India Post GDS Jobs in Telugu || Post Office GDS Recruitment Notification Out || గ్రామీణ డాక్‌ సేవక్‌ జాబ్స్‌ || Jobs in Telugu || Latest Jobs in Telugu

India Post GDS Jobs in Telugu


India Post GDS Recruitment 2023 || Jobs in Telugu || Latest Jobs in Telugu 

10వ తరగతితో కేంద్ర కొలువు 

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 30,041 జీడిఎస్‌ పోస్టులకు నోటిఫకేషన్‌ విడుదల 

తెలంగాణలో 961, 

ఆంధ్రప్రదేశ్‌లో 1058 పోస్టుల భర్తీ 

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీ నోటిఫికేషన్‌ 

భారతదేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిల్‌లో ఖాళీగా 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడిఎస్‌) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేయబడినది. కేవలం పదవ తరగతిలో సాధించిన మార్కులతో జీడిఎస్‌ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు పోస్టాఫిసులలో బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి వేతనం చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 23 అగస్టు 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 

తాజాగా పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసిన 30,041 GDS పోస్టులలో ఆంధ్రప్రదేశ్‌లో 1058 ఉండగా, తెలంగాణలో 961 పోస్టులను భర్తీ చేయనున్నారు. జీడిఎస్‌ పోస్టు సాధించిన వారు రోజు కేవలం 4 గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌కు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ఏబీపీఎం/డాక్‌సేవక్‌లకు తగిన ప్రోత్సాహం అందిస్తారు. 

18 నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న 10వ తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులు 23 అగస్టు 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 03 అగస్టు 2023న ప్రారంభమయ్యే ధరఖాస్తులు 23 అగస్టు 2023 రోజు ముగుస్తాయి. మహిళలు/ ఎస్సీ / ఎస్టీ / వికలాంగుల కాకుండా మిగతా వారు ఆన్‌లైన్‌ 100 ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడిఎస్‌) పోస్టుల భర్తీ అనేది పూర్తిగా మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థి 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామాకాలు చేపడుతారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ చేసేసమయంలో రిజర్వేషన్‌లను బట్టి ప్రధాన్యత క్రమాన్ని  సెలక్ట్‌ చేసుకోవాలి. విధుల్లో చేరిన వారు స్టాంపులు / స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ, ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ లావాదేవీలు వంటి విధులు నిర్వహించాలి. బీపీఎం పోస్టుకు ఎంపికైన వారికి 12000 గరిష్ఠంగా 29,380 చెల్లిస్తారు. ఏబీపీఎం/డక్‌సేవక్‌లుగా ఎంపికైన వారికి కనిష్టంగా 10,000, గరిష్ఠంగా 24,470 జీతం చెల్లిస్తారు.


Also Read : Lates Jobs in Telugu 

 

➺ India Post GDS ఎన్ని పోస్టులున్నాయి :

  • మొత్తం దేశవ్యాప్తంగా 30,041 పోస్టులున్నాయి. ఇందులో 
  • తెలంగాణలో 961 పోస్టులు 
  • ఆంధ్రప్రదేశ్‌లో 1058 పోస్టులున్నాయి. 

➺ India Post GDS పోస్టుల వివరాలు :

  • గ్రామీణ్‌ డక్‌ సేవక్‌ (జీడీఎస్‌) 
  • బీపీఎం (బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌)
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (ఏబీపీఎం)

➺ India Post GDS పరీక్ష ఫీజు :

  • Rs. 100/- జనరల్‌ / ఓబిసి అభ్యర్థులకు 
  • ఫీజు లేదు - మహిళలు/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు 

➺ India Post GDS ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ లో ధరఖాస్తు చేసుకోవాలి.

➺ India Post GDS అర్హత :

  • పదవ (10వ) తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. 
  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కల్గి ఉండాలి. 
  • సైకిల్‌ తొక్కడం రావాలి 

➺ India Post GDS వయోపరిమితి :

  • 18 నుండి 40 సంవత్సరాల మద్యలో ఉండాలి.
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 15 సంవత్సరాల వరకు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

➺ India Post GDS ఎంపిక ప్రక్రియ :

అభ్యర్థులు పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకం చేపడుతారు. ప్రకటనలో ఖాళీగా ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌ / అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొనడం జరిగింది. వీటి ఆధారంగా అభ్యర్థులు తమ ప్రాధాన్యం మేరకు ఎంపిక చేసుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్‌ 1, తర్వాత దానికి ఆప్షన్‌ 2 ఇలా పెట్టుకుంటూ వెళ్లాలి. అవకాశాన్ని, రిజర్వేషన్‌లను బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ ఇస్తారు. ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్‌ / ఈమెయిల్‌ / పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు. 


