Kotak Kanya Scholarship online apply, Eligibility, Last Date || కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

Kotak Kanya Scholarship in Telugu 

కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 
Scholarships in Telugu || Degree Scholarships  

ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు తాము చదువుతున్న కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తుంటారు.  కానీ  వారిలో కొంత మంది మాత్రమే ఉన్నత చదువులు చదువుతుంటారు. దీనికి కారణం వారి యొక్క పేదరికం మరియు ఆర్థిక స్థోమత ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.  ప్రధానంగా రూరల్‌ ప్రాంతాలలో చదివే అమ్మాయిలు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటి నిరుపేద అమ్మాయిల కొరకు సహాయం అందించడం కోసం కోటక్‌ మహీంద్రా ఎడ్యూకేషన్‌ ఫౌండేషన్‌ తమ వంతు కృషి చేస్తుంది. నిరుపేద, ఆర్థికంగా వెనుబడిన అమ్మాయిలకు కోటక్‌ మహీంద్రా ఎడ్యూకేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. దీనికి సంబందించిన వివరాలు కింద చర్చించడం జరిగింది. 

కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌ ద్వారా 12వ తరగతి ఉత్తీర్ణులై ప్రఖ్యాతి పొందిన కాలేజీలలో  ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు (ఇంజినీరింగ్‌, ఎంబిబిఎస్‌, ఆర్కిటెక్చర్‌, డిజైన్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బి మొదలైన వాటితో సహా) అభ్యసించే బాలికా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. వారి యొక్క గ్రాడ్యుయేషన్‌ (డిగ్రీ) పూర్తయ్యే వరకు వారి విద్యా ఖర్చులకు గాను  సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తుంది. అర్హులైన బాలికా విద్యార్థులు 30 సెప్టెంబర్‌ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అమ్మాయిలకు ఎంపికైన అమ్మాయిలకు కోర్సు పూర్తి అయ్యేంత వరకు ట్యూషన్‌ ఫీజు, హస్టల్‌ ఫీజు, ఇంటర్నేట్‌, రవాణా, ల్యాప్‌టాప్‌, బుక్స్‌, స్టేషనరీ వంటి ఖర్చుల కొరకు సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు. 


Also Read : Gk Questions in Telugu 


➺ కోటక్‌ మహీంద్రా గ్రూప్‌ గురించి :

1985లో స్థాపించబడిన కోటక్‌ మహీంద్రా గ్రూప్‌ భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థలలో  ఒకటి. ఫిబ్రవరి 2003లో కోటక్‌ మహీంద్రా ఫైనాన్స్‌ లిమిటెడ్‌, గ్రూప్‌ యొక్క ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ని పొందింది, ఇది బ్యాంక్‌గా మార్చిన భారతదేశంలో మొట్టమొదటి నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ. కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌ అనేది కోటక్‌ మహీంద్రా గ్రూప్‌ కంపెనీలు మరియు కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ యొక్క సహకార ప్రాజెక్ట్‌. ఇది ఆర్థికంగా వెనబడిన యువత,  విద్యార్థులకు చదువు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పలు కార్యక్రమాలు చేపడుతుంది. కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌ ను అందిస్తుంది. 


➺ Kotak Kanya Scholarship 2023 అర్హత ప్రమాణాలు :

  • భారతీయులు అయి ఉండాలి. 
  • బాలికా విద్యార్థులు అయి ఉండాలి. 
  • ఈ క్రింది ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొంది ఉండాలి. 

ఎ) డిజైన్‌ 

బి) ఆర్కిటెక్చర్‌ 

సి) ఎంబీబీఎస్‌ 

డి) ఇంజనీరింగ్‌ 

ఇ) ఇంటిగ్రేటేడ్‌ ఎల్‌ఎల్‌బీ 

  • 12వ తరగతి (ఇంటర్మిడియట్‌) లో 85 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి 
  • సంవత్సర ఆదాయం 3.20 లక్షల కంటే తక్కువగా ఉండాలి 

నోట్‌-(కోటక్‌ మహీంద్రా గ్రూప్‌, కోటక్‌ ఎడ్యూకేషన్‌ ఫౌండేషన్‌, బడ్డీ4స్టడీకి సంబందించిన ఉద్యోగుల పిల్లలు  అనర్హులు )


➺ ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ 


➺ Kotak Kanya Scholarship 2023 స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • ఎంపికైన అమ్మాయిలు కోర్సు పూర్తయ్యే వరకు 1.5 లక్షల రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 
  • ఈ స్కాలర్‌షిప్‌లను విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు, హస్టల్‌ ఫీజు, ఇంటర్నేట్‌, రవాణా, ల్యాప్‌టాప్‌, బుక్స్‌, స్టేషనరీ వంటి వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. 


➺ Kotak Kanya Scholarship 2023 కోసం కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • 12వ తరగతి మార్కుల మెమో  
  • ఆదాయ ధృవీకరణ పత్రము
  • కాలేజీ ఫీజు రశీదు / డిమాండ్‌ రశీదు 
  • బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ 
  • కాలేజీ సీటు అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ 
  • కాలేజ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ స్కోర్‌ కార్డు 
  • అభ్యర్థి ఆధార్‌ కార్డు
  • బ్యాంక్‌ ఖాతా 
  • పాస్‌పోర్టు సైజు ఫోటో 

➺ ముఖ్యమైన తేదీలు:

  • 30 సెప్టెంబర్‌  2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 


కెటగిరి స్కాలర్‌షిప్‌
పేరు కోటక్‌ కన్యా స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ - 2023
సంస్థ కోటక్‌ మహీంద్రా గ్రూప్‌
ఎవరి కోసం డిగ్రి మొదటి సంవత్సరం విద్యార్థులు
దేశం ఇండియా
అర్హులు బాలికా విద్యార్థులు
స్కాలర్‌షిప్‌ మొత్తం 1.5 లక్షలు
వార్షికాదాయం 3.20 లక్షల లోపు
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
అఖరు తేది 30 సెప్టెంబర్‌ 2023
పూర్తి సమాచారం కోసం Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తు కొరకు Click Here
1) Kotak Kanya Scholarship 2023 ఎంపిక విధానం ఎలా ఉంటుంది ?

జవాబు : Kotak Kanya Scholarship 2023 ఎంపిక అకడమిక్‌ ఇయర్‌లో సాధించిన ప్రతిభ మరియు కుటుంబ ఆర్థిక పరిస్థిలను బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. .

2) Kotak Kanya Scholarship 2023స్కాలర్‌షిప్‌ను ఎప్పటివరకు అందజేస్తారు ?

జవాబు : విద్యార్థుల కోర్సు పూర్తి అయ్యేంతవరకు సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలను స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు.

3) ఒకవేళ Kotak Kanya Scholarship 2023 ఎంపికైతే నాకు స్కాలర్‌షిప్‌ రూపాయలు ఎలా అందిస్తారు ?

జవాబు :ఎంపికైన విద్యార్థులకు నేరుగా బ్యాంక్‌ ఖాతాలోకి జమచేయబడతాయి. ‌

4) ఇంటర్మిడియట్‌ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్‌ వచ్చింది. నేను ధరఖాస్తు చేసుకోవచ్చు.

జవాబు : అవును, చేసుకోవచ్చు.

5) Kotak Kanya Scholarship 2023 ఏ తేదిలోగా ధరఖాస్తు చేసుకోవాలి ?

జవాబు : Kotak Kanya Scholarship 2023 కొరకు 30 సెప్టెంబర్‌ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.

Post a Comment

0 Comments