భూమి చిట్టచివరి ప్రాంతం .. ! మానవ మనుగడ లేని ప్రాంతం || Antarctica Continent in Telugu || Indian Geography in telugu

భూమి చిట్టచివరి ప్రాంతం .. ! మానవ మనుగడ లేని ప్రాంతం || Antarctica Continent in Telugu || Gk in Telugu

అంటార్కిటికా ఖండం

Antarctica in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu

భూమి చిట్టచివరి ప్రాంతం 

మానవ మనుగడ లేని ప్రాంతం 

అది భూమి యొక్క చిట్టచివరి ప్రాంతం. ఎటూచూసినా మంచుమయం. అక్కడ వృక్షాలు, మానవులు కనిపించవు. మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు. అదే భూగోళానికి అంచు ప్రాంతంగా చెప్పుకునే అంటార్కిటికా ప్రాంతం. ఎన్నో వింతలు, విశేషాలతో కూడుకొని ఉండి పరిశోధలకు ఇప్పటికి అంతుచిక్కకుండా ఉన్న ఈ అంటార్కిటికా ప్రాంతం గురించి తెలుసుకుందాం పదండి .. 

భూమి యొక్క దక్షిణార్థ గోళంలో ‘‘అంటార్కిటిక్‌ వలయం లోపల దక్షిణ ధృవాన్ని ఆవరించి ఉన్న విశాల ప్రదేశాన్ని ‘‘ అంటార్కిటికా ఖండం’’ అని పిలుస్తారు. ఇది ఏడు ఖండాలలోకెల్లా ఐదవ పెద్ద ఖండం. ఇక్కడ ప్రపంచంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతం నమోదు అవుతాయి. అంతుచిక్కని తుఫానులు సంభవిస్తాయి. ఒకవేళ అంటార్కిటికా ఖండంలోని మంచు కరిగితే మాత్రం ప్రపంచంలోని సముద్రమట్టాల ఎత్తు 55 మీటర్లు పెరుగుతాయి. ఇది మానవజాతికి నాశనానికి దారితీయవచ్చు. అంటార్కిటికాలోని మొత్తం ప్రాంతంలో 98 శాతం ప్రాంతం దళసరి మంచుపొరతో కప్పబడి ఉంటుంది. భూమిపై గల దాదాపు 90 శాతం మంచు, 75 శాతం నీరు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అతిపెద్ద హిమానీ నదులైన లాంబార్డ్‌, బియర్డ్‌ మోర్‌ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఇక్కడ మానుగడకు గాని, వృక్షాల పెరుగుదలకు గాని అవకాశం ఉండదు. 

➸ అత్యల్ప ఉష్ణోగ్రత :

ప్రపంచంలో అంటార్కిటికా ఖండాన్ని మొదటిసారిగా 1911 లో రోల్డ్‌ అముడ్సన్‌ చేరుకున్నాడు. ఈ అంటార్కిటికా ఖండంలో ఎత్తయిన శిఖరం పేరు విన్సన్‌ మాసిఫ్‌ (4892 మీ॥). ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -88.3 డిగ్రీలు సంభించింది ఈ ఖండంలోని ఓస్టాక్‌/జివోస్టాక్‌ ప్రాంతంలోనే. ఇది 1960 లో సంభవించింది. అంటార్కికా ఖండంలోని తీరప్రాంతాలలో తీవ్రమైన, దట్టమైన చలిగాలులను ‘‘కెటబాటిక్‌ పవనాలు’’ అంటారు. ఇక్కడ సంభవించే మంచు తుపానులను ‘‘బ్లిజార్డ్స్‌’’ అంటారు. ఇక్కడ సూర్యుడు 6 నెలలు నిరంతరంగా ప్రకాశిస్తు ఉంటాడు. ఈ ప్రాంతాలలో తరచూ సంభవించే కాంతిపుంజాలను అరోరా ఆస్ట్రాలిస్‌ అంటారు. ఇక్కడ వివిధ రకాల మొక్కలు కూడా పెరుగుతాయి. పాకురు, నాచు, గడ్డి మొక్కలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రాతంలో సీల్‌, నీలితిమింగాలు, పెంగ్విన్‌ వంటివి జీవిస్తాయి. పెంగ్విన్‌లు ఇక్కడ గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. పెంగ్విన్‌ల గుంపులను ‘‘రూకరిలు’’ అంటారు. ఈ ప్రాంతంలో నేలబొగ్గు, రాక్‌ఫాస్పెట్‌, యాంటిమొనీ, క్రోమీయం, ఫెర్రో మాంగనీస్‌ వంటి ఖనిజాలు లభిస్తాయి. 

అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాలు ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకొని పరిశోధనలు చేస్తున్నాయి. భారతదేశం కూడా ఇక్కడ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి వంటి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అంటార్కిటికా సంధి గా పిలిచే అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఈ ఖండం రాబోయే 50 సంవత్సరాల వరకు ప్రకృతి సాధించిన అతిపెద్ద ‘సహజ పరిశోధనాగారం’’ గా ఉంటుంది. 

అంటార్కిటికా ఖండంలో జన్మించిన మొదటి వ్యక్తిగా ఎమిలియో మార్కోస్‌ గుర్తింపు పొందాడు. ఇక్కడ ద్రవరూపంలో నీరు దొరకదు. పూర్తిగా మైనస్‌ డిగ్రీలలో ఉష్ణోగ్రత నమోదు అవుతుంది కాబట్టి మానవులు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ అడవులు మనకు కనిపించవు. ఎటూ చూసినా కనుచూపు మేరలో తీవ్రమైన మంచు కొండలు కనిపిస్తాయి. ఇదొక పూర్తి స్థాయి పరిశోధనా కేంద్రం, ఇందులో నౌకాశ్రయ, మంచు షెల్ఫ్‌లో ల్యాండిరగ్‌ స్ట్రిప్స్‌, హెలికాప్టర్‌ ప్యాడ్‌లున్నాయి. పరిశోధన కేంద్రాలకు అవసరయ్యే వసతి గృహాలు, భవనాలు, గిడ్డంగులు, సైన్స్‌ సపోర్ట్‌ కేంద్రాలు ఉంటాయి. ఉపరితలంపై కనిపిస్తున్న నదులు, సరస్సుల కంటే భూమిలోపనల చాలా మంచి నీరు ఇక్కడ గడ్డకట్టి ఉంది. ఇక్కడ రేడియో తరంగాలు వెళ్లడానికి ఎలాంటి అవరోధాలు ఉండవు. అంతరిక్ష పరిశోధనలకు, ఉపగ్రహాలపై నిఘా  పెట్టేందుకు ఇది చాలా మంచి ప్రాంతం. ఇక్కడ తరచూ మంచు తుపానులు ఏర్పడటం వల్ల మానవ మనుగడకు అసాధ్యవుతుంది. కొన్ని జీవులు మాత్రమే వీటికి తట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తాయి. 

➸ పరిశోధన స్థావారాల ఏర్పాటు  : 

దక్షిణ అమెరికా ఖండానికి చెందిన అర్జెంటీనా దేశం ఇక్కడ ‘‘ది అర్కడాస్‌ బేస్‌’’ అనే శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అంటార్కికా ఖండంలోని కొన్ని ప్రాంతాలను కొన్ని దేశాలు సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నాయి. ఆయా ప్రాంతాంలో పూర్తి అధికారాలు , హక్కులు తమకే ఉన్నాయని ప్రకటించుకున్నాయి. ఇక్కడ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్న దేశాలు ‘‘ ది అంటార్కిటిక్‌ ట్రీటీ ఒప్పందం ’’ చేసుకున్నాయి. శాంతియుత మార్గాలకు, అంతర్జాతీయ పరిశోధనల కోసం ఉపయోగించుకుంటామని ఈ ఒప్పందంలో తీర్మాణించారు. ఈ ఒప్పందంపై దాదాపు 42 దేశాలు సంతకం చేశాయి. 

అంటార్కిటికా ఖండంలో విభిన్న రకాల చేప జాతులు మనకు కనిపిస్తాయి. ప్రపంచంలో ఎక్కడా ఉండని చేప జాతులు అంటర్కాటికా ఖండంలో కోకొల్లలుగా ఉంటాయి. 

➸ అంటార్కిటికా గురించి మరిన్ని విశేషాలు :

  • అంటార్కిటికా ఖండానికి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్‌ దేశాలు దగ్గరలో ఉంటాయి. 
  • 1911లో అంటార్కిటికా దక్షిణ ధృవాన్ని మొట్టమొదటి సారిగా రోల్డ్‌ అముడ్సన్‌ అనే వ్యక్తి చేరుకున్నాడు. 
  • ఇక్కడ భారత్‌తో సహా దాదాపు 35 దేశాలు శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. 
  • 98 శాతం భౌగోళిక ప్రాంతం దాదాపు 1.6 కి.మీ మందంతో కప్పబడి ఉంటుంది. కాబట్టి అంటార్కిటికా ఖండాన్ని తెల్లని ఖండం అని పిలుస్తారు. 


Post a Comment

0 Comments