
ప్రపంచంలో టాప్ 20 నదుల గురించి తెలుసుకుందాం ? ప్రపంచంలో ప్రవహించే అత్యంత ముఖ్యమైన నదుల జాబితా Important Rivers of the World || 20 Most Important Rivers in the World || Gk in Telugu || General Knowledge in Telugu
ప్రపంచంలో మంచినీటికి ప్రధాన వనరులుగా నదులు ఉన్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత (ఈజిప్టు, మెసపటోనియా, సింధూ) లు అభివృద్ది చెందాయి. ఇప్పటికి ప్రపంచంలో అతిపెద్ద నగరాలు నదుల పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీనిని బట్టి నదులు మానవ జీవితంలో ఎంత ముఖ్యమో తెలుస్తుంది. మన జీవింతంలో ముఖ్య భూమికను పోషించే ప్రపంచ టాప్ 20 నదుల గురించి తెలుసుకుందాం పదండి.
ప్రపంచంలో అతి పొడవైన నది ఏమిటో మీకు తెలుసా ? నైలు నది ఇది 7088 కిలోమీటర్ల పొడువుతో ప్రయాణిస్తుంది. నదుల గురించి చాలా పోటీ పరీక్షలలో ప్రశ్నలు అడగడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అనేక రకాల పోటీ పరీక్షలలో నదుల నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
1) నైలు నది :
ఇది ప్రపంచంలో అతి పొడవైన నదిగా గుర్తింపు పొందింది. ఈ నైలు నది ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా, ఎరిత్రియా, సుడాన్, ఉగాండా, టాంజానియా, కెన్యా, రువాండా, బురుండి, ఈజిప్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌత్ సుడాన్ వంటి దేశాల మీదగా ప్రయాణిస్తుంది. ఇది మొత్తం 7088 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
2) అమెజాన్ నది :
ఇది ప్రపంచంలో ప్రవహించే అతి పొడవైన నదులలో రెండవ నదిగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, పెరూ, బొలీవియా, కొలంబియా, ఈక్వేడార్, వెనిజులా మరియు గయానా దేశాల గుండా మొత్తం 6992 కి.మీ ప్రయాణిస్తుంది.
Also Read : Gk Questions in Telugu
3) యాంగ్జీ నది :
ఇది చైనా దేశం గుండా ప్రయాణించే ప్రపంచంలో అతి పొడవైన మూడవ అతిపెద్ద నది. ఇది ఆసియా ఖండంలో ప్రయాణించే అతిపొడవైన నది గుర్తింపు సాధించింది. ఈ కేవలం చైనా దేశంలో మాత్రమే 6418 కి.మీ ప్రవహిస్తుంది. ఈ యాంగ్జీ నదికి యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు లభించింది.
4) పసుపు నది :
ఇది చైనా దేశంలో ప్రవహించే రెండవ అతిపెద్ద నది. ఇది చైనా దేశంలో మొత్తం 5464 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది 9 ప్రావిన్సుల గుండా ప్రయాణించి బోహై సముద్రంలో కలుస్తుంది. ఈ నది అడుగున బురద నీటి శాశ్వత రంగు కారణంగా దీనిని పసుపు రంగు నది అని పిలుస్తారు.
5) బ్రహ్మపుత్ర నది :
ఇది భారతదేశంతో పాటు చైనా, నేపాల్, బంగాదేశ్‌ల మీదుగా ప్రవహిస్తుంది. ఈ నది కైలాస పర్వతం వద్ద మానససరోవర్ ప్రాంతంలో జర్మించి దాదాపు నాలుగు దేశాలలోని 3848 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది తరచూ భారత్ - చైనాల మద్య వివాదాలకు కారణమవుతుంటుంది.
6) జాంబేజీ నది :
ఇది ఆఫ్రికా ఖండంలోని జాంబియా, అంగోలా, జింబాబ్వే, మొజాంబిక్, మలావి, టంజానియా, నమీబియా మరియు బోట్సానా దేశాల గుండా దాదాపు 2693 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ నది అనేక జీవజాతులకు నిలయంగా ఉంది. ఈ నది గుండా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విక్టోరియా, చవుమా జలపాతాలు ప్రవహిస్తాయి. ఇది ఆఫ్రికా ఖండంలో ప్రయాణించే నాల్గవ అతి పొడవైన నది.