Also Read : Gk Questions in Telugu 


➺ India Post GDS ధరఖాస్తుకు కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • పాస్‌పోర్టు సైజు ఫోటో 
  • అభ్యర్థి సంతకం 

➺ జీతం  : 

  • ఏబీపీఎం / జీడిఎస్‌కు రూ॥10,000/-  నుండి 24,470/- చెల్లిస్తారు. 
  • బీపీఎంకు రూ॥12,000/-  నుండి 29,380/- చెల్లిస్తారు.

➺ India Post GDS ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్‌ విడుదల -    02 అగస్టు 2023

ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభ తేది -    03 అగస్టు 2023

ఆన్‌లైన్‌ ధరఖాస్తు చివరి తేది -    23 అగస్టు 2023

ఆన్‌లైన్‌లో మార్పులు -    24 అగస్టు 2023 నుండి 26 అగస్టు 2023 వరకు 


➺ India Post GDS చేయాల్సిన విధులు :

➣ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం) :

ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబందిత బ్రాంచి కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతో పాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంక్‌ వ్యవహరాలు చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌సాక్షన్‌లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహరాలు చూసుకోవాలి. టీమ్‌ లీడర్‌గా సంబంధిత బ్రాంచిని నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 

➣ అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టుమాస్టర్‌ (ఏబీపీఎం) :

ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత స్టాంపులు / స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంక్‌ సంబంధించిన డిపాజిట్స్‌, పేమెంట్స్‌ ఇతర లావాదేవీలను చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్ధేశించిన పనులను పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. 

➣ డాక్‌సేవక్‌ :

ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలను పంపిణీ చేయాలి. స్టాంపులు / స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం నిర్ధేశించి పనులను పూర్తి చేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ విధులను చూసుకోవాలి. పోస్టల్‌ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలి. 


Also Read : Gk in Telugu 


కెటగిరి‌ జాబ్స్
నిర్వహించు సంస్థ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ‌
పోస్టు పేరు గ్రామీణ డాక్‌ సేవక్‌
దేశం ఇండియా
మొత్తం ఉద్యోగాలు 30,041
ఎక్కడ దేశవ్యాప్తంగా
తెలంగాణ పోస్టులు 961
ఆంధ్రప్రదేశ్‌ పోస్టులు 1058
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్
విద్యార్హత ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి)
వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాలు
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభం 03 అగస్టు 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ముగింపు 23 అగస్టు 2023
పూర్తి సమాచారం కొరకు Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తుల కొరకు Click Here
నోటిఫికేషన్‌ కొరకు Click Here

Important Dates
నోటిఫికేషన్‌ విడుదల 02 అగస్టు 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభ తేది 03 అగస్టు 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు చివరి తేది 23 అగస్టు 2023
ఆన్‌లైన్‌ పేమెంట్‌ చివరి తేది. 23 అగస్టు 2023
ఆన్‌లైన్‌లో మార్పులు 24 అగస్టు 2023 నుండి 26 అగస్టు 2023 వరకు

Salary Details
ఏబీపీఎం / జీడిఎస్‌ రూ॥10,000 - 24,470/-
బీపీఎం రూ॥12,000 - 29,380/-
1) India Post GDSలో ఎన్ని పోస్టులున్నాయి ?

జవాబు : India Post GDSలో మొత్తం 30041 పోస్టులున్నాయి. ఇందులో తెలంగాణ-961, ఆంధ్రప్రదేశ్‌-1058 ఉన్నాయి.

2) India Post GDSకు ఆన్‌లైన్‌ అప్లై ప్రారంభ తేది ఏమిటీ ?

జవాబు : India Post GDS ఆన్‌లైన్‌ ధరఖాస్తులు 03 అగస్టు 2023 నుండి ప్రారంభమవుతాయి.

3) India Post GDS‌ ఎంపిక ఎంపిక విధానం ఎలా ఉంటుంది ?

జవాబు :India Post GDS‌ ఎంపిక అనేది అభ్యర్థులు వారు సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ‌

4) India Post GDS‌ పోస్టులు జీతం ఎంత చెల్లిస్తారు ?

జవాబు : ఏబీపీఎం / జీడిఎస్‌కు రూ॥10,000/- నుండి 24,470/- మరియు బీపీఎంకు రూ॥12,000/- నుండి 29,380/- చెల్లిస్తారు.

5) India Post GDS‌ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలంటే వయస్సు ఎంత ఉండాలి ?

జవాబు : 18 నుండి 40 సంవత్సరాలుండాలి (రిజర్వేషన్‌ బట్టి సడలింపు ఉంటుంది)

Post a Comment

0 Comments