థాన్ని స్రవించి రోమాలను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది.
➠ స్వేద గ్రంధి
రక్తంలో ఎక్కువగా ఉన్న నీరు, సోడియం క్లోరైడ్, యూరియా, యూరేట్లను బయటకు పంపించే గ్రంథిని స్వేదగ్రంథి అంటారు. ఏనుగులు, కుక్కలకు స్వేద గ్రంథులు ఉండవు. అలాగే ఒంటె క్రీయాశీలకంగా ఉంటుంది. మానవ శరీంలో అరిచేయి, అరికాలు ప్రాంతంలో ఎక్కువగా స్వేధగ్రంథులు కనిపిస్తాయి. తక్కువగా పెదవులపై కనిపిస్తాయి.
➠ చర్మవ్యాదులు :
- గజ్జి
- తామర (రింగ్ వార్మ్)
- ఫెల్లగ్రా
- ఎగ్జిమా
- సొరియాసిస్
- ఎక్‌ని (మొటిమలు)
- కుష్టు
- ప్రూరైటిస్ (దురదలు)
5) ముక్కు :
ముక్కు గురించి అధ్యయం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. ఇది వాసనను పసిగట్టే జ్ఞానేంద్రియం వాసనను గుర్తించే గ్రాహాకాలను ఘ్రాణ గ్రాహకాలు అంటారు. ఇవి ముక్కులోని శ్లేష్మస్తరంలో ఉంటాయి. ఈ ఘాణ గ్రాహకాలు పాము, కుక్క, పాములలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఘాణ గ్రాహకాలు మనుషుల కంటే కుక్కలలో 40 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే ఇవి ప్రకృతి వైపరిత్యాలు గుర్తించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో సహకరిస్తాయి.
0 Comments