7) గంగా నది :
ఇది భారతదేశంలో ప్రవహించే అత్యంత పవిత్రమైన నది. ఇది భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ గుండా 2525 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళఖాతంలో కలుస్తుంది.
8) కొలరాడో నది :
ఇది యునైటేడ్ స్టేట్స్, మెక్కికో దేశాల గుండా 2333 కి.మీ ప్రవహిస్తుంది. ఈ నది మరియు ఉపనదులు దాదాపు 40 మిలియన్ల ప్రజలకు నీటివనరుగా ఉంది. దీనిచుట్టురా లోయలు, వైట్ వాటర్ రాపిడ్‌లు, నేషనల్ పార్కులతో నిండి ఉంది.
9) శాన్ ఫ్రాన్సిస్కో నది :
ఇది బ్రెజిల్ దేశంలో ప్రవహించే అతి పొడవైన నది. ఈ నదిని బ్రెజిల్ దేశ ప్రజలు ‘జాతీయ సమైఖ్యత’ నది అని పిలుస్తారు. ఇది బ్రెజిల్ దేశంలో 3180 కి.మీ ప్రవహిస్తుంది.
Also Read : Gk in Telugu
10) వోల్గా నది :
ఈ నది ఐరోపాలో ప్రవహించే అతి పొడవైన నది. ఈ నది సెంట్రల్ రష్యా గుండా 3645 కి.మీ ప్రయాణించి కాస్పియస్ సముద్రంలో కలుస్తుంది. ఈ నదిని రష్యా జాతీయ నది అని కూడా పిలుస్తారు.
11) ఓబ్ ఇర్తిష్ నది :
ఈ నది రష్యా, కజకిస్తాన్, చైనా మరియు మంగోలియా దేశాల గుండా 5410 కి.మీ ప్రవహిస్తుంది. ఇది గల్ఫ్ ఆఫ్ ఓబ్‌లో ముగిసే ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద నది.
12) లీనా నది :
ఇది రష్యాదేశంలో 4400 కి.మీ ప్రవహిస్తుంది. ఇది యోనిసీ తర్వాత రెండవ అతిపెద్ద అర్కిటిక్ నది మరియు ఇది పూర్తిగా రష్యాపరిధిలో ఉన్న అతిపెద్ద నది. లీనా ప్రపంచంలోని పదకొండవ అతి పొడవైన నది.
13) మెకాంగ్ నది :
ఈ నది పశ్చిమ చైనా మరియు ఆగ్నేయాసియా మధ్య ప్రధాన వాణిజ్య మార్గం. ఇది చైనా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా మరియు వియత్నాం గుండా 4350 కి.మీ ప్రవహించి దక్షిణ చైనా సముద్రంలో కలుస్తుంది.
14) నైజర్ నది :
ఇది గినియా హైలాండ్స్‌లో ఉద్భవించి 4200 కి.మీ ప్రవహించి గల్ఫ్ ఆఫ్ గినియాలో ముగుస్తుంది. నైజర్ నది ఆఫ్రికా ఖండంలోని నైజిరియా, మాలి, నైజర్, అల్జీరియా, గినియా, కామెరూన్, చాడ్ దేశాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి వివిధ ప్రాంతీయ భాషలలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. మరియు పశ్చిమాఫ్రికాలోని ప్రధాన నది.
Also Read : Latest Jobs in Telugu
15) సాల్వీన్ నది :
16) రియోగ్రాండే నది :
17) విల్యుయ్ నది :
18) అరగువా నది :
19) పాము (స్నేక్) నది :
20) ఉరుగ్వే నది :
- కాంగో (జైర్) నది భూమద్య రేఖను రెండుమార్లు దాటి ప్రవహిస్తుంది.
- లింపోపో నది మకర రేఖను రెండుమార్లు దాటి ప్రయాణిస్తుంది.
- చైనా దేశంలో ప్రవహించే హ్వంగ్ హే (పసుపు) నదిని చైనా దు:ఖదాయని అని పిలుస్తారు.
- అమెజాన్ నదిపై ఎటువంటి వంతెనలు కనబడవు.
- సౌది అరేబియా, కువైట్, యెమెన్, బహ్రేయిన్, ఖతార్ వంటి దేశాలలో ప్రవహించే నదులు ఉండవు.
- డాన్యుబ్ నది ఆఫ్రికాలోని పది దేశాలగుండా ప్రయాణిస్తుంది. అంతేకాకుండా నాలుగు దేశాల రాజధానుల గుండా ప్రవహిస్తుంది.
0 Comments